For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాస్తంత ఓపిక ఉంటే చాలు ఫ్రిజ్ ను క్లీన్ చేయడం సులభమే...

|

Tips for Cleaning Out the Fridge (Refrigerator)
వేసవి వచ్చేసింది..ఎండలు మండిపోతున్నాయి..చల్లచల్లగా ఏదైనా పానీయం సేవిస్తే ఉల్లాసంగా ఉంటుంది అనుకుంటాం. మనఇంట్లో ఫ్రిజ్ ఉంటే బాగుండు అనుకుంటాం. వేసవిలో ఫ్రిజ్ వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. రుచికరంగా ఉన్న కూర ఏదైనా మిగిలితే వెంటనే వచ్చే ఆలోచన దాన్ని ఫ్రిజ్‌ లో పెట్టి రేపు వేడి చేసుకు తిందామని. అలాగే పాలు, పెరుగు, పూలు, ఒకటేమిటి రకరకాల పదార్ధాలను నిల్వ ఉంచడానికి ఫ్రిజ్‌ ను ఉపయోగించడం సర్వసాధరణంగా మారిపోయింది.

అయితే దానిని ఎప్పటికప్పుడు శుభ్రపరచకపోతే మాత్రం పురుగులు చేరి మొదటికే మోసం వచ్చే అవకాశముంది. కనుక ఫ్రిజ్‌ లో చెత్తచేరిపోయిందనిపించిన వెంటనే శుభ్రం చేయడం మంచిది. ఫ్రిజ్‌ ను శుభ్రం చేయడం కాస్త ఓపికతో కూడుకున్న పనే. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే అది అవసరం. ఫ్రిజ్‌ ను శుభ్రం చేయాలనుకున్నప్పుడు ముందుగా అందులో ఉన్న పదార్ధాలన్నీ తీసి బయటపెట్టాలి. చద్దివాసన కొట్టేవి, కుళ్ళిపోయినవి ఉంటే తీసి విసిరేయాలి. తర్వాత అందులో ఏమేం పెట్టాలో నిర్ణయించుకోవాలి.

ఫ్రిజ్‌ లో తొలగించేందుకు అనువుగా ఉన్న భాగాలన్నీ తీసి పక్కన పెట్టాలి. కింద ఉండే డ్రిప్‌ ట్రేతో సహా. నాన్‌ టాక్సిక్‌ సోప్‌ తీసుకుని గోరు వెచ్చటి నీళ్ళలో కలిపి ఒక స్పాంజ్‌ తో వాటిపి శుభ్రం చేయాలి. అయితే అమోనీయా, బ్లీచ్‌ కలిగిన క్లీనింగ్‌ ప్రోడక్ట్‌ లను ఫ్రిజ్‌ కు ఉపయోగించకపోవడమే మంచిది. శుభ్రం చేసిన తర్వాత ఒక పొడి టవల్‌ తో తుడవాలి. ఆ సబ్బునీళ్ళతోనే ఫ్రిజ్‌ లోపల, డోర్‌ ను కూడా కడగాలి. తర్వాత శుభ్రంగా పొడిగా తుడవాలి. తర్వాత ఫ్రిజ్‌ లో షెల్ఫ్‌ లను అమర్చాలి. ఫ్రిజ్‌ ల మోడళ్ళు మారినా కొన్ని ప్రాథమిక అంశాలు ఒకేరకంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పనులు చేసేటప్పుడు ఎలక్ట్రిక్‌ స్విచ్‌ కట్‌ చేయడం మరచిపోకండి.

కూరగాయలను క్రిస్పర్‌ డ్రాయర్‌ లోనే పెట్టాలి. ఎందుకంటే ఆ అరలో టెంపరేచర్‌ కూరగాయలకు అనువుగా ఉండేలా అమరుస్తారు. వాటిని జిప్‌ లాక్‌ బ్యాగులలో పెట్టడం మరీ ఉత్తమం. మాంసం, పాల డబ్బాలు, గుడ్లు తలుపుకు ఉన్న అరలలో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్‌ లో టెంపరేచర్‌ కన్నా తలుపు దగ్గర వెచ్చదనం ఎక్కువగా ఉంటుంది. కనుక అందులో జ్యూసులు, వైన్‌ వంటివి మాత్రమే పెట్టుకోవడం ఉత్తమం. మాంసం, చికెన్‌ వంటివాటిని దాచాలనుకున్నప్పుడు వాటిని ఒక ప్లాస్టిక్‌ బ్యాగులో పెట్టి పెట్టడం ఉత్తమం. తద్వారా అవి అవసరమైనంత చల్లదనంలో ఉండడమే కాకుండా కింద ఉన్న వాటిపై ప్రభావం ఉండదు.

పెరుగు, పాలు, చీజ్‌, వెన్న వంటివాటినన్నింటినీ ఒకే చోట కలిపి పెట్టడం మంచిది. అలాగే పళ్ళ విషయమైనా. ఇక బీర్‌, సోడాలు కలిగి ఉండేవారు వాటన్నింటినీ వరుసలలో పెట్టుకోవడం వల్ల లుక్‌ బాగుంటుంది. సామాన్లను తిరిగి ఫ్రిజ్‌ లో పెడుతున్నప్పుడు ఒక్కొక్క దానినీ తడి బట్టతో తుడిచి లోపల పెట్టాలి. తద్వారా జిగట ఫ్రిజ్‌ కు అంటకుండా పరిశుభ్రంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు బేకింగ్‌ సోడా డబ్బాను ఫ్రిజ్‌ లో తప్పనిసరిగా ఉంచాలి. ఎందుకంటే ఏవైనా వాసనలు వస్తుంటే వాటిని అది పీల్చుకొని ఫ్రిజ్‌ ను శుభ్రంగా ఉంచుతుంది. ఫ్రీజర్‌ ను ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్‌ చేసుకుంటూ ఉండడం చాలా అవసరం

English summary

Tips for Cleaning Out the Fridge (Refrigerator) | ఫ్రిజ్ క్లీనింగ్ లో సులభమైన చిట్కాలు...


 Before cleaning the interior of the fridge, fill each drawer with the same amount of baking soda solution in each one and let the baking soda solution do the dirty work while you are wiping out the inside of the fridge.
Story first published:Monday, March 12, 2012, 15:30 [IST]
Desktop Bottom Promotion