For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ ఇంట్లోని 7 డర్టీ థింగ్స్ ఇవే

  |

  మీరు బాత్రూంని ఉపయోగించిన ప్రతీసారి చేతులను శుభ్రపరచుకుంటారు కదూ? అప్పుడు మీ చేతులు శుభ్రంగా ఉంటాయని మీ నమ్మకం. అయితే, మీ అభిప్రాయం తప్పు. ఇంట్లోని వివిధ ప్రదేశాలలో క్రిములనేవి తమ నివాసాన్ని ఏర్పరచుకుని ఉన్నాయి. కంటికి కనబడవు కాబట్టి ఆయా ప్రదేశాలు శుభ్రంగా ఉన్నాయని భావిస్తాము. అందుకే, ఆయా వస్తువులను ఉపయోగించిన తరువాత మీరు చేతులను శుభ్రపరచుకోవాలని అనుకోరు. మీరు ప్రతి రోజూ ముట్టుకునే ఈ ఏడు డర్టీ స్పాట్స్ గురించి తెలుసుకోండి. తద్వారా, మరింత జాగ్రత్తగా ఉండండి.

  టూత్ బ్రష్ హోల్డర్:

  టూత్ బ్రష్ హోల్డర్:

  ఈ రూల్ అందరికీ తెలుసు. కాని అందరూ పాటించరు. టాయిలెట్ కి దగ్గరగా ఉన్నప్పుడు టూత్ బ్రష్ ని కప్పి ఉంచాలి. అలాగే, టూత్ బ్రష్ హోల్డర్ సంగతేంటి? టూత్ బ్రష్ హోల్డర్ కాస్త అస్తవ్యస్తంగా కనిపించిన ప్రతీసారి దానిని శుభ్రపరుస్తూ ఉండండి. చూడ్డానికి చిన్నగా ఉన్నా టూత్ బ్రష్ హోల్డర్ అనేది క్రిములకు నివాసంగా మారుతుంది. కాబట్టి, దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా మీరు అనారోగ్యాన్ని దూరంగా ఉంచుతున్నారు. శ్టఫ్, మోల్డ్ మరియు ఈస్ట్ వంటి క్రిములు టూత్ బ్రష్ హోల్డర్ లో బసచేస్తాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకమీదటైనా టూత్ బ్రష్ హోల్డర్ ని శుభ్రపరుచుకోండి.

  అదృష్టవశాత్తూ, దీనిని ఫిక్స్ చేయడం ఎంతో సులభం. వేడినీటిని అలాగే సబ్బునీటిని ఉపయోగించి వారానికి రెండుసార్లు దీనిని శుభ్రపరచాలి. తద్వారా, క్రిముల సంఖ్యను తగ్గించుకోవచ్చు.

  బాత్ మ్యాట్:

  బాత్ మ్యాట్:

  తడి నేలపై పడివుండే బాత్ మ్యాట్ అనేక క్రిములను ఆకర్షిస్తుంది. త్వరగా ఆరదు కాబట్టి తేమ వాతావరణంలో క్రిములు త్వరత్వరగా వృద్ధి చెందుతాయి. అందువలన, బాత్ మ్యాట్ శుభ్రత విషయంపై మీరు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.

  బాత్ మ్యాట్ ని శుభ్రపరిచే సులభమైన పద్దతిని ఇప్పుడు తెలుసుకుందాం. ఉపయోగించిన తరువాత బాత్ మ్యాట్ ని షవర్ రాడ్ పై ఆరేయండి. దానిని పూర్తిగా ఆరనివ్వండి. మ్యాట్ పై బేకింగ్ సోడాను చల్లి ముప్పై నిమిషాల తరువాత అదనపు పౌడర్ ని తొలగించండి.

  కిచెన్ సింక్:

  కిచెన్ సింక్:

  కిచెన్ సింక్ అనేది హానికర బాక్టీరియాకి నివాసమన్న విషయం మీకు తెలుసా? టాయిలెట్ పైకంటే కిచెన్ సింక్ లోనే ఎక్కువ బాక్టీరియా నివాసముంటుంది. రా చికెన్ ని కడిగి సింక్ లో పడిన డర్ట్ ని తీసి చెత్త డబ్బాలో వేస్తారు. ఆ తరువాత సింక్ లో వాడిన పాత్రలను వేస్తారు. తరవాతెప్పుడో కడుగుతారు. అందువలన, క్రిములు ఇందులో విస్తృతంగా వ్యాప్తి చెందుతాయి.

  గార్బేజ్ డిస్పోజల్:

  గార్బేజ్ డిస్పోజల్:

  గార్బేజ్ డిస్పోజల్ అనేది ఎక్కువగా ట్రబుల్ ను కలిగించే స్పాట్, రబ్బర్ స్టాపర్ అనేది బాక్టీరియాని వృద్ధిచేసి దానికి తగిలే ప్రతి దానిని కంటమినేట్ చేస్తుంది. మీ వంట పాత్రలని, వంటలని అలాగే మిమ్మల్ని కూడా.

  సబ్బు అలాగే నీటిని ఉపయోగించి స్టాపర్ ని శుభ్రంచేయడంతో మీ పని అయిపోలేదు. నిమ్మరసంలో వైట్ డిస్టిల్డ్ వినేగార్ ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయాలి. వారానికి ఒకసారి, ఒక పాత టూత్ బ్రష్ ను ఈ మిశ్రమంలో ముంచి స్టాపర్ పై రుద్దాలి. ఆ తరువాత శుభ్రంగా కడగాలి.

  నిమ్మ తొక్కలను పైకి మడిచి డిస్పోజల్ కింద ఉంచి రన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా నిమ్మ తొక్కలనుంచి వచ్చే ఆయిల్ అనేది బ్లేడ్స్ ని శుభ్రపరుస్తుంది. ఓపెన్ చేయగానే తాజా నిమ్మ వాసన మీకు ఆహ్లాదాన్నిస్తుంది.

  వెల్కమ్ మ్యాట్:

  వెల్కమ్ మ్యాట్:

  మీ షూస్ శుభ్రంగా కనిపించవచ్చు. అయితే, వాటిలో బోలెడంత చెత్త పేరుకొని ఉంటుంది. ప్రతిసారి ఆ చెత్తంతా వెల్కమ్ మ్యాట్ పైకి చేరుతుంది. మీరు బయటికెళ్లి వచ్చిన ప్రతిసారి బోలెడంత చెత్తని ఇంటికి తీసుకువస్తున్నారన్నమాట. అందువలన, వెల్కమ్ మ్యాట్ ని కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి. షూస్ ని ఇంటిబయటే ఉంచాలి.

  సెల్ ఫోన్:

  సెల్ ఫోన్:

  ఒక్కసారి మీ సెల్ ఫోన్ జీవితం గురించి ఆలోచించండి. మీ పర్స్ ని తాకుతుంది. శుభ్రంగా లేని మీ చేతులను తాకుతుంది. చివరికి, మీరు టాయిలెట్ లో కూడా సెల్ ఫోన్ ని ఉపయోగిస్తారు. తెలియకుండా పడేస్తే నేలపై పడుతుంది. మళ్ళీ మీరు ఆ ఫోన్ నే ఉపయోగిస్తారు. అందువలన, శ్టఫ్ మరియు సాల్మొనెల్లా వంటి బాక్టీరియా సెల్ ఫోన్ లో చేరుతుంది. కొత్తగా లభిస్తున్న ప్రొటెక్టీవ్ కేసెస్ లోనున్న చిన్న చిన్న క్రాక్స్ అనేవి క్రిములు విస్తరించడానికి కేంద్రంగా మారతాయి.

  పెట్ టాయ్స్:

  పెట్ టాయ్స్:

  మీకు మీ పెంపుడు జంతువంటే ఇష్టం. దానికి కొన్ని టాయ్స్ ని కూడా కొన్నారు. అయితే, ఆ టాయ్స్ తో ఇల్లంతా నిండిపోయింది. ఆ టాయ్స్ ను శుభ్రపరిచే బాధ్యత కూడా మీదే. ఆ టాయ్స్ పై పేరుకుపోయిన దుమ్ము ధూళి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి, వీటిని కూడా శుభ్రపరుచుకోండి.

  English summary

  7 Dirtiest Things In Your House

  So you wash your hands every time you use the bathroom, which must mean you're clean, right? Not so much. There are several items in your home that harbor some serious germs, but since they don't seem particularly gross, you might not think to wash up after encountering them. Check out these seven dirtiest items you're touching every day
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more