For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెరుపు తగ్గని పట్టు....పట్టు వదలని మహిళ...!

|

Maintaining and Storing Tips for Pattu Saree.
వేసవి సీజన్ అంటేనే పెళ్ళిళ్ల సీజన్. పెళ్ళిళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా పట్టు చీరలు కట్టాలనుకుంటుంటారు. హిందూ సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు, నైలెక్స్ చీరల ధరలు కూడా ఎక్కువే. వేల రూపాయలు పోసి కొనుక్కునే చీరలను సరిగా కాపాడుకోకపోతే వాటి అందం చెడిపోయి వెలవెలపోతాయి. అయితే ఇలాంటి ఖరీదయిన చీరలను ఎలా కాపాడుకోవాలో తెలియక చాలా మంది పనిమనుషులకో, చాకలికో వేసిఆ తర్వాత వెలిసిపోయినట్లు కనిపించే చీరలను చూసి కన్నీళ్ల పర్యంతం అవుతుంటారు. కాస్త జాగ్రత్త తీసుకుంటే ఇలాంటి చీరలను ఏళ్ల తరబడి కొత్త వాటిలాగా కనిపించేట్లు కాపాడుకోవచ్చు.

పట్టు చీరలు ఉతికేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: పట్టుచీరలను మృదుజలంతో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు బోరాక్స్ లేదా అమోనియంను వాడాలి. నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి.
సబ్బులోని మట్టిని తొలగించడానికి పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జాడించాలి. చివరగా చల్లని నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి. అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే ముందు 1 నుంచి 2 నిముషాలు చిటికెడు సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ కలిపిన చల్లని నీటితో తడపాలి. పట్టు వస్త్రాలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి తడిని తీయాలి. పట్టు చీరలను గదిలో నీడ పట్టున వేలాడ దీసి ఆరబెట్టాలి.

ఏదయినా ఫంక్షన్‌కో, పెళ్లిళ్లకో పట్టు చీర, లేదా వర్క్ చీర కట్టుకుని వెళ్లే అలవాటున్నప్పుడు దాన్ని సరిగా కాపాడుకోవడం కూడా తెలియాలి. చీర కొన్నప్పుడు అది పట్టు చీరయినా, ఎంబ్రాయిడరీ చీరైనా సరే దానికి ఫాల్స్ వేయించి, చీరకు కుచ్చులు కట్టిస్తే దాని అందం పెరుగుతుంది. ఫ్యాన్సీ చీరలకు కూడా ఫాల్స్ వేయించి, చీర అంచులను కుట్టించి, పైటకొంగు నిండా వర్క్ ఉంటే అది పాడవకుండా ఉండడానికి చీర రంగును పోలిన నెట్‌ను కుట్టిస్తే చీర వర్క్, లేదా ఎంబ్రాయిడరీ పాడవకుండా ఉంటుంది.

చీరను బీరువాలో హ్యాంగర్‌ కు వేలాడదీయరాదు. భారానికి మధ్యలో చినిగి పోవచ్చు. ముడతలు కూడా వచ్చే అవకాశముంది. పట్టు చీరను తెల్ల బట్టలో చుట్టి శుభ్రంగా మడిచి బీరువాలో ఉంచాలి. చీరను ఉపయోగించాక దానిలో దుమ్మూ, ధూళి, చెమట వాసన ఉంటాయి. ఫంక్షన్ ముగించి ఇంటికి వచ్చాక పొద్దు పోయిందనో, ఓపిక లేదనో నిర్లక్ష్యంగా విడిచి ఎక్కడంటే అక్కడ పడేయకుండా గాలిలో ఆరేయాలి. ఇలా చేయడం వల్ల మరోసారి చీర కట్టినా కొత్తదానిలాగా మెరుపు తగ్గదు.

English summary

Maintaining and Storing Tips for Pattu Saree...! | అతివలు మెచ్చే పట్టు....!

If it is special occasions then silk sarees are the favorite choice of most Indian women. Silk is always rich and elegant and has no match for celebrations. Specially, the south Indians, as their wedding ritual cannot take place without the silk attires. If silk looks extremely classy then there are equal maintenance issues with the fabric. The fabric can't be frequently washed, the stains removal isn't that easy. Today, we shall see how to maintain silk sarees (saree care) with these simple tips.
Story first published:Wednesday, May 9, 2012, 14:56 [IST]
Desktop Bottom Promotion