For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసంతో 15 ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు

By Mallikarjuna
|

నీటితో మిక్స్ చేసినా లేదా సాఫ్ట్ డ్రింక్స్ తో మిక్స్ చేసి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు, స్కిన్ కేర్ లో ఒక ఉత్తమ హోం రెమెడీగా అద్భుతంగా పనిచేస్తుంది, అంత అద్భుతమైన వస్తువేదంటే, నిమ్మకాయ. నిమ్మకాయలో మీరు ఊహించిన దానికి కంటే ఎక్కువ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఎన్న ప్రయోజనాలను అందించే నిమ్మకాయను మీరు ఇప్పటి వరకూ నిల్వచేయకుండా ఉంటే, ఇప్పటి నుండి అయినా, నిమ్మకాయను మీ వంటగదిలో నిల్వచేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఈ అద్భుతమైన పండులోని ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు తెలుసుకొన్నట్లైతే మీ వంటగదిలో వస్తువుల లిస్ట్ ఇది కూడా తప్పనిసరిగా చేరిపోతుంది.

ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు: క్లిక్ చేయండి

నిమ్మరసం వంటలకే కాదు, వివిధ రకాలుగా ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలిసిందే, ఇంకా, లెమన్ ఆయిల్ మరియు నిమ్మకాయను వివిధ రకాలుగా ఉపయోగించడానికి, ఉత్తమ ప్రయోజనాలను పొందడానికి ఈ క్రింది కొన్ని చిట్కాల రూపంలో ఇవ్వడం జరిగింది. మరి లెమన్ లోని సీక్రెట్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

ఆరోగ్యానికి నిమ్మరసం ఉపయోగించే 20 మార్గాలు: క్లిక్ చేయండి

ఇంక్ మరకలను పోగుడుతుంది

ఇంక్ మరకలను పోగుడుతుంది

నిమ్మసంలో అసిడ్ యాసిడ్ వల్ల కొన్ని మొండి మరకలను తొలగించడానికి ఉపయోగిస్తుంటారు. బట్టల మీద పెడ్డ ఇంక్ మరకలను వదిలించడానికి నిమ్మరసం అద్భుతంగా సహాయపడుతుంది . ఇంక్ మరకలు పడిన వెంటనే తడి ఆరిపోక ముందే, నిమ్మరసంను పిండి, చేతులతో రుద్ది కడగాలి. తర్వాత మంచినీటితో కడిగి తర్వాత సర్ఫ్ లో నానబెట్టి, మంచినీటితో శుభ్రం చేయడం వల్ల మరకలు మాయం అవుతాయి.

మీ చేతిగోళ్ళును తెల్లగా మార్చుతుంది:

మీ చేతిగోళ్ళును తెల్లగా మార్చుతుంది:

నిమ్మరసం ఒక బ్లీచ్ ఏజెంట్ గా పనిచేస్తుంది . అందువల్ల ఇది ఫింగర్ నెయిల్స్ ను (కాళ్ళగోళ్ళను)బ్రైట్ గా మార్చుతుంది . అందుకు మీరు చేయాల్సింది, నిమ్మరసంలో మీ చేతి వేళ్ళను కొద్దిసమయం నానబెట్టుకోవాలి . 10 నిముషాలు నానబెట్టిన తర్వాత సింపుల్ గా నేరుగా వేళ్ళ గోళ్లమీద రుద్దాలి.

బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

ఫ్యాన్సీ ఫేషియల్ స్ర్ర్కబ్ మరియు ఫేస్ మాస్క్ లు బ్లాక్ హెడ్స్ ను పూర్తిగా నివారించలేవు, నిమ్మరసాన్ని రాత్రి పడుకొనే ముందు బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉదయం, చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి. కొన్ని రోజుల తర్వాత చర్మరంద్రాలు మూసుకొని, బ్లాక్ హెడ్స్ మాయం అవ్వడం మీరు గమనించవచ్చు . ఒక వేళ బ్లాక్ హెడ్స్ మొటిమలుగా మార్పు చెంది ఉంటే, నిమ్మరసంను రోజుకు రెండు సార్లు ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా మొటిమలు నివారించడబడుతాయి.

సహజపద్దతిలో జుట్టును లైట్ గా మార్చుతుంది:

సహజపద్దతిలో జుట్టును లైట్ గా మార్చుతుంది:

మీ జుట్టు ఎండ వేడికి ఎక్కువగా బహిర్గతం అయినా, మీ జుట్టుకు ఉపయోగించే హెయిర్ డైస్ లో హానికర కెమికల్స్ ఉపయోగిస్తుంటారు. వీటికి బదులుగా నిమ్మరసం ఉపయోగించడం ఉత్తమం. 1/4కప్పు నిమ్మరసంలో 3/4కప్పు నీళ్ళు కలిపి మీ జుట్టుకు పట్టించాలి. తక్షణ ప్రభావం చూపడానికి కొద్దిసేపు ఎండలో నిల్చోవాలి. తర్వాత తలస్నానం చేసి, మంచి షైనింగ్ తో ఉన్న జుట్టు మీ సొంతం అవుతుంది.

వెజిటేబుల్ కట్టింగ్ బోడ్స్ ను క్లీన్ మరియు వాసన లేకుండా ఉంచుతుంది:

వెజిటేబుల్ కట్టింగ్ బోడ్స్ ను క్లీన్ మరియు వాసన లేకుండా ఉంచుతుంది:

కట్టింగ్ బోర్డ్స్ మీద ఏర్పడ్డ మొండి మరకలను వదలగొడుతుంది. నిమ్మరసంను కట్టింగ్ బోర్డ్ మీద పిండి, అదే నిమ్మతొక్కతో బాగా రుద్ది, 20నిముషాలు అలాగే పక్కన పెట్టాలి. 20 నిముషాల తర్వాత నీటితో కడగాలి. అవసరం అయితే మరో సారి ప్రయత్నించవచ్చు. కట్టింగ్ బోర్డ్స్ ను క్లీన్ చేయడం, ఇన్ఫెక్షన్స్ సోకకుండా చేయడం మాత్రమే కాదు, కట్టింగ్ బోర్డ్స్ కు అంటుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయవి ఘాటైన వాసనలు కూడా వదిలిస్తుంది.

ల్యాండ్రీ వైట్స్:

ల్యాండ్రీ వైట్స్:

మీ ఇంట్లోని దుస్తులు ప్రకాశవంతంగా మెరవడం లేదా? మరి మీ ల్యాండ్రీ దుస్తులను తెల్లగా, ప్రకాశవంతంగా తళతళలాడించడానికి నిమ్మరసం అద్భుతంగా సహాయపడుతుంది. మీ ల్యాండ్రీ దుస్తులకు అరకప్పు నిమ్మరసం జోడిస్తే చాలు, మీకు బ్లీచ్ బాటిల్ అవసరం ఉండదు.

గొంతు నొప్పిని నివారిస్తుంది:

గొంతు నొప్పిని నివారిస్తుంది:

నిమ్మరసంలో దీర్ఘకాలిక సమస్యలను నివారించే చికిత్సా లక్షణాలు కలిగి ఉన్నాయి . గొంతు నొప్పి, జలుబు వంటి వాటికి మీరు తీసుకొనే ఇతర మెడిసినల్ సిరప్స్ కంటే, నిమ్మకాయను గ్యాస్ స్టౌమీద పెట్టి, బ్రౌన్ కలర్లోకి మారే వరకూ అలాగే ఉంచాలి. తర్వాత దాన్ని పక్కకు తీసి, గ్లాసులోకి పిండుకొని, అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి త్రాగాలి.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారణకు బాగా తెలిసిన ఒక ఉత్తమ హోం రెమెడీ నిమ్మరసం. చుండ్రును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకు ఒక చెంచా నిమ్మరసంను తడిజుట్టుకు పట్టించాలి .తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేయాలి. అలాగే రెండుకప్పుల నీటిలో, రెండు చెంచాలా నిమ్మరసం మిక్స్ చేసితలకు పట్టించి, తలస్నానం చేయాలి. ఇలా రోజు విడిచి రోజు చేసినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

స్టైయిన్ లెస్ స్ట్రీల్, ఇత్తడి మరియు రాగి వస్తువులను మెరిపిస్తుంది:

స్టైయిన్ లెస్ స్ట్రీల్, ఇత్తడి మరియు రాగి వస్తువులను మెరిపిస్తుంది:

ఇంట్లో వస్తువుల మీద జిడ్డు, దుమ్ము, ధూలి చేరి పాతబడ్డాయా? అందుకు నిమ్మరసంను ఉప్పులో అద్ది, మరకల మీద బాగా రుద్దాలి. తర్వాత మంచినీటితో కడగడం వల్ల అవి కొత్తవాటిలో మెరుస్తుంటాయి.

ఆహారం ఫ్రెష్ గా ఉంచడానికి:

ఆహారం ఫ్రెష్ గా ఉంచడానికి:

మీరు రుచికరమైన వంటలను వండినప్పుడు, ఒక గంట ఆలస్యం అయేట్లు ఉన్నట్లైతే మీరు ఏం చేస్తారు?అందుకు సరైన సమాధానం నిమ్మరసం జోడించడమే.! కొన్ని పండ్లు మరియు ఆహారాల మీద నిమ్మరసం చిలకరిస్తే తప్పనిసరిగా అవి తాజగా కనబడుతుంటాయి.

ఆహారాలు తురిమే తురిమిని శుభ్రపడుతుంది:

ఆహారాలు తురిమే తురిమిని శుభ్రపడుతుంది:

గ్రేటర్స్ (తురిమిని)శుభ్రం చేయడం కొంచె కష్టమైన పనే. తురిమినప్పుడు చాలా చిన్నగా ఉన్న పదార్థాలు, రంధ్రాల్లో చిక్కుకుంటాయి. అటువంటప్పుడు వాటిని శుభ్రం చేయడానికి మీరు కొంచెకష్టపడాల్సి వస్తుంది. నిమ్మతొక్క తీసుకొని రెండు తురిమినికి రెండు వైపులా బాగా రుద్దాలి. తర్వాత మంచి నీటితో కడిగితే సరి.

బడ్జెట్ తో అలంకరించడం:

బడ్జెట్ తో అలంకరించడం:

మీ ఇంట్లో వేసవిలో కొంచెం డిఫరెంట్ గా అలంకరించుకోవలసి వస్తే, నిమ్మకాయలు ఫర్ ఫెక్ట్ పరిస్కారం. ఒక బౌల్ నిండుగా నిమ్మకాయలను నింపి, కిటికి వద్ద ఉంచడం వల్ల ఇల్లంతా మంచి సువాసనతో పాటు, చూడటానికి ఆకర్షినియంగా ఉంటుంది. సన్ ఫిల్ డేస్ కు బ్రౌట్ ఎల్లో లెమన్స్ చాలా అందంగా కనబడుతుంటాయి.

 మైక్రోవేవ్ శుభ్రం చేయడానికి:

మైక్రోవేవ్ శుభ్రం చేయడానికి:

ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మైక్రోవేవ్ ఒకటి. దీన్ని ప్రతి సారి శుభ్రం చేయాలంటే కష్టంగా ఉంటుంది . నిమ్మతొక్కలను వేడినీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో మైక్రోవేవ్ ను శుభ్రం చేయవచ్చు.

చెత్త బుట్టలో:

చెత్త బుట్టలో:

చెత్తబుట్టులో అరచెక్క నిమ్మతొక్కను ను , కొద్దిగా బేకింగ్ సోడా వేయడం వల్ల క్లీన్ గా మరియు వాసన లేకుండా ఉంటుంది.

మీ చేతులకు అంటిన మెండి మరకలను వదిలిస్తుంది:

మీ చేతులకు అంటిన మెండి మరకలను వదిలిస్తుంది:

వంటకార్యక్రమం ముగిసిన వెంటనే నిమ్మరసంతో చేతులను రుద్ది కడగాలి . ఇలా చేయడం వల్ల మీ చేతులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. నిమ్మరసంతో ఇలాంటి మరెన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి . ఈ అద్భుతమైన నిమ్మపండు యొక్క ప్రయోజనాలను తెలుసుకొన్నాక, మీ ఇంట్లో నిమ్మపండును తప్పకు నిల్వచేసుకోవాలనిపిస్తున్నది కదా....

Desktop Bottom Promotion