Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
వంటల్లో కాకుండా చక్కెరతో ఈ 11 ఉపయోగాలు తెలుసా!
పరిశుభ్రమైన చర్మం, చక్కగా పనిచేసే హృదయం, స్థూలకాయం పెరగకుండా ఉండేందుకు అందరూ సాధ్యమైనంతగా శుద్ధి చేసిన చక్కెర వినియోగం తగ్గిస్తున్నారన్నది వాస్తవం. కాకపోతే అంతకుముందు పంచదారతో తయారుచేసిన తీపి వంటకాలను మీరెన్నో సార్లు రుచిచూసి ఉంటారు. అప్పుడప్పుడూ మిఠాయిలు తింటే బాగుండునని అనిపిస్తుంది. అయితే చక్కెరను వంటల కోసమే కాకుండా సృజనాత్మకంగా ఇలానూ ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా!

సొంతంగా స్ర్కబ్
ప్రస్తుతం చక్కెరతో తయారుచేసిన స్ర్కబ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పంచదార ఎక్సోలియేటర్‌గా స్పందిస్తుంది. అంటే చర్మంపై మృతకణాలను తొలగించే పొరగా ఉపయోగపడుతుంది. ఈ స్ర్కబ్ వినియోగించడం ద్వారా లోషన్లు, క్రీములు చర్మానికి బాగా పట్టి మృదుత్వాన్ని ఇస్తుంది. ఐతే చక్కెర స్ర్కబ్ సొంతంగా తయారు చేసుకోవడం అంత సులభమేమీ కాదు. ఒక పాలు కొబ్బరి నూనె తీసుకుంటే రెండు పాళ్లు పంచదార తీసుకొని కలుపుకోవాలి. అప్పుడే స్ర్కబ్ తయారవుతుంది.

పెదాలకు రుద్దుకోవడానికి
పైన చెప్పిన చక్కెర స్ర్కబ్ పొడి బారిన పెదాల కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే చాలా గట్టిగా రుద్దకూడాదని నిపుణుల సలహా. పెదిమలు పొలుపు బారగానే లిప్‌బామ్ రుద్దినట్టు చాలా మృదువగా రుద్దుకోవాలి.

మోచేతులపై
చర్మంపై అన్ని చోట్లా మృతకణాలను సులభంగా తొలగించలేం. ముఖ్యంగా మోకాళ్లు, మోచేతులపై. దీనికోసం సగం కోసిన నిమ్మపై చక్కెరను చల్లుకొని రుద్దుకుంటే చాలు. నల్లగా ఉన్న చర్మం మెరుపు సంతరించుకుంటుంది.

గ్రీస్ పోయేందుకు
మనం వంటగదిలో, గ్యారేజ్‌లో, తోటలో పనిచేస్తే చేతులకు గ్రీస్ అంటుకోవడం సహజమే. అలాంటప్పుడు దాన్ని శుభ్రం చేసుకునేందుకు ద్రవరూపంలో ఉన్న సబ్బులో చక్కెర చల్లాలి. ఆ మిశ్రమం ఎలాంటి గ్రీస్ మరకలనైనా వదిలిస్తుంది.

పువ్వులకు ఆహారం
మనలాగే చెట్లూ గ్లూకోజ్‌ను చాలా ఇష్టపడతాయి! అందుకే ప్లాంట్‌ఫుడ్స్‌లో చక్కెరకు ముఖ్యమైన పదార్థం. వీటిని బోకేల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇంట్లో ఉన్న మొక్కలకు ఆహారం అందించాలంటే కాస్త చెక్కరను నీటిలో కలిపి పోస్తే చాలు. ఆ మిశ్రమంలో కాస్తంత వెనిగర్ కలిపితే చీమలు, పురుగులు, కీటకాలు పట్టకుండా ఉంటాయి.

నాలికపై మంట ఆపేందుకు
ఇష్టంతో కారం కారంగా ఏదో ఒకటి మీరు తిన్నారనుకోండి నాలికపై మంటతో విలవిల్లాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరేం చేస్తారు. వెంటనే పాలు తాగుతారు. మంట తగ్గడానికి చక్కెర కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా! నాలికపై కాస్తంత చక్కెర వేసుకుంటే తొందరగా కారం తగ్గి మంట పోతుంది.

లిప్‌స్టిప్ పోయేందుకు
కొన్నిసార్లు బాగా కడిగినా లిప్‌స్టిక్ మరకలు పోవు. అక్కడక్కడా తెరపలు తెరపలుగా ఉంటాయి. వీటిని పోగొట్టేందుకు పొడి గ్లాస్‌పై పంచదార వేసి రుద్దితే చాలు, లిప్‌స్టిక్ మరకలు పోతాయి.

మండించేందుకు
బొగ్గులతో మీరు నిప్పులు రాజేయాలనుకోండి ఏం చేస్తారు? కాస్త కిరోసినో లేదా మంట పుట్టించే ద్రావణమో పోస్తారు. అలా కాకుండా బొగ్గులపై చక్కెరను చల్లితే మంట రాజుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేస్తే మీ వంటకాలకు పొగచూరిన వాసన రాదని అంటున్నారు.

కాఫీ గ్రైండర్ శుభ్రం చేసేందుకు
పావు కప్పు పంచదారను మీ కాఫీ గ్రైండర్‌లో పోయండి. ఒక గుడ్డ లేదా చేతితో చుట్టుపక్కల రుద్దంది. ఆ తర్వాత మొత్తం చక్కెరను గ్రైండర్ నుంచి పారబోయండి. మరోసారి ఇలాగే చేయండి. మీ గ్రైండర్ శుభ్రమై ఉంటుంది చూడండి మరి!



Click it and Unblock the Notifications
