For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చెయ్యడానికి సులభ మార్గాలు

By Super
|

కాంటాక్ట్ లెన్స్ అనేవి అవసరమైన ఒక యాక్సెసరీ అని చెప్పవచ్చు. వీటిని చాలా జాగ్రత్తగా మరియు శుద్ధపరచి మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తే బాహ్యంగా మరియు అంతర్గతంగా కంటి నాశనానికి కారణం అవుతుంది. కాంటాక్ట్ లెన్స్ ను కంటిలో సరిగా పెట్టకపోతే గీతలు లేదా కన్నీటికి కారణమవుతుంది. యోగ్యం కానీ కాంటాక్ట్ లెన్స్ వాడుట వలన,ఒక అపరిశుభ్రమైన జత లేదా పరిశుభ్రంగా లేని వాటి వల్ల బాక్టీరియా రావటానికి కారణం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అంటువ్యాధులు మరియు దృష్టి దెబ్బతినడం జరగవచ్చు. తయారీ సంస్థ ఆదేశాలు మరియు మీ వైద్యుడు సిఫార్సుల మేరకు రోజూ కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చేయడం చాలా ముఖ్యం. నీటితో కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ నీటిలో బగ్స్ మరియు పరాన్నజీవులు ఉండుట వలన కంటికి అంటువ్యాధులు తీవ్రంగా రావటానికి కారణం కావచ్చు.

కాంటాక్ట్ లెన్సులు నిర్వహణ కొరకు అవసరమయ్యే అనేక బ్రాండ్ల ప్రక్షాళన పదార్థాలు మార్కెట్ లోఉన్నాయి. ప్రతి ఒక ఉత్పత్తి లేదా సొల్యూషన్స్ ప్రత్యేక పద్ధతులు మరియు ఉత్తమమైన ఫలితాల కోసం సూచనలను అనుసరించాలి. లెన్సు శుభ్రపరచడం మరియు తుడవటానికి సూచనలను పాటించాలి. లెన్సు ఎంతకాలం ఉంటాయనేది సొల్యూషన్స్ రకం మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మీకు లెన్స్ తుడవటానికి ఆదేశాలు ఉండకపోవచ్చు. లాలాజలం ఉపయోగించి కాంటాక్ట్ లెన్స్ ను ఎప్పుడూ శుభ్రపరచడం చేయకూడదు. లాలాజలంలో ఉండే జెర్మ్స్ వలన కంటికి అనవసరమైన ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. కాంటాక్ట్ లెన్స్ ను ఎప్పుడూ తేమగా ఉంచాలి. అందువల్ల సంరక్షణ అనుమతి పరిమితి దాటితే లెన్స్ పొడిగా మారతాయి. అప్పుడు ఏజెంట్లతో కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చేయడానికి జాగ్రత్త తీసుకోవాలి.

Steps to clean contact lenses

కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చేయడానికి కొన్ని దశల గురించి తెలుసుకుందాము.

1. మీ చేతులు శుభ్రంగా ఉండాలి

ఈ కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చేయడానికి మొట్టమొదటి ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు. మీ చేతులను శుభ్రం చేసుకోవటానికి యాంటి బాక్టీరియా సబ్బు లేదా క్లీన్సెర్ ను ఉపయోగించాలి. మీరు ఈ సందర్భంలో శుభ్రం చేసుకోవటానికి ఒక చేతి సానిటిసేర్ ను ఎంచుకోవచ్చు. కానీ ఒక ఎంపిక కాదు. జెర్మ్స్ మరియు బాక్టీరియా మీ కంటిలో చేరకుండా ఉండటం అనేది మీ చేతుల్లోనే ఉన్నది.

2. క్వాలిటీ సొల్యూషన్స్

ఎల్లప్పుడూ కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చేయడానికి ఒక నాణ్యత గల క్లీన్సింగ్ సొల్యూషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. నాణ్యత కొరకు ధరలో రాజీ పడకూడదు. మీరు కొనుగోలు చేసే సొల్యూషన్స్ మీ వైద్యుడు లేదా లెన్స్ తయారీదారుడు నుంచి సిఫార్సు ఉందని నిర్ధారించుకోండి. అన్ని సొల్యూషన్స్ అన్ని రకాల కాంటాక్ట్ లెన్స్ కు సరిపడవు.

3. లెన్స్ శుభ్రపరుచుట

మీ కంటి నుండి లెన్స్ తొలగించిన తర్వాత మీ సరఫరాదారు లేదా వైద్యుడు సూచించిన విధంగా సొల్యూషన్ తో శుభ్రం చేయాలి. క్లీనింగ్ కంటి తయారు అవశేషాలను తొలగిస్తుంది. కాంటాక్ట్ లెన్స్ పై పాతుకుపోయిన కాస్మెటిక్స్ లేదా ఇతర వ్యర్ధాలు ఉండుట వలన అస్పష్టతకు దారితీస్తుంది. మీరు సొల్యూషన్ యొక్క కొన్ని చుక్కలను మీ అరచేతిలో వేసుకొని లెన్స్ ను రుద్దడం మంచిది.

4. సోకింగ్ సమయం

వివిధ కాంటాక్ట్ లెన్స్ కోసం వివిధ సొల్యూషన్ లో ఉంచే పద్ధతులు ఉన్నాయి. మీ కాంటాక్ట్ లెన్స్ కోసం ఉత్తమమైన సొల్యూషన్ లో ఎంత సమయం ఉంచాలోమీ సరఫరాదారు నుంచి తెలుసుకోవటం చాలా ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. మీరు శుభ్రమైన లెన్స్ కేసు లేదా లెన్స్ హోల్డర్ లో తాజా సొల్యూషన్ తో నింపి లెన్స్ ఉంచండి. మీరు శుభ్రం చేయటానికి నీరు,లాలాజలం ఎప్పటికి వాడకూడదని గుర్తుంచుకోవాలి.

5. హోల్డర్ కేసు శుభ్రం

మీరు సొల్యూషన్ లో ఉంచే సమయంలో చేతులతో తాకకుండా జాగ్రత్త వహించాలి. మీరు మీ దృష్టిని లెన్స్ మీద ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మీరు లెన్స్ అమర్చిన తరువాత తాజా సొల్యూషన్ విషయంలో శుభ్రం చేయుట మరియు ఇది పూర్తిగా పొడిగా ప్రసారణకు అనుమతిస్తుంది. సొల్యూషన్ అయిపోతే పొడిగా ఉంచకూడదు. అలాగే నీటితో కడగటం చేయకూడదు.

ఈ క్రింది దశలను అనుసరిస్తున్నారో లేదో నిర్ధారించుకోండి:

a . లెన్స్ పై సొల్యూషన్ రుద్దితే దానిని తిరిగి మరియు ముందుకు సూటిగా కదలిక ద్వారా దృఢముగా చేయండి.

b. మీ వేలుగోళ్లు చిన్నగా మరియు శుభ్రంగా ఉంచుకోవాలి.

c. ప్రతిరోజు మీ నిల్వ సొల్యూషన్ మార్చండి.

d. మీ కంటి వైద్యుడు లేదా మీ సరఫరాదారుడు చెప్పితే కానీ శుభ్రపరచడం కొరకు సొల్యూషన్ బ్రాండ్లు ఎప్పుడూ మార్చకూడదు.

English summary

Steps to clean contact lenses

Contact lens is one accessory that needs to be used with utmost care and sanitised state. Negligence to do so causes damage to the eye externally and internally. Improper insertion of contact lens can scratch or cause tear.
Desktop Bottom Promotion