మీ ఇంట్లో ఎలుకల బెడదను నివారించండిలా

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

చలికాలాలoలో ఇళ్లలోని రంధ్రాలు గల మూలలను తమ అడ్డాలుగా చేసుకుని జీవనం సాగించే ఎలుకలు ఇష్టానుసారంగా మీ వస్తువులని నాశనం చేసే ప్రయత్నాలు చేస్తుంటాయి. కాని మన దేశంలో చాలా ప్రాంతాలలో, కాలానికి సంబంధంలేకుండా ఇళ్ళలో పాతుకుపోయి మనుషులతో సమానంగా జీవనాన్ని కొనసాగిస్తుంటాయి. కాని కొన్ని గృహ చిట్కాల ద్వారా ఈ ఎలుకల ను నివారించవచ్చు.

8 home remedies to get rid of rats

ఎలుకలకు ముఖ్యంగా పెప్పర్మింట్ (పుదీనా) అంటే పడదు. కొన్ని కాటన్ బాల్స్ లో ఈ పెప్పర్మింట్ ఉంచి, ఎలుకలు వచ్చే ప్రాంతాలలో ఉంచడం ద్వారా వాటి రాకను తగ్గించవచ్చు. వారానికి ఒకసారైనా ఈ బంతులని మారుస్తూ ఉండాలి. వీటి కారణంగా ఇంట్లో మంచి సువాసన వచ్చుటయే కాకుండా ఎలుకలు తగ్గుముఖం పడుతాయి.

బంగాళాదుంపల పొడి

బంగాళాదుంపల పొడి

బంగాళాదుంపల పొడిని ఎలుకలు ఉన్న ప్రాంతంలో చల్లండి. ఎలుకలు వాటిని తిన్న తర్వాత, ఈ బంగాళా దుంప రేకులు వాటి పేగుల్లో ఇరుక్కుని చివరికి వాటి ప్రాణాలను తొలగిస్తుంది.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

మనకే కాదు, ఎలుకలు కూడా ఉల్లిపాయల తీవ్రమైన వాసనని తట్టుకోలేవు. కాని ఉల్లిపాయలకి త్వరగా కుళ్లిపోయే స్వభావం ఉన్న కారణంగా ఇంట్లో ఉన్న పెంపుడు జంతువుల పై దాని విష ప్రభావం పడవచ్చు. కావున ప్రతి రెండవరోజూ ఒక ఉల్లిపాయని మార్చడం మంచిది.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కొకోవా మిశ్రమం

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కొకోవా మిశ్రమం

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కొకోవా లేదా చాక్లెట్ మిశ్రమాన్ని ఎలుకలు తరచూ వచ్చే ప్రాంతంలో చల్లండి. అవి తిన్న తర్వాత నీళ్ళకోసం పరిగెత్తుతాయి. సరైన సమయంలో నీరు తాగలేని పక్షంలో అవి చనిపోతాయి కూడా.

మిరియాల పొడి

మిరియాల పొడి

మీ ఇంటి నుండి క్రిమికీటకాలను దూరంగా ఉంచడానికి చాలా చవకైన మార్గం. పెప్పర్ చల్లడం ద్వారా జంతువులనుండి మొక్కలను కాపాడడం అనేది ఒక పురాతనమైన చర్య. ఎలుకలు ప్రవేశిoచే మార్గంలో ఈ పొడిని చల్లడం వలన, వాటి రాక తగ్గుముఖం పడుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

నీటితో, కత్తిరించిన వెల్లుల్లి కలపి ఆ మిశ్రమాన్ని ఎలుకలు వచ్చు మార్గంలో చల్లడం మంచిది. లేదా వెల్లుల్లి రెబ్బలను ఆ మార్గాలలో ఉంచినా ఎలుకల రాక తగ్గుతుంది.

లవంగాలు లేదా లవంగాల నూనె

లవంగాలు లేదా లవంగాల నూనె

ఎలుకలకు లవంగాలు అంటే ఇష్టం ఉండదు. ఎలుకల రంధ్రాల సమీపంలో ఒక వస్త్రంలో గుప్పెడు లవంగాలు ఉంచండి. ఎలుకలు ఈ మార్గం లో రావడానికి ఇష్టపడవు.

అమ్మోనియా

అమ్మోనియా

ఎలుకలు బలమైన వాసనలు ద్వేషిస్తాయి, అదేవిధంగా అమ్మోనియాని కూడా. కావున అవి వచ్చు మార్గాలలో చిన్న గిన్నెలలో అమ్మోనియా ద్రావణాన్ని ఉంచడం ద్వారా వాటి రాకని అడ్డుకోవచ్చు. మీకేమైనా చిట్కాలు తెలిస్తే కామెంట్ బాక్స్ లో ఉంచండి .

English summary

8 home remedies to get rid of rats

8 home remedies to get rid of rats,Who wouldn't love to have those silky smooth long tresses? Lack of protein leads to damaged hair and it will stop the hair from growing. The best natural remedy in order to gain protein and increase hair growth are eggs. Here are some amazing DIY egg conditioners that you can try out