For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోపలి దుస్తుల శుభ్రత ఎలా?

By B N Sharma
|

Wash
శరీర ఆరోగ్యం బాగా వుండాలంటే లోపలి దుస్తుల పరిశుభ్రత అవసరం. వీటిని శుభ్రం చేయటానికి కొన్ని చిట్కాలు చూడండి.

1. లోపలి దుస్తులు సరిగా వాష్ చేయకుంటే ఎలాస్టిసిటీ కోల్పోతాయి. అండర్ వైర్లు, ప్యాడ్ లు వుండే బ్రాసరీలు వాష్ చేసేటపుడు ఎంతో జాగ్రత్తగా చేయాలి.
2. గుడ్డపై వుండే లేబుల్ చదవండి. బ్రాసరీలు కాటన్, సిల్క్, శాటిన్, లైక్రా మొదలైన గుడ్డతో తయారు చేస్తారు.
3. బ్రాసరీల వంటివి ఒక బేగ్ లో వేసి ప్రత్యేకంగా మెషీన్ లో వాష్ చేయండి. చల్లని నీరు, డిటర్జెంట్ కలపండి. వాష్ చేసే ముందు బ్రాలకు హుక్ లు పెట్టండి.
4. బ్రా ల స్ట్రాప్ లను మెత్తటి బ్రష్ తో రుద్దండి. అవి పాడవకుండా వుండాలంటే ఇది మంచి పద్ధతి.
5. డార్క్ రంగులున్న గుడ్డలనను అన్నింటితో కలపకండి.
6. సిల్కు లేదా శాటిన్ దుస్తులైతే చేతితో వాష్ చేయటం మంచిది.
7. గుడ్డలపై చెమట మరకలు తొలగించాలంటే కొద్ది చుక్కలు వినేగర్ నీటిలో కలపండి.
8. లో దుస్తులను డ్రైయ్యర్ లో వేయవద్దు. గాలికి ఆరపెట్టాలి. దీనివలన అవి కుంగకుండా వుంటాయి.
9. లో దుస్తులను వేడినీటిలో కాక చల్లటి నీటిలో వుతకండి. వేడినీరు ఎలాస్టిక్ ను పాడు చేస్తుంది.
10. అండర్ వైర్లు వున్న బ్రాలను చల్లని నీటిలో చేతితో శుభ్రం చేయండి. వీటికి బ్రష్ ఉపయోగించవద్దు.

లోపలి దుస్తులు దీర్ఘకాలం మన్నాలంటే ఈ చిట్కాలు పాటించండి.

English summary

Tips To Wash & Maintain Lingerie | లోపలి దుస్తుల శుభ్రత ఎలా?

Washing undergarments is a must to maintain body hygiene and use them for a longer time. You have to maintain the lingerie so using proper techniques for washing them becomes a necessity. Take a look at the ways to wash undergarments and delicate lingerie.
Story first published:Saturday, October 22, 2011, 15:12 [IST]
Desktop Bottom Promotion