For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రీజ్ చేసుకోవచ్చని మీకు తెలియని 11 ఆశ్చర్యకరమైన ఆహార పదార్ధాలు !!

చల్లటి మిఠాయిలు, మాంసం, కాసేరోల్స్ నిల్వ చేయడానికి ఫ్రీజర్ ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు కానీ, ఈ వంటింటి ఉపకరణం అనేక ఇతర వస్తువులను దాచి ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

By Gandiva Prasad Naraparaju
|

చల్లటి మిఠాయిలు, మాంసం, కాసేరోల్స్ నిల్వ చేయడానికి ఫ్రీజర్ ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు కానీ, ఈ వంటింటి ఉపకరణం అనేక ఇతర వస్తువులను దాచి ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పైగా, రిఫ్రిజిరేటర్ గా పిలిచే ఒకే గ్రుహోపకరణంలో వుండే డీప్ ఫ్రీజర్ లేదా ఫ్రీజర్, బాగా నిండుగా ఉన్నప్పుడే బాగా పనిచేస్తుంది, ఎందుకంటే చల్లటి వస్తువులు పక్క వాటిని కూడా చల్లగా వుంచి తక్కువ ఉష్ణోగ్రతను నిలిపి ఉంచుతాయి.

11 Surprising Foods You Didn’t Know You Could Freeze

సక్రమంగా దాస్తే, ప్రపంచంలోని అద్భుతమైన ఆహార పదార్ధాలను దాచి ఉంచుకోవడానికి మీ ఫ్రీజర్ చాలా తేలికైన మార్గం. ఫ్రీజ్ చేసుకోవచ్చని మీకు తెలియని ఈ వస్తువులను దాంట్లో జాగ్రత్తగా దాచుకోండి.

1.నట్స్:

1.నట్స్:

వాటిలో వుండే నూనె పదార్ధాల వల్ల అవి త్వరగా పులిసిపోతాయి. నిజానికి సాధారణ ఉష్ణోగ్రతలో రెండు వారాలు ఉండగానే, చాలా గింజ ధాన్యాలు చెడిపోవడం మొదలౌతుంది, కానీ వాటిని మీరు ఫ్రీజ్ చేస్తే అవి పాడవడం తగ్గిపోతుంది. మీరు వెంటనే వాడే వస్తువులు రిఫ్రిజిరేటర్ లో వుంచ౦డి - ఎందుకంటే మీరు తరచూ సంచులు తెరిచి, మూస్తూ వుంటే తేమకు, తద్వారా చెడిపోవడానికి వీలు కలుగుతుంది. మీరు తరచుగా వాడని వాటిని ఒక ప్లాస్టిక్ సంచిలో చుట్టి, ఒక రీ సీలబుల్ ఫ్రీజర్ బాగ్ లో పెట్టి ఫ్రీజర్ లో దాచండి.

2.మూలికలు :

2.మూలికలు :

మూలికల లాంటివి నేరుగా ఫ్రీజర్ లో పెడితే అవి మెత్తబడిపోయి రుచి కోల్పోతాయి, కానీ వాటిని అలా పాడు కాకుండా దాచేందుకు కూడా మార్గం వుంది. ఆలివ్ ఆయిల్ వాడడం దీనికి మంచి చిట్కా. సేజ్ ఆకులు, ఒరేగానో, థైమ్ ఆకులు, రోజ్ మేరీ ఆకులు లాంటివి ముక్కలుగా తరిగి ఐస్ క్యూబ్ ట్రే లలో సగం దాకా నింపండి. వాటిని ఇప్పుడు ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ లో నింపి, పైన వ్యాకోచానికి వీలుగా కొంచెం ఖాళీ వుంచండి. వీటిని ప్లాస్టిక్ రాప్ లో చుట్టి ఐస్ ట్రే లను రాత్రి తెల్లవారేదాకా ఫ్రీజ్ చేయండి. తరువాత క్యూబ్స్ ను ట్రేలనుంచి తీసివేసి వాటిని రీ సీలబుల్ ఫ్రీజర్ బాగ్స్ లో దాచి వుంచండి. మీరు వాటిని వాడలనుకున్నప్పుడు వాటిని సూప్ లోకో స్టూ లోకో లేదా ఫ్రయింగ్ పాన్ మీదకో నేరుగా విడిచేయండి.

3.మిగుల ముగ్గిన అరటి పండ్లు :

3.మిగుల ముగ్గిన అరటి పండ్లు :

మీ ఇంట్లో అరటి పళ్ళు బాగా మాగిపోతే కంగారు పడకండి. బనానా బ్రెడ్ తయారు చేయడానికి స్మూతీ ల లాంటి వాటిలో వాడడానికి అవి చాలా బాగుంటాయి. నిజానికి అరటి పండు ఎంత పండితే స్మూతీ అంత బాగుంటుంది. కత్తితో ఒక వైపు తోలు వలిచి ఆ అరటి పండును అలా బయటకు వదిలేయండి. అరటి పళ్ళను తోలుతో ఫ్రీజర్ లో పెట్టకూడదు ఎందుకంటే తోలు గట్టి పడ్డాక వాటిని తీయడం కష్టం. వాటిని ప్లాస్టిక్ రాప్ లో చుట్టి రీ సీలబుల్ బాగ్స్ లో వుంచి - అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి ఆ సంచుల్లోంచి వీలైనంత గాలిని బయటకు వదిలేయండి. మీరు వాటిని స్మూతీలలో వాదాలనుకుంటే నేరుగా ఫ్రీజర్ నుంచి తీసి బ్లె౦డర్ లో వేయండి. బనానా బ్రెడ్ లాంటి బేకింగ్ పదార్ధాలలో వాడాలంటే, వాటిని ఫ్రిజ్ లోంచి బయటకు తీసి రాత్రంతా బయట వుంచ౦డి లేదా ఒక గంట పాటు రూమ్ టెంపరేచర్ లో వుంచండి.

4.పచ్చి గుడ్లు :

4.పచ్చి గుడ్లు :

సరే మీకు అదృష్టం కొద్దీ డజన్ల కొద్దీ పచ్చి గుడ్లు దొరికాయనుకోండి, కానీ ఈస్టర్ ఇంకా చాలా రోజులు వంటే అవన్నీ పాడయ్యేలోగా వాడలేరుగా! గుడ్లను పెంకులతో సహా ఫ్రీజ్ చేస్తే వాటిలోని ద్రవం వ్యాకోచించి పెంకు పగిలి మీ ఫ్రీజర్ మొత్తం దుర్వాసనతో నిండి పోతుంది. దాని బదులు వాటిని ముందుగా ఒక గిన్నె లోకి కొట్టి, కొద్దిగా ఉప్పు వేసి కలపండి, కానీ మరీ ఎక్కువ కలపకన్ది ఎందుకంటే గాలి ఎక్కువైతే పచ్చ సోన ముద్దగా అయిపోతుంది. వాటిని మీరు ఒక్కసారికి ఎంత వాడతారో ఆ మోతాదులో రీ సీలబుల్ బాగ్స్ లో వేసి నిల్వ వుంచండి - అవి సంవత్సరం వరకు బాగుంటాయి.

5.మొక్కజొన్న కంకులు :

5.మొక్కజొన్న కంకులు :

శీతాకాలంలో జొన్నల తీపి రుచి చూడాలనిపించిందా? సరిగ్గా ప్రణాళిక వేయండి, అలానే చేయవచ్చు. అప్పుడే స్థానిక రైతు దగ్గర లేదా మార్కెట్ లో కొనుగోలు చేసిన తాజా మొక్కజొన్న కంకులు జాగ్రత్తగా ఫ్రీజ్ చేస్తే, పొట్టు వగైరాలతో సహా కనీసం సంవత్సర౦ పాటు నిల్వ ఉంచవచ్చు. అవి మీకు తాజాగా పొట్టు, దారాలతో సహా దొరికితే వాటిని వెంటనే ఫ్రీజర్ బాగ్స్ లో చుట్టి పెడితే, మీరు వాటిని డీ ఫ్రాస్ట్ చేసినప్పుడు అంటే తాజాగా మెత్తగా వుంటాయి. మీరు వాటిని సంప్రదాయ సూపర్ మార్కెట్ లో కొన్నట్లయితే వాటి మీద ఎంజైమ్స్ ఏర్పడి రుచి, రంగు పోకుండా ఉండాలంటే మీరు వాటిని పొట్టు దులిపి వేరు చేసి బ్లాంచింగ్ చేయాలి. చిన్న కంకులను ఏడు నిమిషాలు, ఒక మోస్తరువి 9 నిమిషాలు, పెద్దవి 11 నిమిషాల పాటు ఉడికించి చల్లార్చాలి.

6.వెల్లుల్లి :

6.వెల్లుల్లి :

వెల్లుల్లి ఎక్కువ అవడం ఉండదంటారు - నిజమే. వంటకాలకు రుచి జోడిస్తూనే, అది చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పైగా వెల్లుల్లిని ఫ్రీజ్ చేయడం చాలా తేలిక. వెల్లుల్లి రెబ్బలను వొలిచి వాటిని ఫ్రీజర్ లో ఉంచవచ్చు లేదా మొత్తం వెల్లుల్లి గడ్డనే ఉంచవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే అత్యుత్తమ నాణ్యత గల ఆర్గానిక్ వెల్లుల్లిని ఎంచుకోండి ఎందుకంటే ఫ్రీజ్ చేశాక కూడా దాని రుచి చాలా బాగుంటుంది. తెగులు కానీ పచ్చటి పిలకలు కానీ రాకుండా ఉండేలా, బాగా ఎండి గట్టిగా ఉండేలా చూసుకోండి - తడిగా అతుక్కుంటూ వుండకూడదు - అలా వుంటే దాన్ని వీలైనంత త్వరగా వాదేయండి ఎందుకంటే అది ఫ్రీజ్ అవదు. మీరు దాన్ని ఒలిచి కానీ ముక్కలుగా కోసి గానీ ఫ్రీజ్ చేయాలనుకుంటే ముందు దాన్ని 10 నిమిషాల పాటు కుడురుకోనివ్వండి - ఇలా చేస్తే అల్లిసిన్ అనే పదార్ధాన్ని అది వదులుతుంది - దీని వల్లనే వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గ్లాస్ లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో కొన్ని నెలల వరకు వెల్లుల్లిని ఫ్రీజ్ చేసి ఉంచుకోవచ్చు.

7.ద్రాక్ష పళ్ళు :

7.ద్రాక్ష పళ్ళు :

ఫ్రీజ్ చేసిన ద్రాక్ష పళ్ళు చాలా ఆరోగ్యకరమైన చిరుతిండి. అవి కరకరలాడుతూ చాలా తీయగా కూడా వుంటాయి పైగా వాటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. మీరు చేయాల్సిందల్లా వాటిని కడిగి, ఎండా బెట్టి ఒక బేకింగ్ షీట్ మీద పరవడమే. ఈ షీట్ ను మీ ఫ్రీజర్ లో మూడు లేదా నాలుగు గంటలు ఉంచండి, ఇక వాటిని రీ సీలబుల్ ప్లాస్టిక్ బాగ్స్ లో ఫ్రీజ్ చేసి నిల్వ వుంచండి లేదా వెంటనే తినేయండి. వైట్ వైన్ లోకి కరిగిపోయి రుచి పాడు చేసే ఐస్ బదులు ఇవే కొన్ని వేసుకోండి.

8.పళ్ళు :

8.పళ్ళు :

నిమ్మకాయలు, నారింజలు, బత్తాయిలు లాంటి పళ్ళను ఫ్రీజ్ చేస్తే అవి తాజాగా వుండి తరువాత వంటకాల్లోకి, పానీయాల్లోకి వాడుకోవడానికి బాగుంటాయి. అవి రుచిగా ఉండడమే కాకుండా వాటిలో ఫోలేట్, విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్ ల లాంటి పోషకాలు పెద్ద మొత్తంలో వుంటాయి - ఇవి మీ శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ పాడు చేయకుండా కాపాడతాయి. వీటిని అలాగే ఫ్రీజ్ చేస్తే అవి మెత్త పడి పోతాయి. దాని బదులుగా వాటిని సన్న ముక్కలుగా తరిగి ఒక్కో స్లైస్ కి మధ్యలో వాక్స్ షీట్ ఉంచి ఫ్రీజర్ లో నిల్వ చేయండి. ముందుగా పళ్ళను శుభ్రంగా కడగడం మర్చిపోకండి, ఎక్కడైనా చెక్కు లేచినా ఆహారం వల్ల రోగాలు కొనితెచ్చే సూక్ష్మ క్రిములు లేకుండా ఉండేలా చూసుకోండి.

9.వండిన అన్నం :

9.వండిన అన్నం :

ముందుగా ఫ్రీజ్ చేసి తరువాత వేడి చేసిన అన్నం చాలా రుచిగా ఉంటుందని జపనీయులు చెప్తారు - ఇలాంటి నిల్వ మార్గాలు ప్రయత్నించిన ఇతరులు కూడా ఇది నిజమేనంటారు. మీరు ఇంతకు ముందు అన్నాన్ని ఫ్రీజ్ చేసినప్పుడు అది చాలా పొడిగా, గట్టిగా మారిపోవడం చూసే వుంటారు. తరచుగా మిగిలిన అన్నాన్ని ఫ్రిజ్ లో ఉంచినా సరే అది రుచి కోల్పోతుంది. కానీ ఫ్రీజర్ లో నిల్వ చేసే మార్గం వేరు. అప్పుడే వండిన తేమ వున్న అన్నాన్ని ఒక గాలిబారని డబ్బాలో గానీ లేక రీసీలబుల్ ప్లాస్టిక్ బాగ్ లో కానీ వుంచి వెంటనే గట్టిగా మూత పెట్టేయండి. ఇలా ఫ్రీజ్ చేసిన అన్నాన్ని ఒక గిన్నె లోకి వంపి మైక్రోవేవ్ చేసినా లేదా మామూలు స్టవ్ మీద నీళ్ళు పొలసి వేడి చేసినా తాజాగా, తేమగా అప్పుడే వండిన అన్నం లాగా రుచిగా వుంటుంది.

10.ఉల్లిపాయలు :

10.ఉల్లిపాయలు :

వెల్లుల్లి లాగే, వంటకాలకు రుచి అద్దాలన్నా, ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించాలన్న ఉల్లి కూడా బాగా పనికి వస్తుంది. వాటిని కొంచెం ముందుగా తయారు చేసి పెట్టుకుంటే అన్ని రకాల వంటలలోకి చక్కగా వాడుకోవచ్చు. తోలు తీసి ముక్కలు కోసి, దాన్ని ప్లాస్టిక్ ఫ్రీజర్ బాగ్ లో వుంచి మీరు వాడే వరకు ఫ్రీజర్ లో వుంచండి. మీరు వాటిని కరిగించకుండానే నేరుగా మీ మరినారా సాస్, సూప్, స్ట్యూ లేదా మీరు తయారు చేసే ఏ వంటకంలోనైనా నేరుగా వేయవచ్చు.

11.పిండి :

11.పిండి :

పిండిని మీ వంటింటిలో కాకుండా ఫ్రీజర్ లోనే ఉంచాలి, కానీ ప్రస్తుతం అది మీ వంటి౦టిలోనే వుండి వుంటుంది. కానీ చాలా ఆహార పదార్ధాల మాదిరిగానే ఫ్రీజర్ లో పిండి చాలా కాలం నిల్వ వుంటుంది. అందుకే చాలా మంది బేకర్లు పిండిని ఫ్రీజ్ చేసి ఉంచుతారు. పైగా, పదార్ధాలు చల్లగా వుంటే, పెస్త్రీ క్రస్ట్ లు కరకరలాడుతూ వుంటాయి. పిండిని ఫ్రీజ్ చేస్తే అవి త్వరగా పాడై పోవడాన్ని తగ్గిస్తుంది, అలాగే వాటిని పురుగులు పట్టకుండా చేస్తుంది. మేసన్ జార్లు లేదా పెద్ద జిప్ టాప్ ఫ్రీజర్ సంచుల్లో లేదా గాలిబారని డబ్బాల్లో పిండిని నిల్వ చేసుకోండి.

English summary

11 Surprising Foods You Didn’t Know You Could Freeze

Food is one of the most vital necessities of life. Making the right choice of foods is very essential for a healthy living. Consuming foods high in fat, calories and carbohydrates can only lead to weight gain and serious health conditions too. Hence, it is always better to have low-calorie foods in order to prevent weight gain and other diseases..
Story first published:Thursday, December 14, 2017, 17:43 [IST]
Desktop Bottom Promotion