For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షూ దీర్ఘకాలం మన్నికగా ఉంచేందుకు క్లీనింగ్ టిప్స్

|

షూ(బూట్లు)మనందరికీ చాలా ముఖ్యమైన యాక్సెసరీ. అందుకే మనం ఎల్లప్పుడు వాటిని ఎంపిక చేసుకుంటాము. ఇటి స్టైల్ గా మాత్రమే కాదు, పాదాలకు పూర్తి రక్షణ కల్పింది. కాలుష్యం ప్రభావం పాదాల మీ ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, ధూళి, సన్ టాన్ వల్ల పాదులు చాలా కఠినంగా మారుతాయి. ఇంకా షూలను రెగ్యులర్ గా శుభ్రం చేసుకోకుంటే షూలు మురికిగా మారడం మరియు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి షూలకు కూడా మన రెగ్యులర్ కేర్ వల్ల అవి ఎక్కువ కాలం మన్నికవుతాయి. మీ షూలను కొత్తవాటిలా మెయింటైన్ చేయాలంటే అందుకు కొంత కేర్ తీసుకోవడం అవసరం. కొంత శ్రద్దతో పనిచేయడం వల్ల అవి ఎల్లప్పుడ కొత్తవాటిలా తళతళ మెరుస్తుంటాయి.

షూలను లెదర్ మరియు క్యాన్వాస్ మరియు ఇతర వివిధ రకాల మెటీరియల్స్ తో తయారుచేస్తుంటారు. ఒక్కో మెటీరియల్ ను ఒక్కోక్కో విధానంలో శుభ్రచేయాల్సి ఉంటుంది షూను లెదర్ లేదా రెక్సిన్ తో తయారుచేసుంటారు కాబట్టి, నీటిని ఉపయోగించి వీటిని శుభ్రం చేయడానికి వీలు పడదు. లెదర్ కాకుండా వేరే ఇతర మెటీరియల్స్ తో తయారుచేసి షూలను నీళ్ళు లేదా ఆల్కహాల్ బేస్డ్ వంటి క్లీనింగ్ ఏజెంట్స్ తో శుభ్రం చేయవచ్చు.

పెద్దవారివైనా లేక పిల్లలవైనా సరే షూస్, చెప్పులు తేలికగా మురికి పట్టేస్తాయి. అందునా తెల్లటివైతే మరింత మురికి పట్టి పారవేసేందుకు సిద్ధమవుతాం. వీటిని మెయిన్టెయిన్ చేయటం చాలా కష్టంగా వుంటుంది. ప్రతిసారి పాలిష్ కుగాను బయటకు ఇచ్చి ఖర్చు చేయలేము, సమయం వెచ్చించనూ లేము. అందుకుగాను వాటిని ఇంటిలోనే పాలిష్ చేసుకోటానికి, నిర్వహించటానికి, ఎల్లప్పుడు కొత్తవాటిలా మెరిపించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి, వాటిని పరిశీలించండి....

Clean Shoes

1. ముందు బూట్లు బురద, మురికి, లేదా మట్టి తగిలించుకున్నాయోమో పరిశీలించండి. మరకలు తక్కువే అనుకుంటే ఒక కాటన్ గుడ్డను సోప్ నీటిలో తడిపి బూట్లను తుడవండి. ఈ చర్య బూట్లపైనా, చెప్పులపైనా వున్న మరకలను పోగొడుతుంది.

2. తెల్లని కాన్వాస్ బూట్లు లేదా చెప్పులు మెషీన్ లో వేసి వాష్ చేయాలనుకుంటే వాటి లేసులు తీసి వేడినీటిలో కడగండి. అవసరమైన డిటర్జెంట్ వాడండి. బ్లోయర్ వాడవద్దు. ఇది వాడితే షూస్ పాడవుతాయి.

3. బ్లీచ్, బేకింగ్ సోడా, లేదా కొద్దిపాటి డిటర్జెంట్ ను నీటిలో కలపండి. ఆ మిశ్రమంలో ఒక టూత్ బ్రష్ ముంచి మరకలు పోయేటంతవరకు వైట్ షూస్ శుభ్రం చేయండి.

4. కడిగే ముందు, బూట్లకు, లేదా చెప్పులకు వున్న దుమ్ము పూర్తిగా దులపండి. అరకప్పు వేడి నీరు. ఒక టేబుల్ స్పూన్ అమోనియా, కొద్దిపాటి సబ్బు కలిపిన మిశ్రమం తయారు చేయండి. బాగా కలపండి. మొదట బేకింగ్ సోడాలో ముంచిన టూత్ బ్రష్ తో శుభ్రపరచి తర్వాత దానిని ఈ మిశ్రమంలో ముంచి మరోసారి కడగండి.

5. తెల్లటి బూట్లను, చెప్పులను శుభ్రం చేయటానికి సాధారణంగా బేకింగ్ సోడా లేదా తెల్లని వినేగర్ వాడతారు. ఈ మిశ్రమాన్ని బూట్లకు రాసి పది నుండి పదిహేను నిమిషాలపాటు నానపెట్టండి. తర్వాత కడిగేయండి.

6. మరో చిట్కాగా, తెల్లటి బూట్లను, చెప్పులను శుభ్రపరచేందుకు టూత్ పేస్ట్ వాడండి. బ్రష్ ను వేడి నీటిలో ముంచి కొద్దిపాటి టూత్ పేస్ట్ ను బూట్లపై రుద్దండి. తర్వాత నీటితో కడిగి టవల్ లేదా గుడ్డతో బాగా తుడవండి.

7. మీ లెదర్ షూ వాడుకను బట్టి మీ షూలను వారానికొకసారి లేదా నెలకొకసారి పాలిష్ చేస్తుండాలి. అందుకు క్రీమ్ బేస్డ్ పాలిష్ చేయడం వల్ల ఎక్కువ రోజులు కొత్తవాటిలా మెరుస్తుంటాయి. పాలిష్ చేసిన తర్వాత ఒక కాటన్ వస్త్రం మీద చిటికెడు కొబ్బరి నూనె వేసి షూమీద సున్నితంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల షూ ఎక్కువ రోజులు మెరుస్తుంటాయి.

English summary

Tips To Clean Shoes n Make It Shine

Shoes are an important accessory, and hence they are chosen to compliment and complete the overall style statement. They primarily protect your feet from dirt and insulate your feet from hard ground.
Desktop Bottom Promotion