Just In
Don't Miss
- Sports
Canadian Open: తొలి రౌండ్లోనే సెరెనా ఓటమి.. సానియా జోడీ సంచలనం!
- Movies
Laal Singh Chaddha Day 1 collections: అమీర్ ఖాన్ కెరీర్ లోనే దారుణం.. RRR లో సగం కూడా రాలేదు!
- Automobiles
కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?
- Finance
GST On Rentals: అద్దెపై 18 శాతం GST.. జూలై 18 నుంచి అమలులోకి.. ఎవరికి వర్తిస్తుందంటే..
- News
బందరులో మేరీమాత విగ్రహం ధ్వంసం-ఎస్పీ ఆఫీసు పక్కనే అర్ధరాత్రి ఘటన
- Technology
ఐఫోన్లోని సిరి వాయిస్తో విసుగు చెందారా? అయితే ఇలా మార్చేయండి ....
- Travel
మరో ప్రపంచపు అంచులకు చేర్చే.. కుద్రేముఖ్ పర్వత శిఖరాలు!
స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ మెరుపుకై హోంరెమెడీస్
కిచెన్ లో స్టైన్ లెస్ స్టీల్ అప్ప్లయన్సెస్ అనేవి మన దృష్టిని ఆకర్షిస్తాయి. స్టైన్ లెస్ స్టీల్ అనేది కిచెన్ అందాన్ని మరింత మెరుగ్గా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కళ్ళు మిరుమిట్లు గొరిపే మెరుపుతో అలాగే డ్యూరబుల్ కోటింగ్ తో తయారైన అప్లయన్సెస్ అనేవి క్లాసీ అలాగే ఎలిగంట్ లుక్ తో మెరిసిపోతాయి. అయితే, స్టెయిన్ లెస్ స్టీల్ మెరుపుని అలాగే కంటిన్యూ చేయాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
స్టెయిన్ లెస్ స్టీల్ అంటే ఏంటి?
స్టెయిన్ లెస్ స్టీల్ అనేది ఇనుము యొక్క ధాతువు. అయితే, ఇందులో పది శాతం కంటే ఎక్కువ క్రోమియం లభిస్తుంది. ఆకర్షణీయమైన మెరుపుతో అలాగే సోఫిస్టికేటెడ్ రంగుతో ఇది అప్లయన్సెస్ కై పాపులర్ చెందిన మెటీరియల్ గా స్థానం పొందింది. స్టైన్స్ ని రెసిస్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నా కూడా ఆయిలీ ఫింగర్ ప్రింట్స్ తో దీని మెరుపు కాస్త కళతప్పుతుంది. ఈ స్టెయిన్ లెస్ స్టీల్ ని విపరీతంగా వాడటం ద్వారా ఇది రెగ్యులర్ స్టీల్ గా మారిపోతుంది.
స్టెయిన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ మెయింటెనెన్స్ లో కలిగే సాధారణ సమస్యలు
స్టెయిన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ ని వాడడానికి కొంతమందికి విపరీతమైన భయం పట్టుకుంటుంది. ఇవి మెయింటైన్ చేయడానికి కష్టమైనవి కావడం వలెనే ఈ భయం మొదలవుతుంది. స్క్రాచెస్, మార్క్స్, పేరుకుపోయిన జిడ్డు, ఫుడ్ స్టైన్స్, పూతలు, దుమ్ము వీటన్నిటితో పాటు ఫింగర్ ప్రింట్స్ వలన స్టెయిన్ లెస్ స్టీల్ మెరుపు తగ్గుముఖం పడుతుంది. ఫుడ్స్ లో లభ్యమయ్యే కొన్ని (యాసిడ్ వంటి) పదార్థాలు స్టెయిన్ లెస్ స్టీల్ సర్ఫేస్ కి హానీ కలిగించవచ్చు. ఈ స్టెయిన్ లెస్ స్టీల్ అనేక ఫినిషెస్ లో లభ్యమవుతుంది. మాట్టే, శాటిన్, మిర్రన్, బీడీ బ్లాస్ట్, బ్రష్డ్ లేదా రిఫ్లెక్టివ్ వంటి ఫినిషెస్ లో లభ్యమవుతుంది. అయితే, కొన్ని ఫినిషెస్ అనేవి క్లీనర్స్ కి రెస్పాండ్ కావు.
స్టెయిన్ లెస్ స్టీల్ అప్లయన్స్ హోమ్ రెమెడీస్
మైక్రో వేవ్, రేంజేస్, డిష్ వాషర్స్ మరియు రెఫ్రిజిరేటర్స్ వంటి చాలామటుకు హై ఎండ్ స్టెయిన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ అనేవి ఎక్కువ ధర పలుకుతాయి. అయితే, వీటి మెయింటెనెన్స్ ని సరైన కేర్ అవసరం. ఈ కింద వివరించబడిన హోంరెమెడీస్ ని పాటించడం ద్వారా స్టెయిన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ మెరుపు కొత్తగానే నిలిచి ఉంటుంది. తద్వారా, మీ డబ్బుతో పాటు మీ ఎనర్జీ సేవ్ అవుతుంది.

a) ప్లెడ్జ్:
ప్లెడ్జ్ వంటి డస్టింగ్ స్ప్రే వలన స్టెయిన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ ని శుభ్రంగా చేసుకోవచ్చు. అలాగే, ఈ స్ప్రే అనేది చక్కని సెంట్ ని కూడా అందిస్తుంది.

b) సోప్ మరియు వాటర్:
ప్లెయిన్ లిక్విడ్ సోప్ మరియు వాటర్ మిశ్రమం వలన స్టెయిన్ లెస్ స్టీల్ పైన మరకలు తొలగిపోతాయి. ఆ తరువాత ప్లెడ్జ్ వంటి డస్టింగ్ స్ప్రే వాడకం మరచిపోకండి.

c) క్లబ్ సోడా:
క్లబ్ సోడాని వాడటం ద్వారా హీట్ స్టెయిన్స్ లేదా చారలను తొలగించుకోవచ్చు. మీ టోస్టర్ పై ఉండే ఈ చర్యలను సులభంగా క్లబ్ సోడాతో తొలగించుకోవచ్చు.

d) బేబీ ఆయిల్
కొన్ని చుక్కల బేబీ ఆయిల్ ని స్టెయిన్ లెస్ స్టీల్ పై రుద్దితే స్టెయిన్స్ అనేవి సులభంగా తొలగిపోయి తళతళలాడే మెరుపుని అప్లయన్సెస్ సొంతం చేసుకుంటాయి.

e) వినేగార్:
డైల్యూట్ చేయబడని వైట్ వినేగార్ ని స్ప్రే బాటిల్ లోకి తీసుకుని స్టైన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ పై లైట్ గా స్ప్రే చేయాలి. ఒక మెత్తటి గుడ్డతో తుడిస్తే షైనీ ఫినిష్ వస్తుంది. వినేగార్ అనేది పాత్రలలోని డర్ట్ ని తొలగించేందుకు కూడా తోడ్పడుతుంది.

f) స్టీల్ వూల్:
చిన్న చిన్న రస్ట్ మరకలను స్టెయిన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ ల నుంచి తొలగించేందుకు స్టీల్ వూల్ ప్యాడ్ పై ఆధారపడటం మంచిదే. మొండి మరకలు ఎక్కడున్నాయో చూసి దానిపైనే ఈ స్టీల్ వూల్ తో రబ్ చేస్తే స్క్రాచెస్ పడే అవకాశం ఉండదు. ఈ పద్దతిని పాటించడం ద్వారా సులభంగా మొండి మరకలను తొలగించుకోవచ్చు.

g) వినేగార్ మరియు స్టీల్ వూల్:
తేలికపాటి రస్ట్ మచ్చలను వైట్ వినేగార్ ను పేపర్ టవల్ తో లేదా స్పాంజ్ తో ఉపయోగించడం ద్వారా తొలగించవచ్చు. అరగంట నుంచి గంటపాటు ఈ వినేగార్ ని పాత్రపై అలాగే ఉంచాలి. వినేగార్ లో లభించే ఎసిటిక్ యాసిడ్ అనేది మరకలను బ్రేక్ డవున్ చేసేందుకు తోడ్పడుతుంది. ఆ తరువాత స్టీల్ వూల్ లో సున్నితంగా స్క్రబ్ చేయాలి. మరక పైనే ఇలా చేయడం ద్వారా మిగతా చోట్ల స్క్రాచెస్ పడదు. తడి స్పాంజ్ ని వాడి అప్లయన్స్ ని క్లీన్ చేయాలి.

h) టూత్ బ్రష్:
పేరుకుపోయిన మరకలని తొలగించేందుకు టూత్ బ్రష్ సహకారాన్ని తీసుకోవాలి. తడి టూత్ బ్రష్ తో ఎండిపోయి పాత్రలకి అంటుకుపోయిన ఫుడ్, దుమ్ము లేదా మిగతా మెటీరియల్ ని రుద్దాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో క్లీన్ చేయాలి.

i) గ్లాస్ క్లీనర్:
అప్లయన్సెస్ పైన ఫింగర్ ప్రింట్స్ ను తొలగించేందుకు విండెక్స్ వంటి గ్లాస్ క్లీనర్ ని స్ప్రే చేయాలి. ఆ తరువాత పేపర్ టవల్ తో తుడవాలి.

j) ఆల్కహాల్ ని రబ్ చేయాలి:
మైక్రోఫైబర్ ప్యాడ్ పై కొన్ని చుక్కల ఆల్కహాల్ ను వేసుకుని పాత్రలను శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో పాత్రను శుభ్రపరచుకోవాలి.