For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్లని దుస్తులు కొత్తవాటిలా తళతళ మెరవాలంటే:సింపుల్ టిప్స్

|

సాధారణంగా ల్యాండ్రి (దుస్తులను)శుభ్రపరిచే విషయం మహిళలకు, ముఖ్యంగా గృహిణిలకు ఒక సవాలుతో కూడుకొన్నపని. ఎందుకంటే కలర్ దుస్తులు శుభ్రం చేయడం కంటే తెల్లని దుస్తులను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. అందులోనూ ఇంట్లో పిల్లలుంటే వారి స్కూల్ యూనిఫార్మ్స్ శుభ్రంచేయడం ఒక పెద్ద పని. పిల్లలు తెల్లదుస్తుల మీద మరకలు పట్టించినప్పుడు, శ్రమ మరింత ఎక్కువ అవుతుంది. అందుకు మీరు చింతించాల్సిన అవసరం లేదు.

మీ ఇంట్లో తెల్ల దుస్తులను మరింత ప్రకాశవంతంగా ఉంచడానికి ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను మీరు తెల్లదుస్తులు శుభ్రంచేసేటప్పుడు వీటిని మీరు ఉపయోగించుకోవచ్చు. మీ ఇంట్లో తెల్ల దుస్తులను శుభ్రం చేయడం ఒక సాధరణ ఎంపిక. అయితే , ఆ తెల్లని దుస్తుల మీద కలర్ స్ట్రిప్స్ పడినప్పుడు, వాటిని తెల్లగా మార్చాలంటే?

How To Make White Clothes Clean?

అందుకు కూడా మీరు బాధపడాల్సిన, ఎక్కువ శ్రమపడాల్సిన పనిలేదు. మీ తెల్లదుస్తులను శుభ్రపరచడానికి బ్లీచింగ్ కు బదులుగా తెల్లని దుస్తులు క్లీన్ గా మరియు బ్రైట్ గా చేయడానికి కొన్ని పద్దతులున్నాయి. ఆ నేచురల్ పద్దతులను పరిశీలించండి...

వెనిగర్ తో శుభ్రం చేయాలి: వెనిగర్ తెల్లని దుస్తులును మరింత ప్రకాశవంతంగా మరియు క్లీన్ గా ఉంచుతాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా తెల్లదుస్తుల మీద పడ్డ మరకల మీద కొద్దిగా వెనిగర్ వేసి, రుద్ది తర్వాత చల్లటి నీటితో కొద్ది సమయం నానబెట్టుకోవాలి, తర్వాత సాధరణంగా మీరు శుభ్రం చేసి, వ్యత్యాసం చూడండి.

బ్లీచింగ్ తో శుభ్రం చేయండి: ఎక్కువగా మురికి పడ్డ మరియు మరకలు పడ్డ తెల్ల దుస్తులను శుభ్రం చేయడానికి బ్లీచింగ్ మరియు డిటర్జెంట్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు పౌడర్లయొక్క మిశ్రం కలిపిన నీటిలో తెల్లని దుస్తులను 30నిముషాలు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత వేడినీటిలో వీటిని శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మీ దుస్తులు శుభ్రంగా తయారవ్వడంతో పాటు ప్రకాశవంతంగా కనబడుతాయి.

బేకింగ్ సోడా: మీ తెల్లని దుస్తులను శుభ్రంగా మరియు క్లీన్ గా ఉంచడానికి మరో మార్గం బేకింగ్ పౌడర్. తెల్లని దుస్తులు నానబెట్టే నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ ను వేసి నానబెట్టుకోవాలి. ఈ నీటిలోనే దుస్తులను శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని రెండు సార్లు అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం: నిమ్మరసం మరో ఎఫెక్టివ్ మార్గం. ఎందుకంటే, మీ తెల్లని దుస్తులు తిరిగి తెల్లగా కొత్తవాటిలా మిళమిళ మెరవాలంటే నిమ్మరసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . తెల్లని దుస్తుల మీద పడ్డ మరకల మీద నిమ్మరసంను చిలకరించి ఒక గంట పాటు అలాగే ఉండి తర్వాత శుభ్రమైన నీటిలో క్లీన్ చేయడం వల్ల ఫలితం మీకే తెలుస్తుంది.

నేచురల్ పదార్థాలను ఉపయోగించి ఈ సింపుల్ చిట్కాలను అనుసరించినట్లైతే తెల్లని దుస్తులు మరింత తెల్లగా మరియు ప్రకాశవంతంగా కనబడుతాయి.

English summary

How To Make White Clothes Clean?

Mothers will relate to this! Cleaning white clothes or white school uniforms is a huge task, especially if your kid has got it stained! However, you need not worry.
Story first published: Thursday, April 3, 2014, 17:46 [IST]
Desktop Bottom Promotion