For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి కిటికీ అద్దాలు మిళమిళ మెరవాలంటే...

|

Home Improvement
మహిళలు తమ ఇంటిని శుభ్రంగా పెట్టుకొనే విధానాన్ని బట్టి వారు ఎలా ఎంటారో అంచనా వేస్తారు. కాబట్టి వీలైనప్పుడు ఇంటిని శుభ్రం చేసి సుందరంగా తీర్చిదిద్దండి. ఇంటిని అందంగా ఉంచుకోవడం అంటే కేవలం కనిపించే వస్తువులే కాదు కనిపించని వాటిని సైతం శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఇల్లు నిజంగా బృందావనం అవుతుంది. మొదటగావిండో గ్లాసులను శుభ్రపరచే ముందుగా సహాయకారిగా వుండే కొన్ని చిట్కాలు తెలుసుకొందాం.

కిటికీలు(విండోస్): 1. ఎండగా ఉన్నప్పుడు కిటికీలను శుభ్రం చేస్తుంటే సన్‌ గ్లాసెస్‌ పెట్టుకోండి. లేదంటే ఎండ కళ్లపై పడి ఎలా తుడుస్తున్నారో కనిపించదు.

2. కిటికీ అద్దాలను బయట వైపు అడ్డంగా, లోపలివైపు నిలువుగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏవైపు సరిగా శుభ్రం అవ్వలేదో కనిపిస్తుంది.

3. కిటికీలు బాగా మురికిగా ఉంటే నాలుగు లీటర్ల నీటిలో మూడు లేదా నాలుగు టేబుల్‌ స్పూన్‌లు వెనిగర్‌ వేసి తుడవండి.

4. ఎత్తు ఎక్కువగా ఉన్న ప్లేస్ లో తప్ప మరెక్కడ లాడర్స్ ఉపయోగించకండి.

5. సోప్ వాటర్ తో క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ డిటర్జెట్ ను వాడకండి.

6. కిటికీలు ఎక్కువ మురికి పట్టింటే తప్పు ఎక్కువ వాటర్ ను ఉపయోగించకండి.

7. కిటికీలు శుభ్రపరుచుకోవడానికి కరెక్ట్ టూల్స్, సోప్స్, లిక్విడ్స్ ఉపయోగించాలి. అలాగే లిక్విడ్ తో తుడవడం పూర్తి అయిన తర్వాత పొడి బట్టతో లేక న్యూస్ పేపర్ తో ఒక సారి తుడవాలి.

English summary

Window Cleaning Tips for crystal clear Windows |ఇంటి పరిశుభ్రతా ఓ కళే....|

Many people put off cleaning windows or struggle through it because they make the same mistakes. ust use the professional squeegees, soap and applicators I have already spoken of. If you don’t, your windows will look like they do now!
Story first published:Wednesday, January 4, 2012, 12:43 [IST]
Desktop Bottom Promotion