For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ బాత్ రూంలో ఎన్నటికీ ఉంచకూడని 8 వస్తువులు

  |

  బాత్ రూం మీ పొద్దున రొటీన్ పనులన్నిటికీ నిలయం కావచ్చు, కానీ మీకు ఆ సమయంలో అవసరమైనవాటినన్నింటినీ అక్కడి మెడిసిన్ అరలో ఉంచటం నిజానికి హానికర బ్యాక్టీరియా మరియు విషపదార్థాలు సోకేలా చేస్తుంది. మనం రోజువారీ వాడే కొన్ని వస్తువులు బాత్ రూం తడి మరియు వెచ్చని వాతావరణానికి పాడైపోవచ్చు కూడా. ఈ స్లయిడ్ షోను క్లిక్ చేస్తూ ఏవి ఉంచవచ్చో, వేటి చోటును మార్చాలో తెలుసుకోండి.మొదలుపెట్టండి.

  టూత్ బ్రష్ లు

  టూత్ బ్రష్ లు

  వీటిని అందరూ తమ బాత్ రూంలలో పెట్టుకుంటారు. శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే మీరు ఇలా మీ రిస్క్ పైనే పెట్టుకోండి అని చెప్తున్నారు, ముఖ్యంగా మీరు రూమ్మేట్లతో కలిసి నివసిస్తున్నప్పుడు మరీ జాగ్రత్త. క్విన్నిపియాక్ యూనివర్శిటీ వారి అధ్యయనం ప్రకారం పంచుకునే బాత్ రూంలలోని 60శాతం టూత్ బ్రష్ లపై మలం ఉన్నట్లు గుర్తించారు, అది కూడా టూత్ బ్రష్ లు ఎలా దాచారు అన్నది సంబంధం లేకుండా. టాయిలెట్ మూతను మూసి ఫ్లష్ చేసినా కూడా అప్పటికే బయటపడ్డ బ్యాక్టీరియాను ఆపలేరు. టూత్ బ్రష్ కవర్ వాడటం వలన బ్యాక్టీరియా పెరగటానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారీ వాడకానికి మధ్య ఆరటానికి అవకాశం ఉండదు కాబట్టి – అది కూడా మీకు దురదృష్టమే. చాలా విచిత్రంగా అన్పిస్తుంది కానీ మీ బ్రష్ ను ఇంట్లోని వేరే గదిలో ఆరటానికి ఉంచండి.

  గర్భనిరోధక మాత్రలు

  గర్భనిరోధక మాత్రలు

  మారే వేడి మరియు తేమ వలన బాత్ రూంలో మీ గర్భనిరోధక మాత్రలు, జలుబు, జ్వరాలకి వాడే ఇతర మాత్రలైన ఐబ్రూఫెన్, క్యాప్సూల్స్ యొక్క పని సామర్థ్యాన్ని తగ్గుతుంది మరియు ఎక్స్పైరీ డేటుకి ముందే పాడయ్యేలా చేస్తుంది. ఆ స్థలాన్ని బ్యాండ్ ఎయిడ్లకు, టూత్ పేస్టుకి వాడండి.మరియు మీ మందులను చల్లని,పొడి ప్రదేశంలో ఉంచండి- డ్రస్సర్ డ్రాయర్ లేదా స్టవ్, సింక్ మరియు వేడి వస్తువులకి దూరంగా వంటింటి అరలో ఉంచండి.

  అదనపు రేజర్ బ్లేడ్లు

  అదనపు రేజర్ బ్లేడ్లు

  తేమ వాతావరణం మెటల్ బ్లేడ్లను ఆక్సీకరణం అయ్యేలా చేసి, మీరు వాడే ముందే తుప్పు పట్టేలా చేస్తుంది.ఎయిర్ టైట్ ప్యాకేజీలో మూయబడి వుంటే తప్ప, షేవింగ్ వస్తువులు దాచుకోటానికి కొత్త ప్రదేశం వెతకండి.

  మేకప్

  మేకప్

  మేకప్ సామానును బాత్ రూంలో ఉంచుకోవటం సులభంగా ఉండచ్చు కానీ ఎక్కువకాలం మీరు అలా చేసినా ఉండదు. తేమ మరియు వేడి మీకిష్టమైన వారిని (ఈ $15 డాలర్ల లోపల కొనగలిగే ఆర్గానిక్ అంద ఉత్పత్తుల కోసం) ఇక్కడ చదవండి. వీటిని చల్లగా, పొడిగా ఉండే చోట పెట్టండి.

  మేకప్ బ్రష్ లు

  మేకప్ బ్రష్ లు

  బయట ఓపెన్ గా పెట్టిన మేకప్ బ్రష్ లపై కూడా టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు హానికారక క్రిములు చేరతాయి. మీరు డ్రాయర్ లో పెట్టినా కూడా బాత్ రూం తేమ వాతావరణంలో మంచిది కాదు. గాలిలోని తేమ బ్యాక్టీరియా ఎదగటానికి సాయపడి నిజానికి బ్రష్ లమీదే పెరుగుతాయి. వీటిని మీ బెడ్ రూంలో పెట్టుకోండి.

  ఫర్ ఫ్యూమ్

  ఫర్ ఫ్యూమ్

  మీకిష్టమైన వాసన కల సుగంధం మీరు బాత్ రూంలో ఎక్కువకాలం ఉంచితే కంపు కొడుతుంది. ఆవిరి కక్కే షవర్ స్నానాల వలన పెరిగే ఉష్ణోగ్రత వలన మీ ఫెర ఫ్యూం పుల్లగా త్వరగా మారిపోతుంది. వాటిని మీ బెడ్ రూంలో అలమరలోనో, డ్రా లోనో పెట్టుకోండి.- అది కూడా ఎండపడని చోటు మరియు ఉష్ణోగ్రత సమంగా ఉండాలి.

  కండోమ్స్

  కండోమ్స్

  మెడిసిన్ అరలో కండోమ్స్ ను రహస్యంగా దాచటానికి అనువుగా ఉంటుందేమో కానీ, అవి మీ బెడ్ సైడ్ డ్రాలో పెట్టుకుంటేనే అనువుగా ఉంటుంది. వేడి, తేమ ఎక్కువ కాలం తగలటం వలన, వాటి ప్రభావం తగ్గిపోతుంది.

  నగలు

  నగలు

  రేజర్ బ్లేడ్లలాగానే మీకెంతో ఇష్టమైన నగలు కూడా గాలిలో తేమవలన పాడవుతాయి. చవకగా దొరికే గిల్టు నగలు, మెటల్ సీలలైతే తుప్పుపడతాయి మరియు నిజమైన వెండి, ఇంకో గదిలో మూసి వుంచిన నగల పెట్టెలోకన్నా త్వరగా రంగు వెలిసిపోతుంది.

  English summary

  Eight Things You Should Never Ever Keep In Your Bathroom

  The bathroom may be the hub of your morning routine, but keeping all your AM essentials in the medicine cabinet may actually be exposing you to harmful bacteria and toxins. It turns out that a bunch of the items we use on a daily basis may be damaged by a bathroom's warm, wet environment. Click through the slideshow to find out what needs relocating, stat.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more