For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వార్డ్ రోబ్ ఎలా మెయింటైన్ చేయాలి...

|

How to maintain wardrobe...?
ప్రతిఒక్కరూ దుస్తులు, వాటికి మ్యాచింగ్‌ యాక్ససరీస్‌ లతో వార్డ్‌ రోబ్‌ ను సర్దుకొంటారు. అయితే కొన్నిసార్లు అవసరానికి ఏది దొరకదు. టైం అయిపోతుందని హడావుడిలో ఒకటి లాగితే పది కిందకు పడిపోతుంటాయి. ఈ చిక్కంతటికీ కారణం యువత డ్రెస్‌ ఎంపికలో తీసుకునే జాగ్రత్త వార్డ్‌ రోబ్‌ సర్దుకోవడంలో అవగాహన లేకపోవడమే. అందుకే అప్పుడప్పుడు కాస్త శ్రద్ధ పెడితే చూడగానే చటుక్కున తీసుకునే విధంగా చేసుకోవచ్చు.

ఇదివరికటిలా బట్టలు సర్దుకోవడానికి బీరువాలు, చెక్కబీరువాలు, అల్మారాలు ఉపయోగించే వారు. అయితే ఇప్పుడు రాను, రాను ఇవి కనుమరుగు అయిపోతున్నాయి. పట్టణాలకి జీవనాపాధి కోసం జనాభా వలసి వెల్లడం, పట్టణీకరణ పెరగడంతో చిన్న చిన్న అపార్ట్ మెంట్ లు కట్టి అద్దెలకు ఇచ్చేస్తున్నారు. అపా ర్ట్‌ మెంట్‌ గదులు చిన్నవిగా ఉండడం వల్ల అల్మారాలు పెట్టుకోవటానికి స్థలం సరిపోదు. అందుకే వార్డ్‌ రోబ్‌ లో ఇతర వస్తువులను కూడా చేర్చేస్తుంటారు. అయితే వార్డ్ రోబ్ లలో బట్టలే కాకుండా ఇతర వస్తువులను పెట్టేస్తున్నారు. అలాంటిఅనవసరమైన వాటిని తీసి బయట మరేదైన ప్రదేశంలో పెట్టుకోవాలి. అలా చేయకపోతే అన్ని అందులో మనకు కావలసిన వాటిని ఎక్కడ ఉంచుకోవాలో తెలియక అవసరమైనప్పుడు వాటిని తీయ్యడానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే వార్డ్‌ రోబ్‌ సర్దే పనిలో ఇది మొదటగా చేయాలి.

అలా చేయకపోతే చిన్న చిన్న దుస్తులు సమయానికి కనబడవు. దుస్తుల మధ్యలో ఉండిపోయి ఇబ్బంది పెట్టిస్తాయి. అందులో ముఖ్యంగా టైలు, పాంటీస్‌, సాక్స్‌, కర్చీఫ్‌లు, లోదుస్తులు. ఇటువంటివి చిన్న అందమైన బుట్టలో వేసుకుని వార్డ్‌ రోబ్‌ లో ఒక అల్మారాలో పెట్టుకోవాలి. లేదా హ్యాంగర్స్ ని ఉపయోగించి వాటిలో తగిలించుకోవాలి. అల్మారాలో తగిలించిన దుస్తుల ప్రదేశంపైన, వాటి తాలూకు వివరాలతో ట్యాగ్‌ అంటిస్తే వెతుక్కోవటం అనే సమస్య ఉండదు. టైమ్‌ వేస్ట్‌ కాకుండా ఉంటుంది. దుస్తులన్ని పొందిగ్గా ఉంటాయి. వెతుకులాటలో సర్దిపెట్టుకున్న దుస్తులు చిందర వందర లేకుండా ఉంటాయి. ఒక్కో సీజన్‌కి ఒక్కో రకం దుస్తులు వాడుతుంటాం. సీజన్‌ కి అనువుకాని షూస్‌, దుస్తుల కోసం ప్రత్యే అరలు కేటాయించుకోవాలి. ఈ అరలు పార దర్శకంగా ఉన్నవి అయితే మరీ మంచిది. అవసరం పడినపుడు ఎక్కడవున్నా గుర్తించవచ్చు.

English summary

How to maintain wardrobe...? | వార్డ్ రోబ్ ఎలా మెయింటైన్ చేయాలి...

A wardrobe is relatively easy to maintain. A new stain, run, snag or tear are easy to remedy. Here's a few tips.
Story first published:Wednesday, February 22, 2012, 16:05 [IST]
Desktop Bottom Promotion