For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాత ఇంటికి మెరుగులు దిద్దే చిట్కాలు...

|

Home improvement...Home remodeling tips
ఇంటిసౌందర్యంలో భాగంగా ఇల్లు కట్టుకునే విధానం, ఇంటికి వేసే రంగులు, ఇంట్లో అమర్చుకొనే ఫర్నీచర్ మీదే ఆధారపడి ఉంటుంది. సొంత ఇల్లు అయినా, బాడుగ ఇల్లైనా చాలా కాలం నుండి ఎటువంటి మెరుగులకి నోచుకోక బడినివిగా కనిపిస్తుంటాయి. పాత ఫర్నీచర్, షేడ్ అయిపోయిన గోడలకు రంగులు, ఇవన్నీ కూడా ఇంటిని అందవిహీనంగా కనబడేలా చేస్తాయి. కాబట్టి వీటి తగిన మెళుకువులు పాటించినట్లైతే ఇంటి అందంగా ఆకర్షిణీయంగా మళ్ళీ కొత్త ఇల్లులా చేసుకోవచ్చు.

ఆయా గదుల గోడలకు తెలుపు బ్లూ లాంటి లేత రంగులు కాకుండా... పసుపు, డార్క్ పింక్ లాంటి గాడమైన రంగులను వేయించండి. అలా కాకుండా, ఒక్కో గదికి ఒక్కో రంగు వేయించినా కూడా బాగుంటుంది. అబ్బా రంగుల గొడవ ఎందుకులే అనుకున్నట్లయితే... సింపుల్‌గా ఓ వాల్‌పేపర్‌ను అతికించేయండి. అందమైన ప్రకృతి దృశ్యాలు, బీచ్‌లు ఉన్న వాల్‌పేపర్లను అతికించినట్లయితే చాలా బాగుంటాయి.

గది తలుపులన్నీ మూసేసి చీకటిగా చేయకుండా... వీలైనంత సూర్యరశ్మి వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి పెట్టండి. ఆర్గంజా, సాటిన్‌ సిల్క్ వంటి పలచటి కర్టెన్లను వాడండి. ఇప్పటికే మీ దగ్గర దట్టమైన కర్టెన్లు ఉన్నట్లయితే వాటికి లేసులు కుట్టించండి. పగటి పూట లేసుల కర్టెన్‌ వేస్తే ఆకర్షణీయంగా ఉంటాయి. చాలామంది గది కంతటికీ ఒకే ఒక్క లైట్‌ చాలని అనుకుంటారు. అది చాలా పొరపాటు. వీలైతే ఎదురెదురుగా రెండు ట్యూబ్‌లైట్లు అమర్చాలి. వాటికి తోడు పక్క గోడలకు లేదా గది మూలల్లో క్రిస్టల్‌ లైట్‌స్టాండ్‌ అమర్చినట్లయితే.. ఆ గదికే కొత్త అందం వస్తుంది. గది ప్రకాశవంతంగా కనిపించాలంటే ట్యూబ్‌లైట్లకు ఎదురుగా అద్దాలు బిగించి చూడండి. ఇప్పుడు అద్దాలు ఎంతో అందమైన ఫ్రేముల్లో కూడా దొరుకుతున్నాయి.

అలాగే, గదిలో ఏదో ఒక మూల కుండీల్లో మొక్కలు పెట్టి చూడండి. వాటిని చూస్తుంటే మనసుకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో మీకే అర్థం అవుతుంది. ముదురు రంగు గల సోఫాసెట్ల మీద బ్రైట్‌ కలర్ కుషన్లు అమర్చాలి. డార్క్, బ్రైట్ రంగులు చూసేందుకు ఎంతో బాగుంటాయి. అద్దాలు కుట్టిన కుషన్‌ కవర్లయితే ఇంకా బాగుంటాయి. పెయింటింగ్‌ చేసిన వస్త్రంతో తయారయిన ల్యాంప్‌షేడ్స్ గదిలో ఒక మూల అమర్చి లైట్‌ ఆన్‌ చేసి చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. ఎందుకంటే పై విధంగా చేయటం వల్ల గది చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది.

ఇక చివరగా... టైల్స్ రంగు వెలసిపోయి డల్‌గా కనిపిస్తున్నట్లయితే... వాటిమీద రంగు రంగుల డిజైన్ కార్పెట్లుగానీ, అందమైన డిజైన్లతో ఉన్న చిన్న సైజు రగ్గులుగానీ పరచండి. ఇలాంటివి హ్యాండ్‌లూమ్స్ ఎగ్జిబిషన్లలో దొరుకుతాయి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ మీదగానీ, లేదా ఇంటి మొత్తానిక ఉండే సెంటర్ టేబుల్ మీదగానీ చిన్న చిన్న దీపాలను పెట్టండంతో ఆ ఇల్లు మెరుపు కళలతో నిండి ఉంటుంది.

English summary

Home improvement...Home remodeling tips...| పాత ఇంటికి కొత్త కళ...

For most people, home is a special place. It represents our sanctuary from the world and the place where we spend quality time to rest and renew our lives. It also represents the single largest investment that we make in our lives. Since your home represents such a huge part of your life, you know that it makes good sense to do what you can to enhance and improve your home.The design and style you prefer for your home requires special attention when choosing paint colors. The types of designs and styles can lead to large impacts on paint colors to paint any home.
Story first published:Saturday, April 7, 2012, 16:54 [IST]
Desktop Bottom Promotion