ఫ్రిడ్జ్ వల్ల కలిగే ఏడు రకాల అనారోగ్యాల గురించి మీకు తెలుసా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

వినడానికి చాలా వెర్రిగా ఉన్నా కూడా మీరు వాడే ఫ్రిడ్జ్ యొక్క ప్రధమ కర్తవ్యం, అందులో పెట్టిన వైన్ ని చల్ల బరచడం కాదు. అసలు నిజం ఏమిటంటే, ఫ్రిడ్జ్ యొక్క ప్రధాన విధి సాల్మొనెల్లా, ఈ కోలి మరియు బోటులోనుం వంటి సూక్ష్మ క్రిములు ఆహారం పై పెరగకుండా చూడటం.

ఫ్రిడ్జ్ లో సరైన పద్దతిలో ఆహారాన్ని పెట్టకపోతే ఆహారం విషతుల్యం అయిపోయే ప్రేమదం ఉంది. కాబట్టి మీకు ఫ్రిడ్జ్ చేసే పని ఏమిటి అనే విషయం మీకు అర్ధం అయ్యే ఉంటుంది. ఇక చాలామంది సాధారణంగా చేసే ఏడు తప్పుల గురించి మనం తెలుసుకోబోతున్నాం.

1. పచ్చి మాంసాన్ని బయటపెట్టడం :

1. పచ్చి మాంసాన్ని బయటపెట్టడం :

ఈ సారి మీరు ఎప్పుడైతే పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జిలో పెట్టాలనుకుంటారో, అటువంటి సమయంలో ఫ్రిడ్జ్ లోని పైన అరలో అస్సలు పెట్టకండి. మాంసంలో ఉండే ద్రవాలు కొన్ని సందర్భాల్లో క్రింద ఉన్న ఆహారాల్లో పడి వాటిని విషతుల్యం చేసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా క్రింద అరలతో పోల్చినప్పుడు, పైన అరలు వెచ్చగా ఉంటాయట. పచ్చి మాంసాన్ని ఒక ప్లాస్టిక్ బాగ్ లో గాని లేదా గిన్నె లేదా పెనంలో పెట్టి ఫ్రిడ్జిలో భద్రపరచండి.

2. ఫ్రిడ్జ్ ని మరీ విపరీతంగా నింపేయకండి :

2. ఫ్రిడ్జ్ ని మరీ విపరీతంగా నింపేయకండి :

ఫ్రిడ్జ్ ని పూర్తిగా నింపేయడం ద్వారా ఫ్రిడ్జ్ పై కూడా విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. సూక్ష్మజీవుల శాస్త్ర నిపుణుల ప్రకారం ఇలా గనుక మీ ఫ్రిడ్జ్ ఉన్నట్లయితే, అతిసార వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకు కారణం, చల్ల గాలి అనేది ఫ్రిడ్జ్ అంతా వ్యాపంచి ఆహారాన్ని చల్లగా ఉంచడం వల్ల సూక్ష్మ క్రిములు పెరగకుండా ఉంటాయి. కానీ, ఎప్పుడు అయితే ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోయి ఉంటుందో ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు. అంతేకాకుండా ఇంత నిండుగా ఉన్న ఫ్రిడ్జ్ లో ఏది తాజాది, ఏవి పాతవి అని కనుక్కోవడం కూడా కష్టం అవుతుంది. అటువంటి సందర్భంలో మనకి తెలియకుండానే చాలా ఆహారపు వస్తువులు పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రిడ్జ్ లో మోతాదుకు మించి వస్తువులు పెట్టకండి.

3. ఉష్ణోగ్రతలను ప్రమాద మండలంలో పెట్టకండి :

3. ఉష్ణోగ్రతలను ప్రమాద మండలంలో పెట్టకండి :

చివరిసారిగా మీరు ఎప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఉన్న ఉష్ణోగ్రతలను పరిశీలించారు ? అసలు థెర్మామీటర్ ఎక్కడ ఉంది అనే విషయం మీకు తెలుసా ? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం " నాకు తెలియదు " అయినట్లయితే, అటువంటి సమయంలో ఫ్రిడ్జిలో మీరు పెట్టిన ఆహారం సూక్ష్మ క్రిముల బారినపడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత గనుక 40 F పైన ఉంటే, ఆ సమయంలో సూక్ష్మ క్రిములు తెగపడతాయి. అందుచేత ఎప్పుడు కానీ ఉష్ణోగ్రతలను 32 F నుండి 40 F మధ్యే ఉంచాలి. అంతేకాకుండా ఫ్రీజర్ యొక్క ఉష్ణోగ్రతను సున్నా కంటే తక్కువగానే ఉంచాలి. మీ ఫ్రిడ్జ్ గనుక పాతరకం అయితే, అందులో గనుక థెర్మోమీటర్ లేకపోతే, అటువంటి సమయంలో మీరు ఒక థెర్మోమీటర్ ని కొనుక్కొని ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రతలను తనిఖీ చేస్తుండాలి. ఎప్పుడు గాని ఫ్రిడ్జ్ తలపులు తెరిచి ఉంచి, ఏమి తినాలి అనే విషయం అక్కడ నుంచొని ఆలోచించకండి. ఆలా చేయడం వల్ల ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో, ఫ్రిడ్జ్ లోపల కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అందువల్ల ఆహారం పాడవుతుంది.

4. కూరగాయలను, పండ్లను ఒకే దాంట్లో పెట్టి ఉంచడం :

4. కూరగాయలను, పండ్లను ఒకే దాంట్లో పెట్టి ఉంచడం :

ఎప్పటికీ సూక్ష్మ క్రిములు పెరగకుండా ఉండేలా చేయడం అనేది చాలా కష్టమైనా పని. కానీ, చాలా సమయం పాటు సూక్ష్మ క్రిములను దూరంగా ఉంచవచ్చు. మొదట, మీరు పండ్లను మరియు కూరగాయలను వాడాలి అని అనుకొనే ముందు వరకు నీటితో అస్సలు కడగకండి. ఎందుకంటే సూక్ష్మ క్రిములు తేమను విపరీతంగా ఇష్టపడతాయి. రెండవది, ఎప్పుడుగాని పండ్లు మరియు కూరగాయలను ఒకటే అరలో ఉంచకండి. పండ్లు ఎథిలీన్ అనే వాయువుని విడుదల చేస్తాయి. ఈ వాయువు కూరగాయలను చెడిపోయేలా చేస్తుంది.

5. గుడ్లను ఫ్రిడ్జ్ డోర్ లో ఉంచడం :

5. గుడ్లను ఫ్రిడ్జ్ డోర్ లో ఉంచడం :

చాలామంది తీసుకోవడానికి లేదా వాడుకోవడానికి అనువుగా ఉంటుంది అనే ఉదేశ్యం తో వినియోగదారులు గుడ్లను ఫ్రిడ్జ్ డోర్ లో పెడుతుంటారు. కానీ, నిపుణులు మాత్రం ఆ స్థలం ఒక దరిద్రమైన స్థలం అని, అక్కడ పెట్టడం అస్సలు మంచి పద్దతి కానే కాదు అని చెబుతున్నారు. ఎందుచేతనంటే ఆ ప్రదేశం ఎక్కువ వెచ్చగా ఉంటుందట. దీనికి బదులుగా గుడ్లను ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జిలోనే అరల్లో బాగా చల్లగా ఉండే వెనుక భాగాల్లో పెట్టుకోవడం చాలా మంచిది అని సూచిస్తున్నారు.

6. మిగిలిన పాలని మళ్ళీ అసలు పాత్రలోకి వేసేయడం :

6. మిగిలిన పాలని మళ్ళీ అసలు పాత్రలోకి వేసేయడం :

కొంతమంది వాళ్ళ పిల్లలు మిగిల్చిన పాలని తిరిగి పాలు ఉన్న అసలు పాత్రలోకి వేసేస్తుంటారు. ఇది వినడానికి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ, ఇలా కొంతమంది చేస్తారు. ఆ మిగిలిపోయిన పాలల్లో ఏమి ఉంది అనే విషయం ఆ దేవుడికే తెలియాలి. అయితే ఎప్పుడైతే ఆ మిగిలిపోయిన పాలని అసలు పాత్రలో ఉన్న పాలతో కలుపుతారో ఆ సమయంలో పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది లేదా విషపూరితం కూడా అవొచ్చు. అందుచేత ఇలా చేయడం మానేయండి లేదా పాలు తీసుకొనేటప్పుడే కొద్ది మోతాదులో తీసుకోండి. పాలు మరియు పాల ఉత్పత్తులను ఎప్పుడు గాని, అరల్లో వెనుక భాగంలో ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టడం మంచిది. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఆ పాలు ఉన్న పాత్రని అలానే నోటితో తీసుకోకుండా అరికట్టవచ్చు. ఈ అలవాటు చాలా దుష్టమైనది మరియు అనారోగ్యకరమైనది. ఇలా చేయడం వల్ల వారి నోట్లో ఉండే క్రిములు మిగతావారికి పాకిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ వ్యక్తికి గనుక జలుబు లేదా దగ్గు ఉన్నట్లయితే అవి మిగతా అందరికీ కూడా రావొచ్చు.

7. సంవత్సరానికి ఒక్కసారైనా సరే మీ ఫ్రిడ్జ్ ని శుభ్రపరచండి :

7. సంవత్సరానికి ఒక్కసారైనా సరే మీ ఫ్రిడ్జ్ ని శుభ్రపరచండి :

ఫ్రిడ్జిలో ఉన్న ఐస్ డబ్బాని ప్రతి వారాంతం అని కడగాలి ఎవ్వరు ఖచ్చితంగా నియమం పెట్టుకోరు. కానీ, అలా పూర్తిగా వదిలేయటం కూడా ప్రమాదకరమే. సూక్ష్మ క్రిములు కారుతున్న జామ్ డబ్బాల పైన మరియు కెచప్ లపైన, కారిన పులుసు వలన, మనం వాడిన మాంసం వల్ల మరియు చెడిపోయిన వాటి నుండి వెలువడే కొన్ని వ్యర్ధాల వలన సూక్ష్మ జీవులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. అందుచేత వారానికి ఒకసారి ముఖ్యంగా క్రిస్పెర్ లను మరియు మీరు మాంసాన్ని పెట్టే ప్రదేశాన్ని కడగటం మంచిది. వేడి నీరు , సోప్ తో కూడిన మిశ్రమాన్ని లేదా వెనిగర్ మరియు నీరు కలిపిన మిశ్రమాన్ని ఇందుకోసం వాడవచ్చు. బయట ప్రదేశాన్ని కూడా మరచిపోకండి. గ్రిల్ చుట్టూ ఉన్న వాక్యూమ్ మరియు ఫ్రిడ్జ్ ఎంతో మృదువుగా సమర్ధవంతంగా పనిచేయడం కోసం ఒక మోటార్ చుట్టూ ఉన్న దుమ్ముని లాగేస్తూ ఉంటుంది. వీటన్నింటిని ఎప్పటికప్పుడు సరైన పద్దతిలో శుభ్రం చేసుకోవడం మంచిది. ఇవన్నీ మీరు సక్రమంగా పనిచేసినప్పుడే, మీరు ఏదైతే అనుకుంటున్నారో, అదేనండి మీ ఫ్రిడ్జ్ లో పెట్టిన వైన్ ఎంతో చల్లగా ఉంటుంది.

English summary

7 Ways Your Fridge Is Making You Sick

As crazy as it sounds, your refrigerator's primary job is not just to keep your wine chilled. Actually, its chief duty is slowing the growth of bacteria such as salmonella, e-coli, and botulinum in food. Interfere with that and you could turn your guts into a Whirlpool with a case of food poisoning. Got your attention? Good. Avoid these 7 common mistakes: