For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి 8 మంచి రెగ్యులర్ అలవాట్లు

By Super
|

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమున్నా, ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు ఇంటిని చూసి, ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఎందుకంటే ఇంటి శుభ్రత ఎక్కువగా ఇల్లాలికే తెలుసు, ఎక్కువ ఇల్లాలిపై ఆధారపడిపడి వుంటుంది. ఏ వస్తువు ఎక్కడ వుండాలి ఏది ఎంత శుభ్రంగా వుంచుకోవాలి అనే అంశంపై ఆధారపడి వుంటుంది. ఇంటిని ఎంత చక్కగా దిద్దుకుంటే అంతపేరు ప్రతిష్ఠలు వస్తాయి.

అందుకే ఇంటిపై పెక్కు శ్రద్ధ చూపండి. ఒక వ్యక్తి శుభ్రత ఒకరికే మంచి చేస్తుంది. ఒక ఇంటి శుభ్రత ఓ ఇంటి వారికి మాత్రమే గాక కుటుంబ సభ్యులందరికీ మంచి చేస్తుంది. ఇంటిని శుభ్రంగా పెట్టుకోక పోతే చాలామందికి విరక్తి పుడుతుంది. సామాన్లతో ఇంట్లోని గదులన్నిటినీ నింపేస్తే చాలా చికాకుగా అనిపిస్తుంది. గదిలో ముప్పావు భాగం లేదా సగభాగమైనా ఖాళీగా వదిలేసి చూడటానికి విశాలంగా కనిపిస్తుంది. గదులన్నీ సామాన్లతో నింపేస్తే ఎంత విశాలమైన ఇల్లయినా చిన్నదిగానే కనిపిస్తుంది.

మీరు ఉద్యోగాలు చేసే మహిళలు లేదా కొత్తగా కాపరం పెట్టుకున్నవారైనా ఇంటి నిబంధనలు పాటించాల్సిందేమీ ఇంటిలో కొన్ని వస్తువులు ప్రతిరోజూ శుభ్రం చేయాలి లేకుంటే మీకే చికాకు కలిగిస్తాయి. కొంతమంది దేనినైనా సరే వారానికోసారి శెలవు రోజులో చేద్దామని వదిలేస్తారు. కాని అది సరికాదు. ప్రతిరోజూ శుభ్రపరచుకోవాల్సిన వస్తువులేమిటో చూడండి.

సోఫా సెట్ దుమ్ము దులపటం

సోఫా సెట్ దుమ్ము దులపటం

చాలామంది వారానికొకసారి దులుపుదామని అనుకుంటారు. కాని దుమ్ము కొట్టుకున్న సోఫాలు, టీపాయ్ వంటివి మన ఉపయోగానికే అసహ్యం పుట్టించేవిగా వుంటాయి. ప్రతిరోజూ వాడే వస్తువుల దుమ్ము దులపటమనేది అవసరంగా భావించండి.

వంట గిన్నెలు

వంట గిన్నెలు

మీరు ఏ డిష్ చేసినప్పటికి, గిన్నెలను వీలైనంత త్వరగా అంటే కనీసం 10 లేదా 12 గంటలలోపు శుభ్రం చేసేయండి. లేదంటే, అవి వాసన కొట్టటమే కాక, అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయి.

డైనింగ్ టేబుల్

డైనింగ్ టేబుల్

మీరు దీనిపై తినటానికి కూర్చుంటారు. కనుక ఇది శుభ్రంగా వుండాలని చెప్పనవసరం లేదు. దీనిపై ఆహార పదార్ధాలు, మరకలు, ఎన్నో వుంటాయి. వారాంతంలో చేద్దామనుకుంటే చాలా అసహ్యంగా తయారవుతుంది. కనుక. ఒక తడి గుడ్డనను తీసుకొని వీలైనంత త్వరగా తుడిచేస్తే మరకలు మాయమై డైనింగ్ టేబుల్ బాగుంటుంది.

కిచెన్ సింక్

కిచెన్ సింక్

దీనిలో వంట పాత్రలను శుభ్రం చేస్తాము. కనుక సింక్ కూడా శుభ్రంగా వుంటే పాత్రల శుభ్రత మరింత బాగుంటుంది. ప్రతిరోజూ శుభ్రం చేయవలసిన వాటిలో ఇది ప్రధానమైంది.

కిచెన్ స్లాబ్, మరియు దానిపైన వుండే స్టవ్

కిచెన్ స్లాబ్, మరియు దానిపైన వుండే స్టవ్

వంట పూర్తయిన తర్వాత, గ్యాస్ స్టవ్, కిచెన్ స్లాబ్ తప్పక శుభ్రం చేయండి. అక్కడ ఏ మాత్రం మురికి లేదా పదార్ధాలు పడి వున్నా తినే ఆహారం సైతం అనారోగ్యకరంగా వుంటుంది.

బెడ్ మీరు పడుకునే బెడ్స్

బెడ్ మీరు పడుకునే బెడ్స్

ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. బెడ్ షీట్ మార్చకపోయినప్పటికి దానిని దులపటం, ముడుతలు లేకుండా చేయటం, తలగడలు సరి చేయటం, రాత్రి వేళ కప్పుకున్న దుప్పటి మడత పెట్టటం వంటివి తప్పక చేయాలి. మరల పడుకునే సమయంలో శుభ్రపరచిన బెడ్ పై పడుకోవటం మానసికంగాను, శారీరకంగాను హాయి అనుభవించేలా చేస్తుంది. ప్రతిరోజూ శుభ్రం చేసుకుంటూంటే, పండుగలపుడు, ఇంట్లో ఏదైనా సందర్భాలు వచ్చినపుడు పని కూడా తక్కువగా వుంటుంది.

కిచెన్ టవల్స్ అండ్ స్పాంజ్ :

కిచెన్ టవల్స్ అండ్ స్పాంజ్ :

వంటగది పరిశుభ్రతే ఇంటిల్లిపాదిని ఆరోగ్యంగా కాపాడుతుంది. కాబట్టి, వంటగదిలోని టవల్స్, స్పాంజ్ లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.

ఫ్లోర్ :

ఫ్లోర్ :

ఇండి పరిశుభ్రతలో మరొకటి ఫ్లోరింగ్. ఇంట్లోకి బయటకు నడుస్తుంటాము, గాలి, వెలుతురు కోసం, విండోలను తెరచి ఉంచుతాము. అటువంటప్పుడు, దుమ్మధూళి కూడా ఫ్లోర్ మీద పడి, అది తినే ఆహారాల మీద, మనం వేసుకొనే దుస్తుల మీద పడి, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంది. కాబట్టి, ఫ్లోరి క్లీనింగ్ తప్పనిసరి.

English summary

Habits To Keep Your House Clean: 8 Tips To Follow

Keeping the house clean on a daily basis helps to keep the family members healthy. It is important to follow a set ground rules or habits everyday so that the house doesn't suffer a messy look.
Story first published: Friday, February 19, 2016, 18:39 [IST]
Desktop Bottom Promotion