కొబ్బరి నూనె వల్ల కలిగే ఈ 7 ఉపయోగాలు గురించి ఇంతకముందు మీరు ఎప్పుడు విని ఉండరు :

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

కొబ్బరి నూనె నుండి ఒక తియ్యటి వాసన సాధారణంగా వస్తుంది. ఈ నూనెను కేవలం మర్దన కోసమో మరియు వంటలకు మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన ఉపయోగాలెన్నో కొబ్బరి నూనె వల్ల ఉన్నాయి. ఈ క్రింద స్లయిడ్ షో ని క్లిక్ చేసి సాధారణంగా కొబ్బరి నూనెను ఎలా వాడుతారో తెలుసుకోండి.

మృదువైన పాదాలు :

మృదువైన పాదాలు :

సాధారణంగా మీరు పెంచుకొనే కుక్క మీకంటే ఎక్కువగా ఎగురుతుంది మరియు మీ కంటే ఎక్కువగా పరిగెడుతుంది. కానీ, వాటి యొక్క పాదాలు చాలా సమయంలో అలా తిరగటడం వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. వాటికి పగుళ్లు ఏర్పడవచ్చు మరియు ఇలాంటి సందర్భాల్లో కొబ్బరి నూనె ను రాయడం వల్ల అది నయం అవుతుంది. కొబ్బరి నూనె లో ఎన్నో ఔషధ గుణాలు దానికి ఉన్నాయి. మీరు మీ కుక్కకు రాసేటప్పుడు కాస్త చూసుకొని మృదువుగా రాయండి. కొబ్బరి నూనె వాసన చాలా బాగుంటుంది, అందుచేత మీ కుక్క దానిని నాకేయగలదు జాగ్రత్త.

ఇనుము లోహం :

ఇనుము లోహం :

సాధారణంగా మీ పెద్దవాళ్ళు ఇనుముకి పట్టిన తుప్పు వదిలించి పంది కొవ్వు లేదా బాతు కొవ్వుని ఉపయోగించి మీకు ఇష్టమైన వస్తువు ఎలా తయారుచేసుకోవాలి అనే విషయం మీకు నేర్పించి ఉండవచ్చు. కానీ, ఈ జంతు కొవ్వులు బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడటం మంచిదే. ఎందుకంటే, విపరీతమైన ఉష్ణోగ్రతలను కూడా ఇది తట్టుకొని నిలవగలదు మరియు జిడ్డు చాలా తక్కువగా ఉంటుంది.

బట్టలు ఉతుక్కోవడానికి :

బట్టలు ఉతుక్కోవడానికి :

మీరు ఒక స్పూన్ కొబ్బరి నూనె ను తీసుకొని మీ బట్టల పై వేయమని ఎవ్వరు సూచించరు. అలా ఎవ్వరైనా చెప్పినా మీరు చేయకండి. కానీ, ఆ నూనెను ఉపయోగించి ఇంటి వద్దే బట్టలు ఉతికే సబ్బు తయారుచేయవచ్చు. కొబ్బరి నూనె ఇందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో సమతుల్యతతో కూడిన గుణాలు ఉన్నాయి మరియు నురగ వచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

తెగిన గాయాలను మాన్పివేస్తుంది :

తెగిన గాయాలను మాన్పివేస్తుంది :

కొబ్బరి నూనె లో యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. తెగిన గాయాలను త్వరగా మాన్పివేయడానికి ఎంతగానో కొబ్బరి నూనె సహాయపడుతుంది. సాధారణంగా చాలామంది ప్రజలు మందుల షాప్ లో దొరికే వాటికంటే కూడా దీనిని ఉపయోగించడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. దెబ్బ తగిలిన ప్రాంతంలో ఈ నూనెను రాసి, ఆ తర్వాత బ్యాండేజ్ కట్టండి.

చలిమంట మొదలుపెట్టడానికి :

చలిమంట మొదలుపెట్టడానికి :

మీరు ఈ పద్దతిని ఇంతక ముందు అగ్గి రాజేయడానికి లేదా చలిమంట పెట్టడానికి ప్రయత్నించి ఉండవచ్చు. కానీ, అంతకు మించిన సులభమైన ఒక చిట్కా మీరు ఇప్పుడు ఒకటి తెలుసుకోబోతున్నారు. మంటలను విపరీతంగా పెంచాలని భావించినట్లైతే దూదిని కొబ్బరి నూనెలో ముంచి ఆ తర్వాత దానిని మండుతున్న ఆ మంటలో వేయండి, అప్పుడు ఆ మంటలు విపరీతంగా పెరుగుతాయి.

కత్తిరించడానికి వాడే చెక్కపలకను భద్రపరచడానికి :

కత్తిరించడానికి వాడే చెక్కపలకను భద్రపరచడానికి :

సాధారణంగా ఇళ్లల్లో కత్తిరించే చెక్కపలకలు ఉంటాయి. వీటిని భద్రపరచడానికి కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిని శుభ్రం చేయడానికి మరియు ఆ పాత చెక్కపలకలను భద్రపరచడానికి కొబ్బరి నూనెలో విశేషమైన గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా, కొంతమంది వ్యక్తులు ఈ పలకలకు క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను పూతగా పూస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల, ఆ పలకలు నీటికి మరియు క్రిమికీటకాలను తట్టుకొనే శక్తిని పొందుతాయి.

కుక్కకు కూడా పూతగా పూయవచ్చు :

కుక్కకు కూడా పూతగా పూయవచ్చు :

చాలామంది కొబ్బరినూనెను తమ వెంట్రుకలకు రాసుకుంటూ ఉంటారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ, ఈ ఉపయోగాలన్నింటిని మీ వరకే పెట్టుకోకండి. మీ కుక్కకు స్నానం చేయించిన తర్వాత, దాని శరీరం పై కూడా కొబ్బరి నూనె రాయండి. ఇలా చేయడం వల్ల దాని చర్మం మృదువుగా తయారవుతుంది మరియు మెరిసిపోతుంది. ఈ నూనె పొడిబారిన చర్మాన్ని యదా స్థితికి తేవడానికి, గాయాలు మాన్పించడానికి మరియు కుక్కల దగ్గర నుండి వచ్చే వాసనను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

English summary

7 Ways To Use Coconut Oil That You've Never Heard Of

7 Ways To Use Coconut Oil That You've Never Heard Of,The sweet-smelling oil has so many other uses—beyond moisturizing and sautéeing your garden veggies.