For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్లప్పుడూ మీ ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకునేలా చేసే 10 సాధారణ అలవాట్లు

By Gandiva Prasad Naraparaju
|

మీ ఇంట్లో మీ రోజువారీ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అనేది అంత శులభమైన విషయం కాదు అనేది నిజం, అంటే దానర్ధం సమయం అంతా దానికే కేటాయించమని కాదు. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అనేది ప్రధానమైన విషయమే కాకుండా దానికోసం మీ సమయం మొత్తం వృధాకాదు అనే నిజాన్ని కూడా మీరు గుర్తించాలి.


మీరు మంచి ఆలోచనలను సృష్టించి, ఆ అలవాట్లను మీరు అనుసరిస్తూ, ఇంట్లో సభ్యులు అందరూ కూడా వాటిని అలవరుచుకునేట్లు చేయాలి. మీరు ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ ఇల్లు చక్కగా, అందంగా, ముఖ్యంగా శుభ్రంగా ఉందోలేదో చూసుకుంటే చాలు.

10 Simple Habits To Keep Your House Clean And Neat All The Time ,

మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు అనుసరించాల్సిన అలవాట్ల జాబితా కింద ఇవ్వబడింది. దానిపై దృష్టి పెట్టండి...

శుభ్రమైన అలవాట్లు చాలా ముఖ్యం, అవి మన ఇంటికి శుభ్రంగా, అందంగా ఉంచుకోవడానికి ఎంతో సహాయపడతాయి.

ఎల్లప్పుడూ మీరు మీ మంచంతోటే మొదలు పెట్టండి

ఎల్లప్పుడూ మీరు మీ మంచంతోటే మొదలు పెట్టండి

మంచం సర్దుకోవడం అనేది సమయాన్ని వృధాచేయడం కాదు. మీరు వాక్యుమ్ క్లీనర్ తో నేలను శుభ్రం చేసేదానికంటే ఎక్కువ ముఖ్యమైనది. రోజంతా గడిచాక విశ్రాంతి తీసుకునే ప్రదేశం బెడ్ రూమ్, మీ బెడ్ రూమ్ మురికిగా ఉంటే, అది అంత ఆనందంగా అనిపించదు.

బట్టలు ఉతకడం మానకూడదు

బట్టలు ఉతకడం మానకూడదు

మూటలో నుండి మొత్తం బట్టలను వేరు చేసి, ఉతకడం ప్రారంభించండి. మొత్తం ఒకేసారి చేయాలి అంటే, మీరు అలసిపోయినట్టు ఉంటారు, ఎక్కువ సమయం వ్యర్ధమవుతుంది. బట్టలు ఉన్న వాటిని బట్టి ఉతికితే తేలికగా, ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

ప్రాధాన్యతలు

ప్రాధాన్యతలు

మొత్తం శుభ్రం చేయడం అనేది ఒకే విధంగా ఉండదని గుర్తుంచుకోండి. మీ ప్రాధాన్యత ప్రకారం ఏది ముందు చేయాలి ఏది తరువాత అనేది జాగ్రత్తగా నిర్ణయించుకోండి, తరువాత మొదటగా మీరు ఏపని చేయాలి అనుకున్నారో దాని ఆధారంగా ప్రాధాన్యతను ఇవ్వండి. దీనివల్ల ఆపనిని మీరు ఎంతో శ్రద్ధతో చేస్తారు అదేవిధంగా తేలికగా కూడా అయినట్టు ఉంటుంది.

మీ కుటుంబ సభ్యులు కూడా ఇందులో పల్గోనేట్టు చేయండి

మీ కుటుంబ సభ్యులు కూడా ఇందులో పల్గోనేట్టు చేయండి

మీ ఇల్లు అంటే మీ కుటుంబ సభ్యులు కూడా అనే విషయాన్నీ గుర్తుంచుకోండి. అలాగే శుభ్రత అలవాట్లు వాళ్ళకు నేర్పడం కూడా అంతే ముఖ్యం. మీరొక్కరే అన్నిపనులు చేసుకోవడం అంటే చాలా కంగారు పడాల్సి వస్తుంది, మీ కుటుంబ సభ్యులను కూడా మీతో కలిసి పనిచేస్తే మీకు చాలా సహాయంగా ఉంటుంది.

రాత్రిపూట శుభ్రం చేసుకోవడం

రాత్రిపూట శుభ్రం చేసుకోవడం

మీరు ప్రతిరోజూ రాత్రి శుభ్రాలు చేసుకోవడం నిర్వహించుకోండి. పిల్లలను వారి గదులను సర్దుకోమని, ప్రతిదీ సరైన ప్రదేశంలో పెట్టమనండి. వంటగది మొత్తం శుభ్రం చేసుకున్న తరువాత పడకగదికి వెళ్ళండి.

శుభ్రం చేసే వస్తువులను దగ్గరగా ఉంచుకోండి

శుభ్రం చేసే వస్తువులను దగ్గరగా ఉంచుకోండి

శుభ్రం చేయడానికి అవసరమైన వస్తువులను దగ్గర పెట్టుకోవడం మర్చిపోకండి. మీరు శుభ్రం చేయడం మొదలు పెట్టాక, ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయో మీకు గుర్తురాకపోవడం సహజం. అంతేకాకుండా ఈ వస్తువులు అన్ని మీ ఇంట్లో నిల్వ ఉంటాయి.

గదులను ఖాళీగా వదిలేయకండి

గదులను ఖాళీగా వదిలేయకండి

మీరు మీ గదిని మార్చాలి అనుకుంటే, మీకు అవసరమైన వస్తువులను పెట్టుకోండి. మీకు అవసరమైన అన్ని వస్తువులను పెట్టుకుంటే కొత్త గది అయినా అపరిశుభ్రంగా ఉంటుంది.

అవసరానికి తగినట్టు అమర్చుకోవడం

అవసరానికి తగినట్టు అమర్చుకోవడం

వస్తువులను అమర్చుకోవడం అనేది సమయంతో కూడుకున్నది కానీ చాలా ముఖ్యం. ఎప్పుడో ఒకసారి, మీ ఇంటిలో వస్తువులను అటుఇటూ మార్చుతూ ఉండండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అనేది అనుసరించాల్సిన ముఖ్యమైన అలవాటు. ప్రతి దానిని ఉపయోగించడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది. కొన్ని బల్లలు లేదా ఉపరితలంగా ఉన్న వస్తువులు ఉంటే దుమ్ము దులపడం చాలా చాలా తేలికగా ఉంటుంది.

నడిచే ప్రదేశం

నడిచే ప్రదేశం

మీరు ప్రతిరోజూ మీ ఇంట్లో తిరిగే ప్రదేశాన్ని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. మీరు ఇంటి మొత్తం ఉన్న మురికిని చాలా తేలికగా తొలగించ వచ్చు. అలాగే ఇంటి మొదట్లో చెప్పులు పెట్టుకునే ప్రదేశం పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

బైట వస్తువులను పడేసి శుభ్రం చేసుకోవడం

బైట వస్తువులను పడేసి శుభ్రం చేసుకోవడం

మీరు ఇవి ఇక్కడి వస్తువులు కావని గుర్తిస్తే, ఇంకొద్ది సమయం వాటిని అక్కడ ఉంచకండి. ఆపని వెంటనే చేయడం వల్ల సమయం సేవ్ అవ్వడమే కాకుండా రేపు చేయాల్సిన పనిలో కొంత పని తగ్గుతుంది కూడా. శుభ్రమైన అలవాట్లు చాలా ముఖ్యం, అవి మన ఇంటికి శుభ్రంగా, అందంగా ఉంచుకోవడానికి ఎంతో సహాయపడతాయి.

English summary

10 Simple Habits To Keep Your House Clean And Neat All The Time

10 Simple Habits To Keep Your House Clean And Neat All The Time ,Listed below are the habits that you should follow to keep your house clean. Take a look.
Desktop Bottom Promotion