For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ ఇంటికైనా కావాల్సింది ఆహ్లాదకర వాతావరణమే....

|

Home Improvement Tips for nicer Place to live
ఇంటిని ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించడం అంత సులభమైన పని కాదు. నిజం చెప్పాలంటే ప్రతి రోజూ ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపే ఆధునిక మానవుడు.. తలదాచుకునేందుకు ఎదో ఒక ఇళ్ళంటూ ఉంటే సరిపోతుంది కదా అనుకుంటున్నాడు. కాని రోజంతా ఆఫీసుల్లో పనిచేసి అలసిపోయి వచ్చినవారికి ఇంటికి చేరగానే సేదతీరేందుకు చక్కని ఆహ్లాదకర వాతావరణం ఉండటం ఇంటికి ఒంటికి ఎంతో అవసరం. ఇదే విషయాన్ని కొందరు శ్రీమంతులు గుర్తించినప్పటికీ.. ఎక్కువమంది ఈ విషయంపై ఆలోచించడం అనవసరం అనుకుంటున్నారు.

ముఖ్యంగా ఇంటి నిర్మాణంలో శ్రద్ద వహించాల్సింది వెంటిలేషన్, కిటికీలు, మెయిన్ డోర్స్ విశాలంగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రధానంగా ఇంటికి గాలి..వెలుతురు చక్కగా వచ్చే విధంగా నిర్మించుకోవాలి. అలాగే వాటికి తగ్గ అలంకరణతో పాటు ఇంట్లో వస్తువులను కూడా చిందవందరగా వేయకుండా ఎక్కడవి అక్కడ సర్థుకోవడంతో ఆ ఇంట్లో వారితో పాటు ఇంటికి వచ్చే అతిథులకు చక్కటి ఆహ్లాదాన్ని చేకూర్చినవారమవుతారు.

అయితే అలా అనుకోకుండా ఇంటిని, ఇంటితోపాటు పరిసరాలను ఉల్లాసకర వాతావరణాన్ని ఇచ్చేలా ఏర్పాటు చేసుకోవడం మంచింది. ఇంటి చుట్టూ అందమైన మొక్కలను, పచ్చిక బైళ్ళను పెంచుకోవడం ఉత్తమం. అయితే నగరాలు, పట్టణాల్లో స్థలం లేని భవంతులలో నివసిస్తున్నవారు మట్టి కుండీలలో పూల మొక్కలు, గుబురుగా పెరిగే బోన్సాయ్‌ చెట్లను కూడా పెంచుకోవచ్చు. ఇక విశాలమైన స్థలంలో ఇళ్ళు కట్టుకున్నవారు సాధ్యమైనంతగా ఇంటికి ఎండ తగలకుండా ఓ మోస్తార చెట్లను పెంచుకోవ చ్చు. అంతేగాక స్విమ్మింగ్‌ ఫూల్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యం, మానసిక ఉత్సాహాన్ని పొందవచ్చు.

English summary

Home Improvement Tips for nicer Place to live.... | ఏ ఇంటికైనా కావాల్సింది ఆహ్లాదకర వాతావరణమే....


 Home improvements can help you turn your home into a nicer place to live and increase its value in the long term. Before you start work on any kind of home improvement, it’s important to plan ahead in terms of the timescales.
Story first published:Friday, March 16, 2012, 13:00 [IST]
Desktop Bottom Promotion