For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగది అందంగా కనిపించాలంటే.....

|

Needful Ideas for Bedroom Improvement
ప్రస్తుతం కొన్ని ఇల్లలో విశ్రాంతి తీసుకునేందుకు మాత్రమే వినియోగించాల్సిన పడక గదులను ప్రస్తుతం, భోజనం చేసేందుకు, చదివేందుకు, ఇతర ఆఫీస్‌ కార్యకలాపాలు, కంప్యూటర్‌ వినియోగానికి అధికంగా వాడుతున్నారు. అయితే పడకగది ఎలా ఉంచుకోవాలో అలానే వాడుకోలి. అనవసరమైన వాటికి తావివ్వకూడదు. అలాగే పడకగదిని స్టోర్ రూం గా మార్చేస్తుంటారు కొందరు. అలా చేయడం వల్ల ఆ గది ఆసహ్యంగా కనిపించడమే కాకుండా దుమ్ము దూళి చేరుకుని అనారోగ్యానికి దారితీస్తుంది.

మనిషికి సంబంధించిన ఏకైక ఏకాంత ప్రదేశం పడకగది. దాన్ని సరిగా పెట్టుకుంటేనే అందం, పొందిక ఏర్పడతాయి. పడకగది అనేది అన్ని వస్తువులను కలిపి ఉంచే స్టోర్ రూమ్ కాదని గుర్తుంచుకోవాలి. మాసిన బట్టలను, ప్రతి రోజు తీసేసిన బట్టలను మీ పడకగదిలో బెడ్‌కింద పడేయవద్దు.

ఆహార పదార్ధాలను పడకగదిలో ఉంచకండి. పడకగదిలోనే కూర్చుని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదికాదు. అలాగే హార పదార్ధాలను పడకమీద పెట్టుకుని తినకండి. పిల్లలు పడకపైనే తింటామని మారాం చేస్తే, పడకపై ఓ ప్లాస్టిక్ క్లాత్ పరిచి తర్వాత వారికి వడ్డించండి.

పిల్లలు బెడ్ మీదకు చేరకముందే కాళ్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే బెడ్ ఎక్కడం నేర్పించండి. బెడ్ పక్కన కాళ్లు తుడుచుకునే మ్యాట్‌ ను తప్పనిసరిగా ఉంచుకోండి. మాసిన బెడ్‌ షీట్లు, పాత న్యూస్ పేపర్లు, ప్లవర్‌ వాజ్‌ లలో వాడిన పువ్వులను ఎప్పటికప్పుడు మార్చేస్తుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది.

మీ పడకగదిలో రెండు కుర్చీలు ఏర్పాటు చేయండి. దీంతో ఇంటికి వచ్చిన అతిథులు సరాసరి బెడ్ మీద కూర్చోకుండా కుర్చీల్లో కూర్చుంటారు. పడకగదికి అటాచెడ్ బాత్రూమ్‌ లు ఉంటే వాటిని ప్రతిరోజు తప్పనిసరిగా శుభ్రపరుస్తుండండి. నిత్యం పడకగదిలో రూమ్ ప్రెషనర్స్ ఉపయోగించండి. దీంతో మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది.

అవసరమనిపిస్తే రూమ్‌ ప్రెషనర్స్‌ ఉపయోగించండి. అందుకు వసరమనిపిస్తే బెడ్ ప్రక్కనే ఒక చిన్న అల్మారాను ఏర్పాటు చేసుకొంటే అందులో రూం ఫెషనర్స్, నైట్ బ్యూటీ ప్రొడక్ట్స్ అందులో పొందుపరచుకోవచ్చు. ఎక్కువ సమయం బెడ్‌ రూములో మేలుకోవలసి వస్తే బెడ్‌ ల్యాంపును ఉపయోగించండి. చిన్నగా కాంతిని విడుదల చేసే విద్యు త్‌ దీపాలను వాడటం వలన విశ్రాంతికి అను వుగా ఉంటుంది. అలాగని మరీ తక్కువ కాంతి నిచ్చే బల్బులను వినియోగిస్తే కంటి చూపుపై ప్రమాదం పడే అవకాశం సైతం ఉంది కాబట్టీ మధ్యస్తంగా వెలుతురునిచ్చే బల్బులను వాడటం ఉత్తమం.

English summary

Needful Ideas for Bedroom Improvement... | పడకగది అందంగా కనిపించాలంటే.....

A bedroom is a most intimate area in each flat. So, bedroom improvement should be paid much attention to. It is of course better to hire a qualified designer to get competitive bedroom improvement ideas.
Story first published:Friday, March 30, 2012, 12:37 [IST]
Desktop Bottom Promotion