For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభ్రం చేయాలంటే...దీనికి సాటి లేదు!

By B N Sharma
|

Vinegar
వంటగది జిడ్డు, బాత్ రూమ్ వాసన, లివింగ్ రూమ్ దోమలు ఎన్నో అసౌకర్యాలు ఇంట్లో వున్నాయా? ఈ సమస్యలు పరిష్కరించాలంటే శుభ్రత కొరవడిందనుకుంటున్నారా? మీరనుకున్నది సరైనదే. ఈ సమస్యల పరాష్కారానికి దివ్యమైన క్లీనింగ్ ఏజెంట్ - వినేగార్!వినేగార్ ను ఇధనాల్ ఫెర్మంటేషన్ నుండి తీస్తారు. దీనితో శుభ్రం చేసే ఉపయోగాలు అధికం. పురుగులను తరిమేయడమే కాదు, చెడు వాసనలు కూడా రాకుండా చేసి మీ ఇంటిని ఆహ్లాదంగా వుంచుతుంది.

వినేగార్ తో ఇల్లు ఎలా శుభ్రం చేయాలో పరిశీలించండి ...
1. కిచెన్ సింక్ నీరు బ్లాక్ అయిందా? ఒక అరకప్పు వినేగార్ బేకింగ్ సోడా, ఉప్పులతో కలిపి అందులో పోసేయండి. మడ్డి ఎంత పేరుకున్నా ఖచ్చితంగా తొలగిపోతుంది.
2. కిచెన్ ప్లాట్ ఫాం లేదా ఛోపింగ్ బోర్డు వంటివి మురికి పడితే, కొద్దిపాటి వినేగార్ స్ర్పే చేసి దానిపై హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి, నీటితో కడిగేయండి. క్రిములు, మురికి మటుమాయం.
3. కిచెన్ లో వాసన వస్తోందా? కొద్దిపాటి వినేగార్ నీటిలో వేసి బాగా కొంతసేపు ఉడికించండి. వాసనలన్నీ పోతాయి.
4. ఒక కప్పు వైట్ వినేగర్ ను డిష్ వాషర్ లో పోసి సబ్బు మరకలను పోగొట్టేందుకు పూర్తిగా తిప్పండి.
5. బాత్ టబ్ లు, వాష్ బేసిన్లలో వుండే క్రిములను పోగొట్టేందుకు వినేగర్ కలిపిన నీటిని వాడండి.
6. బాత్ రూమ్ లోని షవర్ హెడ్స్ లో బ్లాకేజీలను తొలగించేందుకు వాటిని వినేగార్, నీరు కలిపిన మిశ్రమంలో నానపెట్టండి.
7. వినేగార్ ద్రావణాన్ని టాయ్ లెట్ లో పోయండి. కొంత సేపటి తర్వాత బేకింగ్ సోడా చల్లి బాగా రుద్దండి. తళ తళ లాడుతూ వుంటాయి.
8. ఒక బకెట్ నీటిలో వినేగర్ ఒక కప్పు కలిపి దానితో సెరామిక్ నేలలు శుభ్రపరిస్తే మెరుస్తూంటుంది.
9. చిన్న బకెట్ నీటిలో కప్పు వినేగర్ కలిపి ఆ మిశ్రమంలో పాత వార్తా పత్రికలను ముంచి విండో గ్లాసులను శుభ్రం చేయవచ్చు. తర్వాత పొడి పేపర్లతో తుడవండి. మరకలు, దుమ్ము పోతాయి.
10. ఇంటి ఆవరణలోని కాలిబాటలలో వినేగర్ కలిపిన నీటిని పోస్తే, పురుగులు, చీమలు మొదలైనవి చేరకుండా వుంటాయి.

English summary

Vinegar For Cleaning Your House | శుభ్రం చేయాలంటే...దీనికి సాటి లేదు!

.Keep your patios, driveways etc. cleaner by cleaning them with a solution of pure vinegar. Spray vinegar directly between the tiles to discourage the growth of unwanted weeds. This will also ensure that insects or ants will not build any nests in between the tiles.
Desktop Bottom Promotion