Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
చీమలను తరిమేయడానికి అయిదు సులువైన మరియు చవకైన మార్గాలు
చూడటానికి చిన్నగా కనిపించినా మన దైనందిన జీవితంలో చిన్న చిన్న పనులు చేసుకోవటానికి కూడా ఇబ్బంది కలిగించే జీవులు చీమలు. ఇవి మన వంటగదిలో తిరుగుతూ తెగ చికాకు పెడతాయి. చీమలు ఇంటి పునాదులను దెబ్బతీసిన సందర్భాలను కూడా మనం చూడొచ్చు. వందల కొద్ది చీమలు సైన్యంగా మనకు ఇష్టమైన ఆహార పదార్ధాలపై దండెత్తి రావడం మనకు తెలిసినదే!ఒక్క రాణి చీమ కొన్ని లక్షల చీమలకు జన్మనిస్తుందన్న విషయం మీకు తెలుసా? వినడానికే మీకు గగుర్పాటుగా ఉందా? కొన్ని సులువైన చిట్కాలతో చీమలను మన ఇంటికి దూరంగా నెట్టేయవచ్చు.
చీమలను చంపటమనేది గొప్ప అలోచన కాదు కాని అవి కావలసినప్పుడల్లా మన ఇంటిలొ షికార్లు కొట్టకుండా మన ఇంట్లో రోజు వాడుకునే చవకైన వస్తువులతో నివారించవచ్చు. అవి ఎమిటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా!ఐతే ఇంకెందుకు ఆలస్యం? చదివేయండి!

వెనిగర్:
వంటింట్లో మనం సాధారణంగా ఉపయోగించే వెనిగర్ ను నీటిని సమానంగా కలుపుకుని చీమలు ఎక్కువగా తిరుగాడే వంట గది గట్టు, అల్మరాలను శుభ్రం చేయండి. ఇలా ఒకేరోజు నాలుగైదు సార్లు చేసి మంచి ఫలితం పొందండి. చీమలు వెనిగర్ వాసనను ఇష్టపడవు. అంతేకాక వెనిగర్ చీమలు ఏర్పాటు చేసుకునే సువాసన బాటలను తుడిచివేస్తాయి.

బొరాక్స్:
బొరాక్స్ మరియు పంచదార మిశ్రమాన్ని చీమలు ఎక్కువగా తిరుగాడే చోట్లలో పెట్టండి. బొరాక్స్ చీమల జీర్ణ వ్యవస్థ మరియు బాహ్య కవచాన్ని దెబ్బతీస్తుంది. బొరాక్స్ విషపూరితమైనది కవటం వలన చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ చిట్కాని పాటించేటప్పుడు తగు జగ్రత్తలు తీసుకోవాలి.

నిమ్మ జాతి పండ్ల తొక్కలు:
చీమలు ఎక్కువగా ఉన్న చొట్లలో నిమ్మ మరియు నారింజ తొక్కలను ఉంచండి. ఈ పండ్ల తొక్కలలో ఉండే రసాయనాలు చీమలకు ఆహారంగా ఉపయోగపడే శిలీంధ్రాలను నాశనం చేస్తాయి. కనుక చీమలు వెంటనే ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోతాయి.

పిండి:
చీమలు పిండి ఉండే ప్రదేశంలో సంచరించవు కనుక వంటగదిలో ఉండే అల్మరాలలో మరియు చీమలు ప్రవేశించే చోట్లలో పిండిని వెదచల్లండి.

ఉప్పు:
ద్వారాలు మరియు చీమలు మన ఇంట్లోకి ప్రవేశించే చోట్లలో ఉప్పును చల్లండి. ఉప్పును దాటి చీమలు మన ఇంటి లోనికి ప్రవేశించవు.



Click it and Unblock the Notifications
