మూసుకుపోయిన డ్రైన్ మరియు టాయిలెట్స్ను శుభ్రం చేసే ఇంటి చిట్కాలు !

Subscribe to Boldsky

మీ టాయిలెట్ చెత్త-చెదారాలతో బాగా మూసుకుపోయిందా ? కొన్నిరకాల ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా మూసుకుపోయిన డ్రైన్ మరియు టాయిలెట్స్ను శుభ్రపరచవచ్చు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనము సాధారణంగా చేసే పని ఏమిటంటే, అలా అడ్డుకు పోయిన చెత్తను గట్టిగా కన్నంలోకి నెట్టడం ద్వారా శుభ్రం చేస్తాము.

ఇలా చెత్తను ఒక పెద్ద పైప్ నుండి బయటికు వెళ్లేలా చేయడానికి మనం రకరకాల సాధనాలను ఉపయోగిస్తాము. ఆ తర్వాత నీటిని పోసి ఆ పైప్ను శుభ్రం చేస్తాము. మీరు ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి బోల్డ్ స్కై కొన్ని సులభమైన చిట్కాలను మీ ముందుకు తీసుకువచ్చింది.

How To Unclog A Toilet | How To Unclog A Drain | Home Remedies To Clean A Clogged Drain

మీరు ఇలా సూచించబడిన చిట్కాలను పాటించటం వల్ల ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. అలా అని మార్కెట్లో దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ మాదిరి వంటివి కాదు. ఈ చిట్కాలను పాటించడం వల్ల మీ డ్రైన్ మరియు టాయిలెట్స్ అనేవి మరకలను అస్సలు కలిగి ఉండవు.

అందుకే ఈ చిట్కాలకు మేము అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాము. అవి మీ టాయిలెట్స్ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా అందంగా కూడా ఉంచుతాయి. వీటితోపాటు మీ సింక్, బౌల్కు మంచి వాసనను కూడా కలగజేస్తాయి.

మీరు ఈ క్రింది వివరించిన చిట్కాలను పాటించటం వల్ల డ్రైన్ మరియు టాయిలెట్స్ను మరింత శుభ్రంగా ఉంచబడతాయి. అలాంటి చిట్కాలు ఏమిటంటే,

1. బేకింగ్ సోడా మరియు ఉప్పు :

1. బేకింగ్ సోడా మరియు ఉప్పు :

ఈ రెండు పదార్థాలను ఒక పాత్రలోకి తీసుకోండి. వీటిని కలుపగా తయారైన మిశ్రమాన్ని సమస్యాత్మకమైన డ్రైన్ మరియు టాయిలెట్స్ లో పోయడం వల్ల, బుడగల రూపంలో తన పనితనాన్ని నెమ్మదిగా ప్రారంభిస్తుంది. మీరు ఈ మిశ్రమాన్ని టాయిలెట్లోకి పోసిన తర్వాత, ఒక స్తూపం వంటి ప్లంగర్ సాధనముతో - అడ్డంగా పేరుకుపోయిన వ్యార్థాన్ని ప్రధాన గొట్టంలోకి వెళ్లేలా గట్టిగా తోయాలి. ఈ చిట్కా అన్నిటికన్నా ఉత్తమంగా పనిచేస్తుంది.

2. ఆక్సీకరించబడిన డ్రింక్స్ :

2. ఆక్సీకరించబడిన డ్రింక్స్ :

డ్రైన్ మరియు టాయిలెట్స్ను శుభ్రపరచడంలో ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. సోడా తో పూర్తిగా నిండిన ఈ డ్రింక్స్ను ఉపయోగించడం వల్ల, చాలా తక్కువ సమయంలోనే టాయిలెట్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రపరిచేలా మ్యాజిక్ను చేయగలదు.

3. డిటర్జెంట్ :

3. డిటర్జెంట్ :

మీ డ్రైన్ మరియు టాయిలెట్స్ శుభ్రంగా తెరచుకొని ఉండకపోతే, వాటిని శుభ్రం చేయడానికి డిటర్జెంట్తో కూడిన నీళ్లను పోయాలి. ఇలా చేయటంవల్ల పొడిగా ఉన్న చెత్తను తడిగా మారుస్తుంది. ఆ తర్వాత ఒక ప్లంగర్ వంటి సాధనంతో చెత్తను లోతుగా తోయడం వల్ల మీ టాయిలెట్స్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

4. హైడ్రోజన్ పెరాక్సైడ్ :

4. హైడ్రోజన్ పెరాక్సైడ్ :

ఒక కప్పులో 1/4 వంతుగా ఈ లిక్విడ్ను తీసుకొని ఉపయోగించడం వల్ల బాగా మూసుకుపోయిన డ్రైన్ మరియు టాయిలెట్స్ను బాగా తెరచి ఉంచుతుంది. అందుకోసం మీరు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ టాయిలెట్లోకి వేసి కొన్ని నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత వేడి నీళ్లను పోసి శుభ్రంగా కడగాలి.

 5. బేకింగ్ సోడా మరియు వెనిగర్ :

5. బేకింగ్ సోడా మరియు వెనిగర్ :

మీ యొక్క జటిలమైన సమస్యను పరిష్కరించేందుకు ఈ 2 పదార్థాలతో కూడిన మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల, మీరు మంచి ఫలితాలను పొందగలరు. అందుకోసం 1/2 కప్పు బేకింగ్ సోడాను మరియు 1/2 కప్పు వెనిగర్ ను కలిపిన మిశ్రమాన్ని మూసుకుపోయిన టాయిలెట్స్ లో పోయాలి.

6. వేడినీళ్ళతో :

6. వేడినీళ్ళతో :

బాగా వేడిగా వున్న బకెట్ నీళ్లను తీసుకొని - మీ సమస్యాత్మకమైన టాయిలెట్స్లో నెమ్మదిగా పోయాలి. ఇలా చేయడంవల్ల టాయిలెట్స్లో పేరుకుపోయిన చెత్త నమ్మదగినదిగా క్లియర్ అవుతుంది.

7. వెనిగర్ మరియు నిమ్మరసం :

7. వెనిగర్ మరియు నిమ్మరసం :

ఈ రెండు పదార్ధాలు కూడా ఆమ్ల సంబంధమైన గుణాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ మిశ్రమాన్ని మీ సమస్యాత్మకమైన డ్రైన్ మరియు టాయిలెట్స్లో శుభ్రం చేయటంలో ఉపయోగించటం వల్ల మంచి ఫలితాలను కలిగిస్తుంది.

8. బీజింగ్ పౌడర్ :

8. బీజింగ్ పౌడర్ :

మీకు మీ టాయిలెట్స్ పరిశుభ్రంగా, అందంగా కనపడాలని అనుకున్నట్లయితే, మీరు ఈ బ్లీచింగ్ పౌడర్ను తప్పక ఉపయోగించండి. ఇది మీ సమస్యకు పూర్తి పరిష్కారాన్ని చూపగలదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How To Unclog A Toilet | How To Unclog A Drain | Home Remedies To Clean A Clogged Drain

    Is your toilet clogged with hair and other sort of dirt? There are some home remedies which you can use to clean your clogged drain and toilet. The only tip to follow when you clean your drain and toilet is to make sure that these ingredients are pushed manually into the holes. A plunger needs to be used to make sure that these ingredients are pushed into the main pipe to clear the way for water to flow through. Today, Boldsky shares with you remedies to clean a clogged drain and toilet.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more