For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటికి సానుకూల ఫలితాలు పొందుటకు 7 వాస్తు చిట్కాలు

మీ జీవితంలో ఏ కారణం లేకుండా ఎప్పుడైనా ఒంటరిగా ఏదైనా ప్రదేశానికి వెళ్లి చింతించడం లాంటివి జరిగాయా ? కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాలలో ఇలాంటి మానసిక చింతనకు లోనవడం సహజంగా జరిగే పరిణామం. కాని కొన్ని ప్ర

|

మీ జీవితంలో ఏ కారణం లేకుండా ఎప్పుడైనా ఒంటరిగా ఏదైనా ప్రదేశానికి వెళ్లి చింతించడం లాంటివి జరిగాయా ? కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాలలో ఇలాంటి మానసిక చింతనకు లోనవడం సహజంగా జరిగే పరిణామం. కాని కొన్ని ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంటాయి వాస్తు అనుకూలతవల్ల.

ఇది మనసును మరియు ఆత్మను ప్రభావితం చేసే శక్తి. నిజానికి తెలిసికాని, తెలియకుండా కాని శక్తి అనేది అన్నిచోట్లా ఉంది. దీనికి కారణం విశ్వమే శక్తితో తయారైంది, ఆ విశ్వంలో మన ఇల్లు కూడా ఒకటి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడూ మన ఇంటివైపు సానుకూల ఫలితాలు రావాలని, పిల్లా పాపలతో సంతోషంగా గడపాలని కోరుకోవడం సర్వ సాధారణం. కావున దీనికి వాస్తుని అనుసరించి ఇంటిని నిర్మించుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు.

వాస్తు అనేది ప్రాచీన నిర్మాణ శాస్త్రం. ఈ వాస్తు, ఇంటిని అందంగా నిర్మించడానికే కాకుండా సానుకూల శక్తిని కలగజేస్తుంది కూడా. కొన్ని వాస్తు సూత్రాలను పాటించడం మూలంగా సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు సంపన్నకరమైన జీవితాన్ని పొందవచ్చు.

అందమైన స్వాగతం

అందమైన స్వాగతం

Image source

అందం అనేది ఒక అద్భుతం మరియు ఆకర్షణీయమైనది. ఈ అందం శక్తిని కూడా ఆకర్షించగలదు. మీ గృహ ముఖద్వారాన్ని అందంగా ఉండునట్లు జాగ్రత్త తీసుకోండి. తద్వారా సానుకూల శక్తి మీ ఇంటివైపుకి పయనిస్తుంది మరియు మీ ఇల్లు ఆరోగ్యకరంగా, సంపన్నవంతంగా విరాజిల్లుతుంది.

సూర్యకాంతి అన్నిటికన్నా ముందు

సూర్యకాంతి అన్నిటికన్నా ముందు

Image source

సూర్యుడు శక్తికి మూలపురుషుడు మరియు ముఖ్యమైన వాస్తు మూలకంగా చెప్పబడుతున్నది. ఏ గృహాన్ని నిర్మించినా సూర్యుని ఉదయాస్తమయాలను దృష్టిలో ఉంచుకునే నిర్మాణం జరుగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఇల్లు కట్టడం లో సూర్యకాంతి ఇంట్లో నలువైపులా విస్తరించునట్లు జాగ్రత్త తీసుకోవాలి. తద్వారా మీ ఇల్లు నూతన శక్తిని సంతరించుకుంటుంది. ఇలా రోజూ సూర్యకాంతి ఇంటిలో ప్రవేశించడం ద్వారా శారీరిక మానసిక సమస్యలు తొలగడమే కాకుండా, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచడంలో సహాయం చేస్తుంది.

మీ ఇంటిని రంగులమయం చేసుకోండి

మీ ఇంటిని రంగులమయం చేసుకోండి

Image source

ఒక ప్రత్యేకమైన కారణం చేతే ప్రకృతి ఏంతో అందంగా రమణీయంగా రూపుదిద్దుకుంది. ప్రతి రంగు కూడా మన జీవితంలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

ఆధినిక కాలం, మారుతున్న ఆలోచనల కారణంగా ఇంటి రంగులలో తటస్థమైన, తేలిపోయిన రంగులు వేయడం సర్వసాధారణం అయినప్పటికీ , కొన్ని మిగిలిన, నప్పిన రంగులను కూడా కలపడం మంచిది. తద్వారా ఇంటికి ఒక అందమైన ఆకర్షణను తీసుకుని రావొచ్చు. తేలికపాటి రంగులు ఒకరకమైన స్తబ్దత వాతావరణాన్ని తీసుకు వస్తే, ఇంద్ర ధనుస్సు రంగులు ఒక చురుకైన వాతావరణాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇలా రంగులు కలపడం మూలంగా మానసిక ఆనందాన్ని పొందడమే కాకుండా ఇంటిలో ఒక సానుకూల దృక్పధాన్ని పొందగలుగుతారు.

అన్నిటా శుభ్రత

అన్నిటా శుభ్రత

Image source

ఏ ప్రదేశాన్నైనా శుభ్రంగా ఉంచుకోవడం , వస్తువులను అందంగా సర్దుకోవడం అనేది వాస్తు యొక్క మొదటి సూత్రం. ఇలా ఉండని పక్షంలో సానుకూల శక్తికి అవరోధాలు ఏర్పడి, అయోమయ వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. కావున ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ, వస్తువులను చిందరవందర లేకుండా సర్దుకుంటూ ఉండాలి. తద్వారా మానసిక శాంతి, తెలివితేటలూ పెరుగుతాయి.

అదేవిధంగా ఉపయోగించని, తగలబెట్టబడిన లేదా విరిగిన వస్తువులను ఇంటినుండి బయటకు పంపండి. అవి ఇంటిలో ఉండడం మంచిది కాదు. దీన్ని మీ ఇంటిలో ఒక నిభంధనగా చేయవలసి ఉంటుంది. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉన్న మూలంగా శక్తి యొక్క సానుకూల ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. సంతోషకరమైన జ్ఞాపకాలను పదిలపరచుకోవడంలో తప్పు లేదు. కాని అసౌకర్యానికి లోనయ్యే వస్తువులను ఉంచడం మంచిది కాదు. వీటిని తొలగించుట వల్ల మానసిక సంతోషంతో పాటు సానుకూల శక్తి మీ ఇంటి వైపుకి అడుగులు వేస్తుంది.

ఉప్పు లోని శక్తిని గుర్తించండి

ఉప్పు లోని శక్తిని గుర్తించండి

Image source

ఒక చిన్న పాత్రలో ఉప్పు ప్రతికూల ప్రభావాలని అడ్డుకోగలదని మీకు తెలుసా . మీ ఇంటిలో ప్రతికూల ప్రభావం ఉందని మీరు భావిస్తున్నట్లయితే ఒక పాత్రలో ఉప్పుని తీసుకుని ఈశాన్య మూలన ఉంచండి. తద్వారా ప్రతికూల ప్రభావాల నుండి మీ ఇల్లు శుద్దిగావింపబడుతుంది.

రాగానికి రాళ్ళైనా కరుగుతాయి

రాగానికి రాళ్ళైనా కరుగుతాయి

Image source

సంగీతం మానసిక ప్రశాంతతని ఇవ్వడమే కాకుండా ఇంటిలో సానుకూల ఫలితాలు వచ్చునట్లు చేయడంలో సహాయం చేస్తుంది. తద్వారా ఇంటిని శక్తితో నింపుతుంది. కావున శ్రావ్యమైన సంగీతాన్ని ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం వేళలయందు వినండి. ముఖ్యంగా గాలి గంటలు లేదా గుడిగంటల నుండి వచ్చు ధ్వని ప్రతికూల ప్రభావాలని దూరం చేస్తుంది. కావున కనీసం రోజులో ఒకసారి ఆ ధ్వని వినడం మంచిది అని పెద్దలు చెప్తుంటారు.

ఎప్పుడైనా గుడిలో ప్రవేశించిన వెంటనే సానుకూల ఆలోచనలు, మానసిక ప్రశాంతత రావడం మీరు గమనించే ఉంటారు. ఒకవేళ మీరు నాస్తికులు అయినప్పటికీ ఇలా దేవుని విగ్రహాలు, ఫోటోలు కాని, చిన్ని పూజామందిరాలు కాని ఇంటిలో ఉండునట్లు చూడండి. మీ ఇల్లు సానుకూల శక్తి పెంచుకొని, మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. కాని ఈ విగ్రహాలు , పూజా మందిరాలు ఇంటిబయట ఉంచడాన్ని మరియు ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండునట్లు మాత్రం చేయకండి.

English summary

7 Vastu tips to bring positive energy to your home

By following certain vastu tips, we can eventually bring positive energy to our home. Placing the right colour is important. Filling your space with a lively ambience can create positive energy. Also, if you feel there is some sort of a negative energy in your house, it is advised to keep a bowl of salt open.
Story first published:Tuesday, March 13, 2018, 14:31 [IST]
Desktop Bottom Promotion