Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కుంకుడు కాయతో ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసా ?
గత కొద్దికాలంగా మీ నిపుల్స్ మీకు సమస్యగా మారుతుంటే, మీరొక్కరే ఒంటరి అనుకోకండి. ఇవి చాలాకాలం నుండి అందరికీ ఎప్పుడో అప్పుడు మన దృష్టిని వాటిపై మళ్ళించేందుకు ఇలా చేస్తూనే ఉన్నాయి.
కుంకుడు కాయకు పూర్వం విశేషమైన ప్రాముఖ్యత ఉండేది. కానీ, ప్రస్తుతం మారుతున్నా సమాజంలో దీనికి ప్రాధాన్యత తగ్గింది అనే చెప్పాలి. తెలుగులో కుంకుడు కాయ అని, హిందీలో రీటా అని, కన్నడ లో అంత్వాల్ అనే పేరుతో దీనిని సాధారణంగా పిలుస్తారు.
కుంకుడుకాయ ఇంటిని శుభ్రపరచడానికి మరియు తళతళ మెరవడానికి ఉపయోగపడుతుందని, అందులో ఇందుకోసం సమర్ధవంతంగా పనిచేసే గుణాలు ఉన్నాయని తెలుసా ? ఇంకొక విషయం ఏమిటంటే, దీని ఖరీదు కూడా చాలా తక్కువ. దీనిని వాడటం వల్ల మీ డబ్బు కూడా బాగా ఆదా అవుతుంది.
సౌందర్య ఉత్పత్తిలో భాగంగా కుంకుడు కాయని విపరీతంగా వాడతారు. పొడవాటి జుట్టుని శుభ్రపరచడానికి, ప్రకృతి సిద్ధంగా లభించిన షాంపూ గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇవాళ బోల్డ్ స్కై వెబ్ సైట్, ఈ వ్యాసంలో అత్యంత చౌకగా దొరికే కుంకుడు కాయని ఉపయోగించి విభిన్న రకాలుగా ఇంటిని ఎలా శుభ్రపరచుకోవాలో తెలుసుకోబోతున్నాం.
మీరు మరి ఎక్కువగా ఉత్సాహపడే ముందు, మొదట మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే :
ఒక గిన్నెలో 12 నుండి 15 కుంకుడుకాయలు తీసుకోవాలి. ఆ గిన్నెలో 6 కప్పుల నీరు వేయాలి. దీనిని బాగా మరిగించాలి. ఒక గంట పాటు తక్కువ మంటలో మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా రాత్రి మొత్తం అలా వదిలేయాలి. ఆ తర్వాత ఉదయం అందులో ఉన్న కుంకుడు కాయ నీటిని అంతా వడకట్టి, గాలిదూరని పాత్రలో వేసి మూతపెట్టాలి. ఇందులో ఎటువంటి సంరక్షణకారులను వేయలేదు కాబట్టి, ఈ ద్రవం ఒక వారంలో చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ గిన్నెలో నిమ్మకాయ రసం పిండడం ద్వారా, ఆ ద్రవము యొక్క జీవితకాలం పెరుగుతుంది.
కుంకుడు కాయను ఉపయోగించి ఉత్తమంగా ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి :

కిటికీలు తళతళ మెరిసేలా చేయండి :
కుంకుడు కాయను ఉపయోగించి కిటికీలను తళతళ మెరిసేలా చేయవచ్చు. ఒక స్ప్రే బాటిల్ లో పావు లీటర్ నీటిని తీసుకోండి. దీనికి 15 ml కుంకుడు కాయ ద్రవము మరియు 15 ml వెనిగర్ ని కలపండి. ఈ మిశ్రమాన్ని చిలకరించి, పొడిగుడ్డతో ఆ ప్రదేశాన్ని తుడవండి.

బంగారు ఆభరణాలు :
బంగారు ఆభరణాలను హానికర పదార్ధాలను ఉపయోగించకుండా శుభ్రపరచాలి అని భావిస్తే గనుక అందుకు కుంకుడు కాయ ఉత్తమమైనది. ఈ కుంకుడు కాయ నీటిలో ఆభరణాలను నానబెట్టండి మరియు కొన్ని నిమిషాల తర్వాత పాత మృదువాటి బ్రష్ తీసుకొని చెత్తను శుభ్రంగా తీసివేయండి. మంచి నీటితో కడిగి మృదువైన బట్టతో తుడవాలి.

ప్రకృతి సిద్దమైన చేతులు కడుక్కునే ద్రవం :
చేతులు కడుక్కోవడానికి ఉత్తమమైన పదార్ధాల్లో కుంకుడు కాయ కూడా ఒకటి. ఇందుకోసం మీరు చేయవల్సినదల్లా ఏమిటంటే, ఆ కుంకుడు కాయ ద్రవానికి కొద్దిగా నీటిని మరియు నిమ్మకాయ రసాన్ని కలపండి. ఇలా చేయడం ద్వారా ఆ మిశ్రమం యొక్క జీవిత కాలం మరింతగా పెరుగుతుంది మరియు చేతులు కడుక్కున్నప్పుడు మంచి సువాసన కూడా వస్తుంది.

పెంపుడు జంతువులను శుభ్రం చేయడానికి :
పెంపుడు జంతువులను శుభ్రం చేయడానికి ప్రకృతి సిద్ధంగా లభించే సోపు లేదా షాంపూల్లో ఇది చాలా ఉత్తమమైనది.

తివాచీలు శుభ్రం చేయడానికి :
మీ తివాచీలకు గనుక మరకలు అంటినట్లు అయితే మరియు ఆ మరకలను తీసివేయడం కష్టతరంగా ఉంటే, అటువంటి సమయంలో కుంకుడు కాయ నీటిని ఆ మరక పడిన ప్రాంతంలో చిలకరించండి. ఆ తర్వాత బ్రష్ ని ఉపయోగించి ఆ మరకలను తీసివేయండి. మీ ఇంట్లో కుంకుడు కాయ నీటిని ఉత్తమంగా వాడే మార్గాల్లో ఇది కూడా ఒకటి.

మీ కారు ని శుభ్రం చేయడానికి :
హానికరమైన మరియు ఖరీదైన డిటెర్జెంట్లను ఉపయోగించి మీ కారు ని శుభ్రం చేసుకొనే బదులుగా కుంకుడుకాయ ని ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మీ కారు నుండి మంచి సువాసన వెదజల్లుతుంది మరియు కారు అద్దాలు కూడా తళతళ మెరిసిపోతాయి.



Click it and Unblock the Notifications