మీ ఇంటి విద్యుత్ శక్తి సామర్ధ్యం ఏ మేరకు ఉంది?

Subscribe to Boldsky

నగర గృహాలలో విద్యుత్ గాడ్జెట్లు మరియు గృహోపకరణాల వినియోగం రోజురోజుకి అధికమవుతున్నవి. అవి పని చేయడానికి కోసం వినిమయయ్యే విద్యుత్ అవసరాల సంక్లిష్టతను తగ్గించడానికి కొన్ని తెలివైన సలహాలు, సూచనలు మీ కోసం. అవి ఏంటో తెలుసుకుందామా!

సహజ కాంతి : భారతదేశానికి అపారమైన సూర్యకాంతి లభ్యత ఉన్నా, దానిని సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో దయనీయ పరిస్థితిలో ఉంది. మీ ఇంటికి తూర్పు దిక్కున ఒక్క కిటికీ ఉన్నా కాని, మీరు వెలుతురు కోసం పగటి పూట పెట్టే విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు. "ప్రస్తుతం విదేశాలలో సౌరశక్తి ముఖ్య వనరుగా నిష్క్రియాత్మక సౌర నమూనా (passive solar design ) పద్దతిలో నిర్మించిన భవనాలు అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే భారతదేశ నగర ప్రాంతాలలోని గృహాలలో ఈ పద్దతిలో మాదిరిగా వివిధ రకాల కర్టెన్లు మరియు తెరల వాడకం కొంత మేరకు కనిపిస్తుంది. ఇలా చేయటం వలన ఇంట్లో ప్రసరించే సూర్యకాంతి పెరుగుతుంది కాని దాని వలన కలిగే తీవ్రమైన వేడి మరియు తీక్షణ వెలుగు తగ్గుతుంది" అని ముంబైకి చెందినా గృహ అలంకరణ నిపుణురాలైన శృతి సుబ్రహ్మణ్యం తెలియజేస్తున్నారు.

Is your home energy efficient?

గోడలు మరియు కిటికీలు: మీ ఇంటికి క్రొంగొత్త రంగులు అద్దాలనుకుంటున్నారా? ఐతే కాంతిని పరివర్తనం చెందించే లేత మరియు తాజా రంగులను ఎంచుకోండి. దీని వలన మీ ఇల్లు విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. ఢిల్లీకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ సాహెబా సింగ్ " బూడిద రంగు మరియు లేత గోధుమ రంగుకు మధ్యలో ఉండే టాప్(taupe) రంగును మీ లివింగ్ రూమ్ లో కర్టెన్లు, సోఫాలు, దిండ్లు మరియు కార్పెట్లకు వాడినట్లయితే కాంతి రూపంలో అదనపు హంగు మరియు ఆకర్షణ చేకూరుతాయి. ప్రస్తుత సీజనులో ఈ రంగు అధికంగా చెలామణి అవుతుంది" అని తెలిపారు.

Is your home energy efficient?

వెలుగు అమరిక: ఒక గదిలో మీకు అవసరమయ్యే కాంతి యొక్క పరిమాణం మరియు ఆ కాంతి యొక్క నాణ్యతకు మధ్య సారూప్యతను సాధించడం ద్వారా విద్యుత్ వినిమయంను వాంఛనీయ నాణ్యతా స్థాయికి తగ్గించవచ్చు. ఉదాహరణకు ఒక 6౦ వాట్ల CFL లేదా LED బల్బ్ మీ లివింగ్ రూం పరిసరాలకి సంతృప్తికరమైన వెలుతురును అందజేస్తుంది. కాని చదవటం లేక వంటగదిలో పనిచేయటానికి అధిక వెలుగు యొక్క అవసరముంటుంది. అటువంటి పరిసరాల్లో అధిక వాటేజి ఉన్న బల్బులను వాడవచ్చు. " వెలుతురు అధికంగా అవసరమయ్యే చోట ఎక్కువ వాటేజి ఉన్న బల్బు ఒకదానిని అమర్చకుండా, తక్కువ వాటేజి కలిగిన అనేక బల్బులను వ్యూహాత్మకంగా అమర్చడం వలన గమ్మత్తైన నీడలు ఏర్పడి గదియొక్క ఆకర్షణీయత పెరుగుతుంది" అని సాహెబా సింగ్ గారు వివరించారు.

Is your home energy efficient?

గృహ యాంత్రికత (Home Automation): పెరుగుతున్న సాంకేతికతో పాటు పట్టణ గృహాలలో డిజిటల్ పరికరాల వాడుక పెరిగింది. ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ (IOT) వంటి సాంకేతికను అందిపుచ్చుకుని తద్వారా గృహ యాంత్రికతను సాధించి గృహవాతావరణంలో విద్యుత్ వాడుక సామర్ధ్యాన్ని పెంచవచ్చు. మీ ఇంట్లో విద్యుత్ పరికరాలన్నింటిని మీ మొబైల్ ఫోన్ తో అనుసంధానించి, వాటి పనితీరును నిరంతరం తనిఖీ చేయడం వలన అవి చేసే విద్యుత్ వినిమయం ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా ఆ పరికరాలను సమయానుగుణంగా మరమ్మత్తులు చేయించటమో లేక కొత్త పరికరాలతో మార్పిడి చేయటమో వెంటనే చేయవచ్చు.

Is your home energy efficient?

ఆర్కిటెక్ట్ మరియు గృహాలంకరణ నిపుణులైన ఆషీష్ షా " గృహ యాంత్రికత అనేది విద్యుత్ పొదుపుకు అద్భుతమైన పరిష్కారం. ప్రతి ఇంటికి ప్రసరించే సహజ కాంతిని పూర్తిగా వాడుకోవాలి. సరైన నిర్మాణ పదార్ధాలను వాడి, తద్వారా వెంటిలేషన్ వ్యవస్థని మెరుగు పరచుకొని సమర్ధవంతమైన వనరుల వినియోగం దిశగా అడుగులు వేయవచ్చు.

Is your home energy efficient?

గృహ యాంత్రికత విధానాలు, సౌర ఫలకాల ఏర్పాటు , ఇంకుడు గుంతల ఏర్పాటు, వాననీటి నిల్వ నిర్మాణాలు వంటి సాంకేతిక అంశాలను వాడుకుని మీరు టెక్-ఫ్రెండ్లీ ఇంటిని నిర్మించవచ్చు. నేటి ఆధునిక యుగంలో కళారూపాలు కూడా గతి శక్తిని సంతరించుకుని డిజిటల్ గా రూపాంతరం చెందుతున్నాయి"అని వివరించారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Is your home energy efficient?

    Is your home energy efficient?,As urban homes get increasingly tech-friendly with the advent of newer gadgets and appliances, here’s how you could cut through the complexity by implementing these ideas for intelligent energy consumption…
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more