For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని రకాల మరకలు మటుమాయం....

ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని రకాల మరకలు మటుమాయం....

|

Top 15 ways to remove Stains on Clothes...
బట్టల పై పడే మరకలను తొలగించడానికి ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి కొన్ని మొండి మరకలు అంత త్వరగా వదలవు. సిరా, రక్తం, కాఫీ, గ్రీజు మరియు రస్ట్ మరకలు మొండి మరకలు. వీటిని తొలగించేటప్పుడు ఈ కింది చిట్కాలను పాటీంచి చూడండి. అయితే ఒక మరకపై పనిచేసిన చిట్కా మరొక రకమైన మరకపై పనిచేయకపోవచ్చు.

1. కేండిల్‌ హోల్డర్స్‌కి అంటిన కొవ్వు పోవాలంటే వాటిని వేడినీళ్లలో ముంచి కాసేపు ఉంచాలి. మైనం కరిగిపోతుంది.
2. నిమ్మరసం వల్ల నేలమీద అయిన తెల్ల మరకల్ని దోసకాయ లేదా గుమ్మడికాయముక్కలతో రుద్దితే పోతాయి.
3. ఎండలో ఇనుపతీగమీద ఆరేసిన బట్టలకంటిన తుప్పు వదలాలంటే ఉప్పు, నిమ్మరసం కలిపి మరకమీద పోయేదాకా అదమాలి.
4. ఆర్నమెంట్‌ వస్తువుల్ని తుడిచేప్పుడు ఆ బట్ట మీద ఒక చుక్క కిరోసిన్‌ వేసి తుడిస్తే ఆ మెరుపు ఎక్కువకాలం ఉంటుంది.
5. బొరాక్స్‌ పౌడర్‌ కలిపిన వేడినీటిలో బట్టల్ని నానబెడితే కాఫీ, టీ మరకలు పోతాయి.
6. కోడిగుడ్డు మరకల్ని చల్లటినీటితో కడగాలి. వేడినీటితో కడిగితే పోవు.
7. బట్టలకంటిన చెమట మరకలు పోవాలంటే నీళ్లలో కలిపిన అమ్మోనియాతో శుభ్రం చెయ్యాలి.
8. ప్లాస్టిక్‌ కప్స్‌ని బేకింగ్‌ సోడా కలిపిన నీళ్లలో ఉంచితే వాటికంటిన కాఫీ, టీ మరకలు పోతాయి.
9. యూకలిప్టస్‌ ఆయిల్‌ లేదా స్పిరిట్‌తో తుడిస్తే తారు మరకలు పోతాయి.
10. నూనె మరకలు పడిన వెంటనే వేడినీరూ, సోపూ రుద్దితే పోతుంది. మరక ఎండిపోతే కాస్త పెట్రోల్లో దూది ముంచి మరక భాగాన్ని దూదితో రుద్ది శుభ్రపరచవచ్చు.
11. పెయింట్స్‌ లాంటి రంగులు బట్టలమీద పడితే బ్లాటింగ్‌ పేపర్‌తో అద్దాలి. తరువాత మరకమీద అద్దుడు కాగితం ఉంచి పైన ఇస్త్రీ చేసి, కాస్త టాల్కమ్‌ పౌడర్‌ చల్లి ఓ గంటపైగా అలా ఉంచి ఆ పైన పౌడరు దులిపితే రంగు మరకపోతుంది.
12. నెత్తురు మరక, కోడిగుడ్డు సొనవల్ల అయిన మరకలు పోయేందుకు బట్టల్ని ఒక రాత్రంతా గోరువెచ్చని నీటిలో తడిపి ఉంచి మర్నాడు సబ్బుతో ఉతకాలి.
13. బీర్‌, వైన్‌ మరకలు పోవాలంటే ఉప్పు నీటితో ఆ ప్రాంతాన్ని బాగా కడిగితే చాలు.
14. నూనె లేదా నెయ్యి మరకలు పడ్డ చోట పౌడరు రాసి దానికి రెండు పక్కల్లా బ్లాటింగ్‌ పేపరు ఉంచి ఇస్త్రీ చేస్తే ఆ మరకలు బ్లాటింగ్‌ పేపరు మీదకి వచ్చేస్తాయి.
15. తమలపాకుల మరకలు పోవాలంటే ఆ ప్రదేశంలో నిమ్మరసం రాస్తే పోతుంది. పెరుగు కూడా ఉపయోగించవచ్చు.

English summary

Top 15 ways to remove Stains on Clothes... | ఒకటి కాదు.. రెండు కాదు.. అన్ని మరకలు మాయం

Stains on your clothing, furniture and your carpet are the definition of frustrating. But before you throw away that blouse you accidentally spilled red wine on, or retire your child's good jeans because of grass stains, try some of these helpful tips.
Desktop Bottom Promotion