For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుస్తుల మీద గోరింటాకు మరకలు తొలగించే చిట్కాలు

|

ఎదుటివారు ధరించిన దుస్తులను బట్టి వారి వ్యక్తిత్వాన్ని, ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తుంటారు. వయస్సును బట్టి వారి డ్రెస్‌లు, మారుతూంటాయి. వయస్సుకు తగినట్లుగా ఉండే వస్త్రధారణ వారి అందాన్ని పెంచుతుంది. పెద్ద వయస్సు వారు తాము ధరించే దుస్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ధరించే దస్తులు ఎంతో శుభ్రంగా ఉండటమన్నది ప్రధాన విషయం. ఖరీదైన బట్టలు కొనగానే సరికాదు. వాటిని చక్కగ మెయింటైన్‌ చేయగలగాలి. బట్టలు ఉతకడంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, బట్టలు శుభ్రపడటమే కాక అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. బట్టలు ఉతకటంలో ఎటువంటి పద్దతులను ఆచరించవలసినదీ ప్రతివారూ తెలుసుకోవాల్సిన విషయం.

సాధారణంగా మహిళలు రాత్రిపూట అరచేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో బట్టలకు, బెడ్‌షీట్లకు గోరింటాకు మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించేందుకు నానా తిప్పలు పడుతుంటారు.శుచి, శుభ్రత మనకే కాదు బట్టలకు కూడా కావాలి.

Removing Mehendi Stains From Clothes

1. బట్టలకంటిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానెయ్యాలి. తర్వాత శుభ్రత అదే వస్తుంది. అలాగే నిమ్మకాయ ముక్కతో గోరింటాకు మరకపై రుద్దితే మరకలు మటుమాయం అవుతాయి.

2. ఇలా పడిన గోరింటాకు మరకలు పోవడానికి మరకంటిన ప్రదేశాన్ని అరగంటసేపు పాలలో నానెయ్యాలి. తర్వాత శుభ్రం చేస్తే అదే పోతుంది. పాలతో వీలుపడని పక్షంలో నిమ్మకాయ ముక్కతో రుద్దిచూస్తే గోరింటాకు మరకలు పోతాయి.

3. జేబు రుమాళ్ళపైన, టవల్స్‌ మీద పడే లిప్‌స్టిక్‌ మరకలు పోవాలంటే వాటిపై గ్లిసరిన్‌ రాసి కొంతసేపు తర్వాత సబ్బుతో ఉతకాలి.

4. దుస్తులమీద సిరా మరకలు పోవాలంటే పుల్లటి పెరుగులో కాసేపు నానబెట్టి తర్వాత ఉతికితే సిరా మరక కనిపించదు.

5. షిఫాన్‌ చీరలపై నూనె మరకలు పోవాలంటే టాల్కంపౌడర్‌ చల్లి మడత పెట్టండి. వారం తర్వాత పౌదరు దులిపివేయండి

6. దుస్తులమీద అంటుకున్న చూయింగ్ గమ్ తొలగించాలంటే ఆ దుస్తులను ప్లాస్టిక్ కవరులో ఉంచి ఫ్రిజ్ లో
పెట్టాలి.గట్టిపడిన గమ్ సులభంగా తీసివేయవచ్చు.

7. తెల్లని బట్టలపై పసుపు మరకలు పోవాలంటే బాగా ఎండలో ఆరేసి చాలాసార్లు నీళ్ళు చల్లుతూ ఎండనిస్తే
పసుపురంగు పోతుంది.

8. బట్టలపై బాల్ పెన్ మరకలు పోవాలంటే నిమ్మరసం పొడిబట్ట మీద వేసి రుద్దాలి.

9. షిఫాన్‌ చీరలపై నూనె మరకలు పోవాలంటే టాల్కంపౌడర్‌ చల్లి మడత పెట్టండి. వారం తర్వాత పౌదరు దులిపివేయండి.

Story first published: Saturday, January 4, 2014, 17:28 [IST]
Desktop Bottom Promotion