For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేనెతుట్టెను ఎలా వదిలించుకోవాలి

తేనెతుట్టెను ఎలా వదిలించుకోవాలి

|

మనింటి దగ్గర తేనెతుట్టెను చూసినప్పుడు, దాన్ని వెంటనే తీసేయాలని ప్రయత్నిస్తాం, ఎందుకంటే తేనెటీగలు మన చుట్టూ ఉండటం అపాయకరం. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తేనెటీగలు వాతావరణంలో బ్యాలెన్స్ కి, మొక్కల పరాగ సంపర్కానికి, ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. మనం రోజూ తినే కాయగూరలు, పళ్ళు తేనెటీగల కారణంగానే తయారవుతాయి. మీరు ఈ కింది చిట్కాలని ఉపయోగించి తేనెటీగలను చంపకుండా తేనెతుట్టెను తీసేయవచ్చు.

తేనెతుట్టెను అలా వదిలేయకండి,ఎందుకంటే అలా వదిలేస్తే కొద్దిసేపట్లో మీ ఇంటి ముందు మొత్తం తేనెటీగల ఇల్లుగా మారిపోతుంది.అది మీ కుటుంబానికి, పెంపుడు జంతువులకే కాదు, పక్కింటి వాళ్ళకి కూడా చాలా హానికరం.

How To Get Rid Of A Beehive

ఇది వినటానికి చాలా భయంగా అన్పిస్తుంది. కానీ కొన్ని విషయాలను గమనిస్తూ, కొన్ని పద్ధతులు పాటిస్తే తేనెటీగలను చంపకుండా తేనెతుట్టెను సులభంగా తొలగించవచ్చు.

ముందు తేనెతుట్టె ఎక్కడుందో సరిగ్గా వెతకండి

ముందు తేనెతుట్టె ఎక్కడుందో సరిగ్గా వెతకండి

మీరు సులభంగానే మీ చుట్టుపక్కల తేనెతుట్టె ఎక్కడుందో కనిపెట్టవచ్చు. మీ ఇంట్లో ఒకటో లేదా రెండు తేనెటీగలు కన్పిస్తే,చుట్టుపక్కల ఎక్కడో దగ్గర్లోనే తేనెతుట్టె కూడా ఉంటుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తేనెతుట్టెను తీసేయటం చాలా ముఖ్యం. కావాల్సిన పనిముట్లను అమర్చుకుని తేనెటీగలను వెతకండి,చంపొద్దు.

తేనెటీగల సంరక్షకుడి సాయం తీసుకోండి

తేనెటీగల సంరక్షకుడి సాయం తీసుకోండి

స్థానికంగా తేనెటీగలను పట్టుకొని వ్యాపారానికి వాడే సంరక్షకుల సాయం తీసుకోండి. ఈ సర్వీసు మీకు ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోల్ కంపెనీల ద్వారా దొరుకుతుంది. తేనెటీగల కీపర్ తేనెటీగలను చంపకుండా వాటిని తీసేసి పరాగ సంపర్కానికి, తేనెకోసం, మైనం కోసం వాడతారు. చాలామటుకు వివిధ కంపెనీలు తేనెతుట్టెలను ఉచితంగానే తొలగిస్తాయి, అందుకని మీకు తేనెతుట్టె కన్పిస్తే వెంటనే స్థానిక లిస్టింగ్స్ చెక్ చేయండి.

తేనెటీగలకి పొగపెట్టండి

తేనెటీగలకి పొగపెట్టండి

తేనెతుట్టెల నుండి తేనెటీగలను బయటకి తొలగించటానికి మనం పొగ, అగరుబత్తిని వాడవచ్చు. వీటిని సాధారణంగా తేనెను కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు తేనెతుట్టెలపై వాడతారు. పొగ,అగరుబత్తి వాడితే తేనెటీగలు నెమ్మదిగా తేనెతుట్టెను ఖాళీ చేస్తాయి. ఒకసారి తేనెతుట్టె ఖాళీ అయిందంటే, నెమ్మదిగా దాన్ని తొలగించవచ్చు. తేనెను పోగేసి, ఇంకా ఏమన్నా మిగిలితే కడిగేస్తే మళ్ళీ తేనెటీగలు ఆ ప్రదేశానికి ఆకర్షించబడవు.

తేనెతుట్టె కింద రాత్రిపూట కాగితం లేదా కట్టెను కాల్చి పెట్టండి

తేనెతుట్టె కింద రాత్రిపూట కాగితం లేదా కట్టెను కాల్చి పెట్టండి

మీరుండే చోట తేనెతుట్టె కన్పిస్తే,మీరు సాయంత్రం లేదా రాత్రిపూట దాని కింద కాగితం లేదా కట్టె ముక్కను కాల్చి పెడితే తేనెటీగలు పారిపోతాయి.తేనెటీగలు వాటి ఇంటికి చేరేసమయానికి పూర్తిగా డ్రస్ చేసుకుని వెళ్ళి కాల్చేసిరండి. తేనెటీగలకి దాక్కునే ప్రదేశాలు వదలకండి, లేకపోతే తప్పించేసుకుని మళ్ళీ వచ్చేస్తాయి.

తేనెటీగలని ఆకర్షించే వస్తువులను తీసేయండి

తేనెటీగలని ఆకర్షించే వస్తువులను తీసేయండి

తేనెటీగలు నీళ్ళు లీకవుతున్న ట్యాంకులు, తెరచివున్న ఫౌంటేన్లకి ఎక్కువ ఆకర్షించబడతాయి. అందుకని తేనెటీగలు ఎక్కువ ఆకర్షించబడే ప్రదేశాలను, వస్తువులను తీసేయండి. తేనెటీగలను ఒక్కరోజు కూడా సౌకర్యవంతంగా ఉండేట్లు చూడద్దు లేకపొతే అవి ఎప్పటికీ అక్కడనుంచి కదలవు. తేనెతుట్టెను పూర్తిగా నాశనం చేసేయండి, అప్పుడే వాటికి ఆ ప్రదేశంలో ఉండటం కష్టమని అర్థమవుతుంది.

తేనెతుట్టెను తీసేయడానికి మంచి సమయం

తేనెతుట్టెను తీసేయడానికి మంచి సమయం

మీరు బాగా పెరిగిన తేనెతుట్టెను నాశనం చేయటానికి మంచి సమయం వసంతకాలం ప్రారంభం లేదా చలికాలం చివరన. అదే తేనెతుట్టెను తీసేయటానికి మంచి సమయం ఎందుకంటే ఎక్కువ తేనెటీగలు ఉండవు. తేనెటీగలు పొద్దున్నే,సాయంకాలం తేనెతుట్టెలో విశ్రాంతి తీసుకుంటాయి. క్రిమిసంహారకాన్ని తుట్టెకి రాసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసేయండి.

మీకు అలర్జీ ఉంటే ఎవరైనా నిపుణుడిని పిలవండి

మీకు అలర్జీ ఉంటే ఎవరైనా నిపుణుడిని పిలవండి

మీకు అలర్జీ లేదని నిర్థారించుకున్నాకే ఇందులో దిగండి, ఎందుకంటే మీకు అలర్జీ ఉంటే తేనెటీగ కుడితే దాని విషం మీకు తీవ్ర ఆరోగ్య సమస్యలైన శ్వాస ఆడటం కష్టమవటం,వాంతులు మొదలైనవి రావచ్చు. ఇవి అలర్జీ ఉన్నవారికి ప్రాణాంతకం కావచ్చు. ఆ కేసులో తప్పకుండా నిపుణుడిని పిలవడం మంచిది.

తేనెతుట్టెను వదిలించుకోటానికి సబ్బునీళ్ళు

తేనెతుట్టెను వదిలించుకోటానికి సబ్బునీళ్ళు

తేనెతుట్టె బయట భాగాన్ని ఎవరైనా సులభంగా సబ్బునీళ్లతో కరిగించవచ్చు. ఒక భాగం లిక్విడ్ డిష్ సోప్ ను నాలుగు భాగాల నీళ్ళతో స్ప్రే బాటిల్లో కలిపి తేనెతుట్టెపై స్ప్రే చేయండి. దీన్ని పాటిస్తే మనం తేనెతుట్టెను కొంతవరకు నాశనం చేయవచ్చు.

సరిగ్గా తయారవండి

సరిగ్గా తయారవండి

తేనెతుట్టెను తీయడానికి వెళ్లటానికి,మీరు సరిగ్గా తయారవటం ముఖ్యం. లేత రంగు బట్టలు, మెత్తగా ఉన్నవి వేసుకోండి లేకపోతే తేనెటీగలు వేగంగా మారిపోతాయి. మరీ పల్చని బట్టలు వేసుకోవద్దు లేకపోతే తేనెటీగలు కుడితే మచ్చలు పడిపోతాయి.

మందపాటి గ్లోవ్స్,తలకి హెల్మెట్ లాంటిది పెట్టుకోండి, తేనెటీగల నుండి రక్షణ లభిస్తుంది. భారీ ఫెర్ఫ్యూమ్స్ లేదా డియోడరెంట్లు ఈ సమయంలో వాడవద్దు ఎందుకంటే తేనెటీగలు పువ్వుల వాసనకి, ఈ వాసనకి కన్ఫ్యూజ్ అవుతాయి.

English summary

How To Get Rid Of A Beehive

When we see a beehive near our home, we try to kill the beehive, as honey bees are known to pose a great risk for us. But we must keep in mind that honey bees are very important for the ecosystem balance, pollination, and health. Most of the vegetables and fruits we eat daily are made possible by these honey bees. You can remove the beehive without killing them by following the tips given below.
Desktop Bottom Promotion