Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
పోపుల పెట్టెతో ఇల్లంతా సువాసనల భరితం...!

అయితే కొన్నిసార్లు వంట చేసిన తర్వాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలు కాకుండా సుగంధ నూనెలతో పరిష్కరించుకోవచ్చు. వంట చేస్తున్నప్పుడు, ఉతకని బట్టల కారణంగా, కొన్ని రోజులపాటు ఇంటికి తాళం వేయటంవల్ల ఇంట్లో ఓ రకమైన వాసన వస్తుండటం సహజం. అయితే వీటిని పోగొట్టేందుకు ఖరీదైన రూం ఫ్రెష్‌నర్లే వాడాల్సిన పనిలేదు. ఎంచక్కా మన వంటింట్లో నిత్యం అందుబాటులో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే ఆ వాసనలకు చెక్ పెట్టవచ్చు.
చేపలు, మాంసం లాంటివి వండినప్పుడు ఇల్లంతా నిండిపోయే ఆ ఘాటు ఓ పట్టాన వదలదు. అలాంటప్పుడు ఓ కప్పు నిమ్మరసాన్ని వంటింట్లో ఓ మూలగా ఉంచితే సరిపోతుంది. అలాగే వైట్ వెనిగర్ ను వేడి చేస్తే గదులంతా తాజాగా వాసనలు వెదజల్లుతాయి. ఇంట్లోని గాల్లో తాజాదనం కావాలంటే.. వెనీలా ఎసెన్సులో ఓ దూదిముక్కను ముంచి, దాన్ని ఓ ప్లేటులో పెట్టి గదిలో ఓ మూల ఉంచితే సరి. అలాగే రెండు దాల్చిన చెక్కలు, కాసిన్ని లవంగ మొగ్గలను రెండు కప్పుల నీటిలో మరిగించాలి. ఉడికేటప్పుడు ఆవిరి నుంచి వచ్చే సువాసనతో ఇల్లంతా పరిమళభరితం అవుతుంది. చెడువాసనలన్నీ పారిపోతాయి.
ఒక కప్పు నీటిలో వంటకు వాడే చెక్కముక్కలు, కట్ చేసిన ఆపిల్ ముక్కలు వేసి బాగా మరించినట్లైతే ఇల్లంతా మంచి వాసనలతో నిండిపోతుంది. వెనిగర్ నీళ్ళను ఇల్లంతా స్ప్రే చేస్తే అతి త్వరగా చెడువాసనలను పారదోలి..గదులను తాజాగా ఉంచుంది.
వంట చేసిన తర్వాత గదంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని దానిలో దాల్చినచెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. అరబకెటు నీటిలో పావుకప్పు వెనిగర్, చెంచా నిమ్మనూనె కలిపితే గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణం నింపుతుంది. ఇంట్లో ప్రశాంతంగా గడపాలనుకు న్నప్పుడు సెంటెడ్ క్యాండిల్‌ని వెలిగించండి. సువాసనలు వెదజల్లే నూనెని నీటిలో కలిపి చేతు లుకడుక్కొని ఆ వాసనని ఆస్వాదిస్తుంటే ఆ ఆనంద మే వేరు.



Click it and Unblock the Notifications
