For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లుశుభ్రం చేయటానికి యాసిడ్ ను వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మ్యూరియాటిక్ యాసిడ్ అని కూడా పిలవబడే హ్రైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ ఇంటి యజమానికైనా తన ఇల్లు శుభ్రపరుచుకునే ద్రవాలలో అన్నిటికన్నా గాఢమైనది మరియు శక్తివంతమైనది అని తప్పక తెలిసే ఉంటుంది. చాలామంది నేలను శుభ్

|

మ్యూరియాటిక్ యాసిడ్ అని కూడా పిలవబడే హ్రైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ ఇంటి యజమానికైనా తన ఇల్లు శుభ్రపరుచుకునే ద్రవాలలో అన్నిటికన్నా గాఢమైనది మరియు శక్తివంతమైనది అని తప్పక తెలిసే ఉంటుంది. చాలామంది నేలను శుభ్రపర్చుకోడానికి ఫినాయిల్ ను వాడతారు.

ఉపరితలాలను శుభ్రపర్చే ద్రవపదార్థాలను ఇంట్లో అనేక వస్తువులను శుభ్రంగా, మెరిసేట్లు ఉంచడానికి వాడతారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నిటికన్నా శక్తివంతమైనది, సరిగ్గా వాడకపోతే భారీ నష్టం కూడా కలిగిస్తుంది.

ఈ ఆమ్లం టైల్స్ పై మురికి తొలగించటానికి, ఇంట్లో ఏ వస్తువులపైన అయినా వదలని మొండిమరకలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోడం చాలా అవసరం లేకపోతే చాలా హానికారకమవుతుంది.

how to use acid to clean tiles and other household items

ఒకవేళ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పొరపాటున చర్మానికి కానీ కళ్ళకి కానీ తగిలితే, పెద్ద గాయాలు అవ్వచ్చు. అందుకని, అత్యంత జాగ్రత్త అవసరం మరియు పిల్లలు ఆ శుభ్రపర్చే గదికి, ఆ ప్రదేశానికి దూరంగా ఉండడం మంచిది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి వచ్చే పొగలు కొంతమంది శ్వాససమస్యలు కూడా కలిగించవచ్చు.

మ్యూరియాటిక్ యాసిడ్ చాలా ప్రమాదకరం, మరియు గాఢంగా శుభ్రం చేసే పదార్థం. నిపుణుల సలహా ఏంటంటే మిగతా అన్నిరకాల శుభ్రపర్చే క్లీనర్లు అన్నీ వాడేసాక ఆఖరున మాత్రమే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా మ్యూరియాటిక్ యాసిడ్ ను వాడటానికి ఆలోచించండి.

1. గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు

సబ్బు నురగ లేదా బాత్ రూం లేదా వంటింటి టైల్స్ పై కఠిననీటి చారలు లేదా మొండి మరకలు తొలగించటానికి ఒక వంతు మ్యూరియాటిక్ యాసిడ్ ను ఐదు లేదా ఆరు వంతుల నీరుతో కలపాలి.

ఈ కలపడం ఎప్పుడూ నాలుగుగోడల మధ్య కాక, ఇంటి బయట చేయండి, ఎందుకంటే ఈ యాసిడ్ చాలా గాఢమైనది. యాసిడ్ సీసాపై ఉన్న సూచనలు మరియు హెచ్చరికలను అన్నీ చదవడం,అలానే చేయడం చాలా ముఖ్యం.

ఇంకా, రబ్బరు గ్లోవ్స్ తప్పనిసరి. ఈ మిశ్రమాన్ని నైలాన్ ప్యాడ్ల సాయంతో నేలపై కానీ, మీరు శుభ్రం చేయాలనుకుంటున్న వస్తువుపై గుండ్రంగా రాస్తూ పట్టించండి. కానీ కొన్ని విషయాలు మనస్సులో ఉంచుకోవాలి.

how to use acid to clean tiles and other household items

2. ఆ ప్రదేశానికి గాలి,వెలుతురు వచ్చేట్లా చూడండి

ఆ ప్రదేశానికి వెంటిలేషన్ ఉంచడం ముఖ్యం. ఎక్స్ హాస్ట్ ఫ్యాన్లు ఉంటే వాటిని ఆన్ చేయండి. ఇంకా కావాలంటే ఫ్యాన్లను గది అంతా పెట్టి సరైన వెంటిలేషన్ కలిగేలా చేయండి.

3 అవసరమైన జాగ్రత్తలు

సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మ్యూరియాటిక్ యాసిడ్ కళ్ళకి మరియు చర్మానికి తీవ్రనష్టం కలిగించగలదు.అందుకని మొహానికి మాస్క్ లు, కళ్లద్దాలు, గ్లవ్స్ వాడటం తప్పనిసరి.

how to use acid to clean tiles and other household items

4. వంటసోడా వాడకం

మీరు శుభ్రపర్చే ప్రదేశం దగ్గర తప్పక వంటసోడా డబ్బా దగ్గర్లో ఉంచుకోవటం ముఖ్యం. ఒకవేళ యాసిడ్ వలికిపోతే, వంటసోడాను దానిపై వేయటం మేటి పరిష్కారం. గార్డెనింగ్ లైమ్ లేదా వంట సోడా యాసిడ్ ను తటస్థం చేయటంలో సాయపడుతుంది.

యాసిడ్ ను శుభ్రపర్చడానికి వాడేటప్పుడు ఏం చేయాలి

how to use acid to clean tiles and other household items

5. ఉత్పత్తిదారుల సలహా ప్రకారం నీరును కలపటం మంచిది

యాసిడ్ సీసాపై సూచించినంత నీటినే యాసిడ్ తో కలపటం చాలా ముఖ్యం. ఈ సూచనల ప్రకారం, ఐదు వంతుల నీటికి ఒక వంతు యాసిడ్ ను కలపాలి. కానీ యాసిడ్ గాఢతను బట్టి కొంచెం అటూ ఇటూ అవ్వచ్చనుకోండి.

చాలా యాసిడ్లు 31 శాతం వరకూ నీటితో పల్చన చేయబడతాయి.కానీ గాఢతతో సంబంధం లేదు, మీ సురక్షత కోసం ఎలాంటి యాసిడ్ అయినా ముందు నీటితో పల్చన చేయటం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. ఇంకా నీరును యాసిడ్ తో నేరుగా కలిపేయకండి,లేకపోతే అది చర్య జరిగి చర్మానికి నష్టం కలిగించవచ్చు.

శుభ్రపర్చే విధానం

పెద్ద ప్రదేశాలను మొదట ఒకేసారి చేసేయాలనుకోకండి. చిన్న ప్రదేశాలలో మొదట చేస్తే శుభ్రం బాగా జరుగుతుంది. శుభ్రం చేసేటప్పుడు యాసిడ్ మిశ్రమం మీ చర్మం కానీ, బట్టల వద్దకు కానీ దగ్గరకు రానీయకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఇంకా యాసిడ్ ను ఒకేచోట ఎక్కువసేపు ఉంచకూడదు.

ఈ స్టెప్స్ ను మనస్సులో ఉంచుకుని అనుసరిస్తే, శుభ్రతా కార్యక్రమం త్వరగా మాత్రమే కాదు, ఎటువంటి నష్టంలేకుండా జరుగుతుంది.

English summary

Precautions To Take While Using Acid For Cleaning

The acid helps in cleaning the tiles and many other household items and removes stains that you thought were impossible to remove. But, it is also important to take proper precautions or it may be very harmful for you or others around you. Precautionary measures would help keep issues away.
Desktop Bottom Promotion