మీ ఇంటిని ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోటానికి 10 సింపుల్ హ్యాబిట్స్

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఇంటిపనులను రోజూ అన్నీ చేయటం అంత సులభమేమీ కాదు, కానీ అవే మీ సమయం మొత్తం తినేయాలనే రూలు కూడా లేదు. మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండటమే కాదు, మీ సమయం కూడా కేవలం ఈ పనులతోనే నిండిపోకూడదు.

మీకు తప్పనిసరిగా తెలియాల్సిన టాయిలెట్ శుభ్రపరిచే మేటి చిట్కాలు

ఇంటి కోసం మంచి అలవాట్లను సృష్టించి వాటినే కుటుంబసభ్యులు కూడా పాటించేట్లా చూడండి. మీరు రోజూ ఇల్లును శుభ్రపర్చలేకపోవచ్చు కానీ ఇల్లు నీటుగా, శుభ్రంగా ముఖ్యంగా ఆరోగ్యవంతంగా ఉండాలి. మీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోడానికి ఈ కింది అలవాట్లను పాటించండి....

ఎప్పుడూ మీ పక్కబట్టలు మడతపెట్టుకోవడంతో మొదలుపెట్టండి

ఎప్పుడూ మీ పక్కబట్టలు మడతపెట్టుకోవడంతో మొదలుపెట్టండి

మీ పక్కదుప్పట్లు మడతపెట్టుకోవడం సమయం వృథాచేసే పనేం కాదు. నేలను వ్యాక్యూమ్ క్లీనర్ తో ఎలా శుభ్రం చేస్తారో ఇది కూడా అంత ముఖ్యమే. పడకగదులు విశ్రాంతి కోసం ఉండేవి. రోజంతా పనిచేసాక వచ్చి మీ పడకగది చిరాగ్గా ఉండటం చూస్తే మీకు అస్సలు బాగా అన్పించదు.

బట్టలు ఉతుక్కోవడం

బట్టలు ఉతుక్కోవడం

మొత్తం ఉతకాల్సిన బట్టలను గ్రూపులుగా విడగొట్టి ఒక్కోదాన్ని ఉతకండి. ఒకేసారి మొత్తం బట్టలు ఉతకాలంటే మీకు కూడా అలసట వచ్చేస్తుంది, పైగా ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఒక్కో రకాన్ని బట్టి ఉతికితే సులభంగా, పని వత్తిడి లేకుండా ఉంటుంది.

ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి

ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి

గుర్తుంచుకోవాల్సిన విషయం అన్ని రకాల శుభ్రం చేసే విధానాలు సమానం కాదు. మీరు ఏవేవి ఎలా శుభ్రం చేయాలనుకుంటున్నారో లిస్టు వేసుకుని మొదట ఏవి చేయాలనుకున్నారో వాటితో మొదలుపెట్టండి. ఇది మీరు శ్రద్ధగా పని చేయటానికే కాదు, పనులను కూడా సులువు చేసేస్తుంది.

మీ కుటుంబసభ్యులను కూడా పాల్గొనేలా చేయండి

మీ కుటుంబసభ్యులను కూడా పాల్గొనేలా చేయండి

ఈ ఇల్లు మీ ఒక్కరిదే కాదు మీ ఇంట్లో వాళ్లందరిది కూడా అని గుర్తుంచుకోండి. అందుకే వారికి కూడా ఈ శుభ్రత అలవాట్లు నేర్పడం ముఖ్యం. మీరు ఒక్కరే అన్ని పనులు చేసి వత్తిడి చెందటం కన్నా, మీ కుటుంబంతో పంచుకుని చేస్తే చాలా బావుంటుంది.

రాత్రిపూట శుభ్రం చేయటం

రాత్రిపూట శుభ్రం చేయటం

మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు మంచిగా అన్నీ శుభ్రం చేసే అలవాటు పెట్టుకోండి.పిల్లలకు వాళ్ల వస్తువులను సర్దేసి, వారి గదులను శుభ్రం చేసుకుని పడుకునేలా తర్ఫీదు ఇవ్వండి. వంటగదిని కూడా శుభ్రం చేసి పడుకోటం నేర్చుకోండి.

శుభ్రం చేసే వస్తువులు అందుబాటులో ఉంచుకోటం

శుభ్రం చేసే వస్తువులు అందుబాటులో ఉంచుకోటం

శుభ్రతకి కావాల్సిన వస్తువులన్నీ దగ్గరలోనే ఉంచుకోటం గుర్తుంచుకోండి. తీరా మీరు క్లీనింగ్ మొదలుపెట్టాక శుభ్రం చేసే వస్తువులు ఎక్కడో పెట్టామని మర్చిపోతే,మీకే చిరాకు వస్తుంది.ఇంకా కావాల్సిన వస్తువులను బజారు నుంచి ముందే తెచ్చిపెట్టుకోండి.

మీ వంటగదిలోని క్లాత్సే మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తుంది..

గదులు మార్చేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకండి

గదులు మార్చేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్లకండి

మీరు గదిని మారుస్తున్నట్లయితే, మీకు అవసరమైన అన్ని వస్తువులను తీసుకెళ్ళండి. అలా అని మొత్తం తీసుకెళ్తే కొత్త గదిలో కూడా అయోమయం నెలకొంటుంది.

అనవసర వస్తువులు తీసిపారేయటం

అనవసర వస్తువులు తీసిపారేయటం

అనవసర వస్తువులు వెతికి పారేయడం చాలా సమయం తీసుకుంటుంది కానీ ముఖ్యం.అప్పుడప్పుడు ఇంటిలో అనవసర వస్తువులు తీసి అన్నిటినీ సర్దటం మంచిది. ఈ అలవాటు అందరూ తప్పక పాటించాలి. వాడే వస్తువులు అన్నీ అందుబాటులో ఉండేలా సర్దుకోవాలి. టేబుల్స్ లేదా బల్లలపై తక్కువ వస్తువులుంటే వాటిని శుభ్రపర్చటం సులువవుతుంది.

వస్తువులు ఎక్కువగా ఉండే ట్రాఫిక్ స్థలాలు

వస్తువులు ఎక్కువగా ఉండే ట్రాఫిక్ స్థలాలు

మీ ఇంట్లో వస్తువులన్నీ కుప్పగా ఉండే ట్రాఫిక్ ఏరియాలను ప్రతిరోజూ కనిపెట్టి రెగ్యులర్ గా శుభ్రపర్చండి. దానివల్ల మురికిని, దుమ్మును ఇంటి మొత్తానికి పాకకుండా చేయవచ్చు. ఇంటి వాకిలి దగ్గర ఉంచే షూ ర్యాక్ కూడా శుభ్రపర్చటం చాలా ముఖ్యం.

వరుసగా శుభ్రం చేస్తూ పోవటం

వరుసగా శుభ్రం చేస్తూ పోవటం

మీకేదన్నా సరిగా సర్దిలేదు,దాని స్థానంలో లేదు అన్పిస్తే, మళ్ళీ చేద్దాంలే అని వదిలేయకండి. అప్పటికప్పుడు చేయటం వల్ల సమయం ఆదా అవటమే కాదు, తర్వాత రోజు మీ పని భారం కూడా తగ్గుతుంది.

మీ ఇంటిని శుభ్రంగా, నీటుగా ఉంచుకోడానికి మరియు పరిశుభ్రత అలవాట్లు చాలా ముఖ్యం.

English summary

Ten simple habits to keep house clean and neat all the time

It is true that it is not at all easy to keep up with the daily activities of housekeeping, but it also does not mean that all your time will be occupied. It is not only important to keep your home clean, but you should also see to the fact that it does not take up all your time. You should create good habits and make sure that the habits are followed by you and all the other members of the house.