For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రిజ్ లో స్థలం సరిపోవడం లేదా..? అందుకు సులభ చిట్కాలు

|

కొంత మంది ఇళ్లలో ఫ్రిజ్ ఉందికదా అని పట్టకుండా నింపేస్తుంటారు. అలా చేసినప్పుడు కొద్ది రోజులకే పాడవుతుంటాయి. మరికొన్ని పండినట్లు అనిపిస్తుంటాయి. ఎందుకలా జరిగిందో అర్ధంకాక సతమతమవుతుంటారు. అలాంటి వారు చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఫ్రిజ్ లో పళ్ళు, కూరగాయలు నిల్వ చేసుకొనేటప్పుడు కూడా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అవేంటో చూద్దాం...

అసలే కూరగాయలు, పళ్ళు మొదలైన వాటి ధరాలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వాటిని జాగ్రత్తగా నిల్వచేయాలి. ఇలా చేయడం వల్ల కేవలం డబ్బు ఆదా అవ్వడం మాత్రమే కాదు, వాటిలోని పోషక విలువలు కూడా అలాగే నిలిచి ఉంటాయి. అందుకే ఈ క్రింది అంశాలు గుర్తుంచుకోవాలి.

Tricks To Maximise Space In Your Refrigerator

1. మార్కెట్ నుంచి కూరగాయలు, పళ్ళు...తెచ్చిన వెంటనే అన్నీ కలిపి ఫ్రిజ్ లో ఒకే చోట భద్రపరచకూడదు. వేటికవి విడదీసి, విడివిడిగా, రంధ్రాలున్న కవర్స్ లో పెట్టుకోవాలి. దీని వల్ల గిలి సర్క్యులేట్ అవుతుంది. ఫలితంగా అవి ఎక్కువ సమయం తాజాగా కూడా ఉంటాయి.

2. బంగాళదుంప, ఉల్లిపాయలు, టమోటో, వెల్లుల్లి, అరటిపళ్ళు మొదలైనవి ఫ్రిజ్ లో పెట్టకూడదు.

3. అలాగే బంగాళదుంపలు, మష్రూమ్స్...మొదలైనటువంటి వాటిని ఉపయోగించే ముందు వరకు కడగకూడదు. అప్పుడే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

4. ఉల్లి వెల్లుల్లి, మొదలైనవి ఫ్రిజ్ లో కన్నా బయటే గాలి, వెలుతురు ధారళంగా వచ్చే ప్రాంతంలో ఉంచితేనే ఎక్కువ కాలం తాజగా ఉంటాయి.

5. ఆకు కూరలు తెచ్చిన వెంటనే వాటికున్న బ్యాండ్లు, తాళ్ళు తీసేయాలి. తర్వాత చల్లని నీటితో వాటిని కడిగి పాడైపోయినవి, కుళ్లిన కాడలేమైనా ఉంటే తీసేయాలి. వేటికవి విడదీసి విడివిడిగా కవర్లలో పెట్టి భద్రపరచుకోవాలి.

6. ఫ్రిజ్ లో భద్రపరిచే ఆకుకూరలు కాస్త వాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే, ఆకుకూరల కాడలను ట్రిమ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసిన చివర్లను ఒక చిన్న పాత్రలో నీటిలో ఉంచుతూ పై భాగాన్ని కవర్ తో కప్పి ఉంచాలి. అంటే ఫ్లవర్ వాజ్ లా అన్న మాట. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

ఇక టమోటోల విషయానికొస్తే అవి బటయ ఉన్నా కూడా గది ఉష్ణోగ్రత వద్ద బాగానే నిల్వఉంటాయి. వాసన, రుచి సహజంగా నిలిచి ఉంటాయి. ఫ్రిజ్ లో ఉన్న టమోటలైతే కాస్త రుచి తగ్గుతాయనే చెప్పవచ్చు.

ఫ్రిజ్ లో కూరగాయలు, పల్లే కాకుండా మాంసాహారన్ని కూడా భద్రపరచాల్సి వస్తే ముందు రక్తం లేకుండా బాగా శుభ్రంగా చేసుకోవాలి. తర్వాత ఒక కవర్ లేదా మూత ఉన్న పాత్రలో పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. లేదంటే ఆ వాసన ఫ్రిజ్ మొత్తం వ్యాప్తించే అవకాశం ఉంటుంది. అలాగే శుభ్రంగా లేని మాంసం ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మిగిలిన ఆహార పదార్థాలు కూడా తొందరగా చెడిపోయే ప్రమాధం ఉంటుంది.

ఉష్ణోగ్రతను మన అవసరాలకు తగినట్లు అందించే ప్రత్యేక ప్యానెల్స్ ఉన్న రిఫ్రిజిరేటర్లు కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని తీసుకోవడం కూడా చక్కటి ఎంపిక

క్యారెట్లు, బీట్ రూట్లకు వాడే ముందు మాత్రమే తొక్క తీయ్యాలి. అలా అయితేనే వాటిలో తేమ ఎక్కువ కాలం నిలిచి ఉండి తాజాగా ఉంటాయి.

అలాగే కూరగాయలు, పండ్లను ఫ్రిజ్ లో ఒకచోటే ఉంచడం కూడా అంత మంచి పద్దతి కాదు. ఎందుకంటే, బాగా పండిన పళ్ళ నుంచి ఇథిలీన్ అనే గ్యాస్ వెలువడుతుంది. అది కూరగాయల మీద కూడా ప్రభావం చూపించి తొందరగా పాడయ్యే లా చేస్తుంది అందుకే వేటికవి విడిగా భద్రపరచాలి.

ఫ్రిజ్ లో ఎలాంటి పదార్థాలు భద్రపరచాలనుకున్నా వాటిని ఇరికించినట్లు కాకుండా, గాలి బాగా సర్క్యులేట్ అయ్యేలా ఉంచాలి. అలాగే విడివిడిగా ఫ్యాక్ చేయాలి. కదా అని బిగుతుగా ప్యాక్ చేసినా అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, కాస్త వదులుగా ప్యాక్ చేయాలి.

English summary

Tricks To Maximise Space In Your Refrigerator

Summer is the time when your refrigerator is taxed to the maximum. You tend to stuff everything into the fridge because food tends to get spoiled quickly in the heat. The demand for chilled water and beverages also increases during the summer.
Story first published: Monday, July 14, 2014, 18:36 [IST]
Desktop Bottom Promotion