For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దోమలను నివారించడానికి ఎఫెక్టివ్ హోం మేడ్ టిప్స్

|

అల్పమైన ఒక ప్రాణి గుట్టుచప్పుడు కాకుండా మనల్ని దెబ్బతీసి అనారోగ్యానికి గురి చేసి కొద్ది వారాలపాటు మంచానికి కట్టిపడేస్తుంది. అదే దోమ. ఈ దోమ కాటు వల్ల మన చర్మం మీద దద్దుర్లు మరియు చర్మవిస్పోటనం చెందడం జరుగుతుంది. దోమ కాటు వల్ల స్కిన్ ఇరిటేషన్ మరియు స్కిన్ అలర్జీ కలిగుతుంది. అంతే కాదు, ఈ పాడు దోమలు మనతోపాటు సహజీవనం చేస్తూ రక్తం పీల్చి అనేక వ్యాధులకు గురిచేస్తాయి. రక్తాన్ని ఇన్ఫెక్షన్ కు గురిచేస్తున్న దోమలు, దోమకాటుకు గురవడంవల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా మరియు ప్రాణాంతకరమైన ఎల్లో ఫీవర్ తదితర వ్యాధులు సంక్రమించి అనేక మందిని శక్తిహీనులను చేస్తున్నాయి.

ఈ ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి , దోమల నివారణోపాయ మందులు వాడటం మంచిది. అయితే ఇవి చాలా వరకూ రసాయనాలతో తయారుచేసినవి. దోమల నివారణకు ఉపయోగించే వాటిలో టాక్సిక్ కెమికల్స్ ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఊపిరితిత్తులకు మీద దుష్ప్రభాలు చూపెడుతాయి. అంతే కాదు ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది.

దోమలు నిరోధంచడానికి మన ఉపయోగించే ఆవిర్లు లేదా పొగకు సంబంధించిన నిరోధకాలు కూడా మన ఆరోగ్యానికి హాని కలిగించవ్చు. దోమ నివారణకు మనం ఉపయోగించే పొగ లేదా ఆవిరి వంటివి మనం పీల్చడం వల్ల దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది.

దోమనివారిణకు రసాయనిక నివారణోపాయాలు కాకుండా, కొన్ని ఉత్తమ హోం రెమెడీలు మనకు అందుబాటులో ఉన్నాయి . ఈ నేచురల్ హోం రెమెడీస్. ఇవి సురక్షితమైనవి మరియు ఆరోగ్యపరంగా ఎటువంటి దుష్ప్రభావాలను కలగనివ్వవు. ఇవి ఎలాంటి స్కిన్ అలర్జీలు కానీ, స్కిన్ ఇరిటేషన్ కానీ కలిగించవు. మరి ఆ ఎఫెక్టివ్ హో మేడ్ దోమ నివారణుల ఏంటో ఒక సారి చూద్దాం...

1. కాంటిప్ ఆయిల్:

1. కాంటిప్ ఆయిల్:

దోమనివారణకు ఒక ఎఫెక్టివ్ మరియు సురక్షితమైన హోం మేడ్ దోమనిరోధకం . ఈ ఎసెన్షియల్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఆయిల్ ను నేరుగా చర్మానికి అప్లై చేయడం లేదా స్ప్రే బాటిల్లో పోసి, గది మొత్తం స్ప్రే చేయడం చేయవచ్చు.

2. వేపనూనె:

2. వేపనూనె:

దోమ నివారిణకు మరో నేచురల్ హోం రెమెడీ వేపనూనె. కొద్దిగా వేపనూనెను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి శరీరానికి అప్లై చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మలేరియా వ్యాప్తి చెందకుండా నివారిస్తుంది. అంతే కాదు, ఇది అనేక స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది . చర్మంను సాఫ్ట్ గా మరియు సురక్షితంగా ఉంచుతుంది.

3. వెల్లుల్లి:

3. వెల్లుల్లి:

మరో నేచురల్ మస్కిటో రిప్లెయంట్ ఇది. ఇది దోమలను నివారించడంలో చాలా సులభమైన మరియు సింపుల్ హోం రెమెడీ. వెల్లుల్లి నూనెను చర్మానికి అప్లై చేయడం ద్వారా దోమలను నివారించుకోవచ్చు . ఇది దోమలను నివారించడంలో ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ . కొద్దిగా వెల్లుల్లి నూనెను అప్లై చేస్తే చాలు దోమలను దరిచేరనివ్వవు.

4. యూకలిప్టస్ ఆయిల్ మరియు సన్ ఫ్లవర్ ఆయిల్:

4. యూకలిప్టస్ ఆయిల్ మరియు సన్ ఫ్లవర్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్ మరియు సన్ ఫ్లవర్ ఆయిల్ ను సమంగా తీసుకొని మిక్స్ చేయడం వల్ల ఇది ఒక నేచురల్ రిప్లెయంట్ గా పనిచేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ ను చర్మం మీద రబ్ చేయడం లేదా స్ప్రే చేయాలి. దోమను దూరం చేయడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

5. ల్యావెండర్ ఆయిల్:

5. ల్యావెండర్ ఆయిల్:

దోమలను నివారించడంలో ల్యావెండర్ నూనె చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ల్యావెండర్ ఆయిల్ ను చర్మం మీద మర్దన చేయాలి. ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీగా పనిచేస్తుంది. దోమలను నివారిస్తుంది.

6. ఆర్గానిక్ సోయా బీన్ ఆయిల్:

6. ఆర్గానిక్ సోయా బీన్ ఆయిల్:

ఇది మరో ఎఫెక్టివ్ రిప్లెయంట్. సోయా నూనె చౌకైనది మరియు చాలా సులభంగా మార్కెట్లో అందుబాటులో ఉన్నది. ఇది ఒక అద్భుతమైన హోం రెమెడీగా పనిచేస్తుంది.

7. వెనీలా ఎక్సట్రాక్ట్:

7. వెనీలా ఎక్సట్రాక్ట్:

కొద్దిగా వెనీలా ఎక్స్ ట్రాక్ట్ లేదా వెనీలా ఎసెన్స్ ను పల్స్ పాయింట్స్ లో అప్లై చేయాలి . ఈ వాసన శరీరం మొత్తం వ్యాప్తి చెందడం వల్ల దోమలు దగ్గరికి రాకుండా ఉంటాయి.

8. పెప్పర్ మింట్ మరియు సింట్రోనెల్లా:

8. పెప్పర్ మింట్ మరియు సింట్రోనెల్లా:

రెండు నూనెలను మిక్స్ చేసి పల్స్ పాయింట్స్ లో అప్లై చేయాలి . ఇంకా మీరు 1/4కప్పు నీళ్ళు లేదా యాపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో పోసి , షేక్ చేసి చర్మం మీద దుస్తుల మీద స్ప్రే చేయాలి.

9. గ్రేప్ సీడ్ ఆయిల్ మరియు జోజోబా ఆయిల్:

9. గ్రేప్ సీడ్ ఆయిల్ మరియు జోజోబా ఆయిల్:

ఈ రెండు నూనెలను మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. దోమలను నివారించడంలో ఇది ఒక నేచురల్ మరియు సురక్షితమైన హోం రెమెడీ.

10. టీట్రీ ఆయిల్ :

10. టీట్రీ ఆయిల్ :

ఇది ఒక యాంటీ మైక్రోబైల్, యాంటీ బయోటిక్, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగినది. మరియు చాలా త్వరగా నయం చేసే గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది దోమను కూడా చాలా సులభంగా నాశనం చేస్తుంది . బాడీలోషన్ తో పాటు కొద్దిగా దీన్ని అప్లై చేయాలి.

English summary

10 Natural Homemade Mosquito Repellents

Mosquito repellents are useful to prevent bites, skin eruptions and rashes that may be caused by an insect's bite. Mosquito bites can cause severe skin irritation through an allergic reaction to the mosquito's saliva. They are also a cause of malaria.
Desktop Bottom Promotion