For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాచులర్ రూమ్ అందంగా అలంకరించుకోవడం ఎలా..

|

మహిళలకు ఇష్టమైన కళల్లో గృహాలంకరణ ఒకటి. తన ఇంటిని తానే అందంగా డెకరేట్ చేసుకునే సామర్థ్యం ప్రతి మహిళకూ ఉంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఉద్యోగం చేయడానికి ఒంటరిగా సిటీలకు వచ్చిన మహిళలు తమ ఇంటిని అలంకరించుకోవడానికి ఇష్టపడరు. ఇంట్లో ఒక్కరమే ఉంటున్నాం కాదా! ఇల్లెలా ఉంటే ఏంటి...ఏదో నాలుగు రోజులు గడిపేద్దాంలే అనుకుంటుంటారు. కానీ ఒంటిరిగా ఉన్నా కూడా ఇంటిని అలంకరించుకోవడం ముఖ్యమే.

మీ అభిరుచులకు, వ్యక్తిత్వానికి తగినట్లుగా ఇంటిని డెకరేట్ చేసుకోవడం వల్ల ఇల్లు ఆనందానికి ప్రతి రూపంగా మారుతుంది. ఇంటిని స్వీట్ హోం గా మార్చుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం..!

How to Decorate A Bachelor's Room..!

ప్లేస్ ను బట్టి:
ఇంట్లో ఉన్న స్థలాన్ని బట్టి ఇంటిని ఆకర్షణీయంగా అలంకరించుకోవచ్చు. అదెలాగంటే ..వార్డ్ రోబ్ లో పెట్టాల్సిన సామాన్లన్నీ వాటిలో చక్కగా సర్థితే మీకు నడవడానికి చాలా స్థలం మిగులుతుంది. ఇంట్లో మీ దుస్తులు, చెప్పులు, రోజూ వేసుకునే ఆభరణాలు, ఇతర యాక్సెసరీస్ కు కావల్సిన స్థలం కేటాయించుకుని ఇంటి అలంకరణకు తగిన ప్రణాళికను వేసుకుంటే మీరు కోరుకున్నట్లే ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.

లివింగ్ రూమ్ :
మీ లైఫ్ స్టైల్ కి తగినట్లుగా లివంగ్ రూమ్ ని అలంకరించుకోవచ్చు. కానీ అది మరీ మితిమీరకూడదు. ఒక వేళ మీరు సింపుల్ గా అలంకరించాలనుకుంటే మాత్రం అనవసరమైన సామాన్లు తీసేసి ఉన్నవాటితోనే అందంగా అలంకరించుకోవచ్చు. లివింగ్ రూంలో కుషన్లని అమర్చుకుంటే బాగుంటుంది. వీటికి తోడుగా టేబుల్ ల్యాంపులను పెట్టుకుంటే ఆకర్షణీయమైన లుక్ వస్తుంది.

వంటగది: ఉద్యోగం చేసే మహిళలకు వంటగదిని నీట్ గా సర్థుకోవడానికి సరిపడా సమయం ఉండకపోవచ్చు,. కాబట్టి వారానికొకసారైనా...వచ్చిన సెలవు రోజునే దీనికోసం కాస్త సమయం కేటాయించాలి. ఎందుకంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వారు కొందరు ఇంట్లో వంటగదే ఆకర్షణీయంగా కనిపించాలని, మరికొందరు లివింగ్ రూమే బాగుండాలని, ఇంకొందరు బెడ్ రూం బాగుండాలని అనుకుంటారు. అలా కాకుండా అన్ని గదులను అందంగా అలంకరించుకోవాలి. కిచెన్ లో మీరు తయారుచేసిన వంటకాలను పెట్టుకోవడానికి కూడా అనువైన స్థలాన్ని కేటాయించుకునేలా మీ ప్రణాళిక ఉండాలి.

తయారుచేసుకున్న ఆహారాన్ని తిరిగి వేడిచేసుకోవడానికి మైక్రోవేవ్ ఓవెన్ ని అనువైన ప్రదేశంలో అమర్చుకోవాలి. డైనింగ్ టేబుల్ ని టీవీకి ఎదురుగా వేసుకుంటే తినేటప్పుడు హాయిగా టీవీ చూడొచ్చు. దాంతో కాసే కాలక్షేపంగా కూడా ఉంటుంది. మీకు అనుకూలంగా ఉంటే కనుక రిఫ్రిజరేటర్ ని కిచెన్ లో అమర్చితే బాగుటుంది. టోస్టర్ ని డైనింగ్ టేబుల్ కి దగ్గర్లో అమర్చుకుంటే తినేటప్పుడు సులభంగా తీసుకోవడానికి వీలుంటుంది.

పడకగదిన: పడకగదిలో ఉండే మంచం పైకి పరుపు, దానిపై కుషన్లు, తలగడలు, మంచి బెడ్ షీట్లు, బెడ్ కవర్లు ఉంటే బాగుటుంది. మంచానికి ఇరువైపులా టేబుల్ ల్యాంపులను అమర్చాలి. వాటి కాంతి తీవ్రత మరీ ఎక్కువగా , మరీ తక్కువగా కాకుండా గదంతా వ్యాపించేలా చూసుకోవాలి. వీటితో పాటు మ్యూజిక్ సిస్టం, ఆరోమా బర్నర్స్ క్యాండిల్స్ ని అమర్చుకునే విధంగా కొంచెం స్థలాన్ని కేటాయించుకోవాలి. ఇవన్నీ మీరు అవసరమైనప్పుడు వెంటనే ఉపయోగించుకునేలా అమర్చుకోవాలి.

English summary

How to Decorate A Bachelor's Room..!

How to Decorate A Bachelor's Room.
Story first published: Friday, June 24, 2016, 18:06 [IST]
Desktop Bottom Promotion