For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటగదిని విస్మరిస్తే ఇక అంతే సంగతులు...!

|

ఇటీవలికాలంలో ఎలర్జీలు చాలామందిని బాధిస్తున్నాయి. కారణం మీద దృష్టి సారించకుండా ఏదో ఒక మందు మింగేసి ఎలర్జీలను తగ్గించుకుందామనుకుంటే అవి తగ్గకపోగా మరింత మొండిగా తయారవుతాయి. రకరకాల కాలుష్యాలు, ఆహారం, మందులు, రసాయనిక పదార్థాలు ఇలాంటివన్నీ ఎలర్జీలను కలిగిస్తున్నప్పటికీ, ఇంట్లో కలిగే ఎలర్జీలు ప్రధానమైనవి. ఎందుకంటే, మనం రోజులో సగం సమయం కంటే ఎక్కువ సేపు ఇంట్లోనే గడుపుతాం. ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే ఇల్లు, ఇంట్లోని పరిసరాలు ఆరోగ్య కరంగా, ఎలర్జీలు కలిగించని విధంగా ఉండాలి.

వంటగది: మీరు తరచూ వంటకు వినియోగించిన పాత్రలు, వంటగదిలో ఉపయోగించే తువాళ్ళను డిటర్జెంట్లతో శుభ్రపరుస్తుంటారు. అయినే కూడా ఏదో ఒకప్రదేశంలో, మూలలో కంటికి కనబడని బ్యాక్టీరియా, క్రిములు చేరి ఇంటిల్లిపాదికి అనారోగ్యానికి గురిచేస్తాయి. వంటగది ప్లోర్, స్లాబ్, గ్యాస్ స్టౌ, ఓబెన్, ఎక్సాస్ట్ ఫ్యాన్ వంటివి శుభ్రం చేస్తే సరిపోదు...! మరికొన్ని చిన్న చిన్న వస్తువులపై క్రిముల తిష్టవేసి వుంటాయి, వాటిని అంతగా పట్టించుకోరు. బ్యాక్టీరియా, క్రిములు ఉండే అటువంటి వస్తువులు, ప్రదేశాల గురించి కొన్ని మీకోసం ...

1. స్టౌ: వంట సమయంలో వెలువడే పొగవల్ల అనేక మందికి శ్వాసకోశ సంబంధమైన ఎలర్జీలు వస్తాయి. స్ట వ్‌కి పైన ఒక ఎగ్జ్‌ హాస్ట్‌ ఫ్యాన్‌ అమర్చితే వండేటప్పుడు వెలువడే పొగ బయటకు వెళ్లిపోతుంది.

2. క్యాబినెట్‌లు/అల్మరాలు/కౌంటర్లు: సింక్‌ క్రిందనుండే క్యాబినెట్లను, కౌంటర్‌పైన ఉపరితలాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. వీటిని శుభ్రపరిచేటప్పుడు కీటాణునాశక శక్తి ఉండే పదార్థాలను వాడాలి. ఆహారపదార్థాలు, నీళ్లు ఈ రెంటికీ బొద్దింకలు ఆకర్షితమవుతాయి. ఎలర్జీలు కలగడానికి బొద్దింకలు ప్రధాన కారణమన్న సంగతి తెలిసిందే. అందుకే, రాత్రిపూట అన్ని రకాల ఆహారపదార్థాలనూ గాలి చొరబడని డబ్బాల్లో ఉంచి మూతలు బిగించాలి.

3. ఫ్రిజ్‌: కరెంటు పోయి వస్తుండటం మనకు పరిపాటి. ఇటువంటి పరిస్థి తుల్లో ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలు చెడిపోయి ఎలర్జీని కలిగించే అవకాశం ఉంది. రిఫ్రిజిరేటర్‌లో ఒకవేళ అధికంగా చెమ్మ, తడి వంటివి ఉంటే తుడిచేయాలి. తడి లేకుండా చేస్తే బూజు పెరగకుండా ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌ లోపలి గోడలను, షెల్ఫ్‌లను వంటసోడా కలిపిన నీళ్లతో శుభ్రపరచాలి.

How To Clean Kitchen

4. కిచెన్ షింక్: వండిన పాత్రలను, కిచెన్ షింకు నిండా వేసేస్తుంటాం. వాటిని అప్పటికప్పుడు శుభ్రపరచుకోకుంటే అతి త్వరగా బ్యాక్టీరియా, క్రిములు వృద్ధిచెందడానికి దారితీస్తుంది. కాబట్టి ఏమైనా ఆహారపదార్థాలు మిగిలి ఉంటే వాటిని ముందుగా పాత్రల నుండి తీసివేసి తర్వాత షింక్ లో వేయాలి. పాత్రలను శుభ్రం చేసిన వెంటనే కొద్దిగా వేడినీళ్ళతో, డిటర్జెంట్ లతో రెగ్యులర్ గా వాష్ చేస్తుండాలి. వేడినీళ్ళతో కడిగే ముందుగా చిటికెడు బేకింగ్ షోడా వేసి శుభ్రం చేయడం వల్ల, కిచెన్ షింక్ కార్న్ లో దాగున్న బ్యాక్టీరియాను సులభంగా చంపేయవచ్చు.

5. నైఫ్(కత్తులు)స్టాండ్: బ్యాక్టీరియాకు ఆవాసాలు చెక్కతో ఉన్నటువంటి వస్తువులు. ముఖ్యంగా కత్తులను నిల్వ ఉంచే స్టాండులు. తడితో ఉన్నటువంటి కత్తులను ఎప్పుడు కానీ వుడెన్ స్టాండ్ లో ఉంచకూడదు. చెక్క నీటిని అతి త్వరగా పీల్చుకొని బ్యాక్టీరియా ఏర్పడటానికి సహకరిస్తుంది. అందుకోసం స్టీల్ లేదా ప్లాస్టిక్ కత్తులను ఉపయోగించడం వల్ల వాటి సులభంగా శుభ్రం చేయడమే కాకుండా త్వరగా తడి ఆరిపోతాయి. బ్యాక్టీరియా ఏర్పడాటానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. అలాగే కిచెన్ రాక్స్ ను కూడా తరచూ శుభ్రం చేస్తుండాలి.

6. డిష్ టవల్స్: ఒక్కువగా ఉపయోగించేది డిష్ టవల్స్. వేడి పాత్రలను దింపుకోవడానికి, డైనింగ్ టేబుల్స్ పై సర్దడానికి, తర్వాత ఆప్రదేశంలో తేమను తుడవడానికి ఎక్కువగా డిష్ టవల్స్ ఉపయోగిస్తుంటారు. ఇలా తుడవడం వల్ల తేమ ఉన్న బట్టలలో బ్యాక్టీరి అతి సులభంగా వృద్ధిచెందుతుంది. కాబట్టి పని పూర్తవగానే డిష్ టవల్స్ ను గోరువెచ్చని నీటిలో డిటర్జెంట్ తో శుభ్రం చేసి, తర్వాత ఫినాయిల్ లేదా డెటాల్ నీటిలో వేసి అందులో ముంచి తీసి తర్వాత ఎండలో వేసి పూర్తిగా ఆరనివ్వాలి.

7. స్పాంజ్ మరియు స్ర్కబ్స్: బ్యాక్టీరియా అతి సులభంగా ఏర్పడ్డానికి కారణం తడి, తడి ప్రదేశాలు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ వంటగదిలోని స్పాంజ్ లను, స్ర్కబ్ లను నెలకొక్కసారైనా మారుస్తుండాలి. స్పాంజ్ లు, స్ర్కబ్ లు ఉపయోగించిన తర్వాత వాటి శుభ్రంగా కడిగి నీటిని పూర్తిగా పిండేసి ఆరనివ్వాలి. స్పాంజ్, స్ర్కబ్, డిస్ సోపులను ఓపెన్ ప్రదేశంలో ఉంచడం వల్ల త్వరడా తడిఆరి శుభ్రంగా కనిపిస్తుంటాయి.

English summary

How To Clean Kitchen | వంట గది శుభ్రత ఇలా...!

Once the tea party is done and your guests have left, just look around and you find your house in mess. Not a problem. Of course keeping your house tidy can be really tiring. But, just sneak into your kitchen and you will find the reality waiting for you. The delicious dishes you have prepared has not just left behind the aromatic smell, but has also left your kitchen appliances greased and stained.
Story first published: Monday, March 4, 2013, 16:23 [IST]
Desktop Bottom Promotion