ఇంట్లోని గాలి నాణ్యత మెరుగవడానికి తీసుకోవలసిన ఆరు జాగ్రత్తలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీ ఇంట్లోని గాలి స్వచ్ఛంగా లేనట్టనిపిస్తోందా? దుర్వాసనలు ఎక్కువగా వస్తున్నాయా? అయితే, మీ ఇంట్లోని గాలి స్వచ్ఛతను మెరుగుపరచాల్సిన సమయమిది.

ఇంట్లోని గాలి స్వచ్ఛంగా ఉంటేనే ఇంట్లోని సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు పీల్చే గాలి యొక్క నాణ్యతను మెరుగుపరిచాలంటే కొన్ని పద్దతులను పాటించాలి. గాలి నాణ్యతను మెరుగుపరిచే విధానాలపై మీకు అవగాహన ఉండాలి.

గాలి నాణ్యత దెబ్బతిన్న విషయం మీకు తెలిసుండకపోవచ్చు. కెమికల్ ప్రోడక్ట్స్ వలన అలాగే పర్యావరణంలోని దుమ్మూ ధూళి వలన గాలి నాణ్యత దెబ్బతింటుంది.

Six Things You Can Do To Improve the Air Quality in Your House

నిజానికి, శ్వాసకోశ సమస్యలు అలాగే కొన్ని రకాల అలర్జీలు గాలి నాణ్యత దెబ్బతినడం వలన సంభవిస్తాయి. అత్యంత బాధాకర విషయం ఏంటంటే గాలి నాణ్యతకు గల ప్రాముఖ్యాన్ని అనేకమంది విస్మరిస్తున్నారు.

అందుకే, ఈ రోజు గాలి నాణ్యతను మెరుగుపరిచే ఆరు విషయాలను బోల్డ్ స్కై ద్వారా మీకు అందిస్తున్నాము. వీటిని పాటించి, గాలి నాణ్యతను మెరుగుపరుచుకుని తద్వారా మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.

వీటిని పాటించండి మరి!

1. పర్యావరణానికి అనుకూలమైన క్లీనింగ్ ప్రాడక్ట్స్ నే వాడండి:

1. పర్యావరణానికి అనుకూలమైన క్లీనింగ్ ప్రాడక్ట్స్ నే వాడండి:

కెమికల్స్ తో నిండిన ఎన్నో రకాల క్లీనింగ్ ప్రాడక్ట్స్ కి అలవాటు పడి సహజంగా లభించే ప్రత్యామ్నాయాలను మరచిపోయాము. ఇంట్లోని గాలి నాణ్యత దెబ్బతీయకుండా సహజసిద్ధమైన పదార్థాలను క్లీనింగ్ కి వినియోగించడం ద్వారా గాలి నాణ్యతను కాపాడుకోవచ్చు.

డజన్ల కొద్దీ దేశాలలో పర్యావరణానికి అనుకూలమైన క్లీనింగ్ పద్ధతులనే పాటిస్తున్నారు. నిజానికి, ఎంతో మంది ప్రజలు కెమికల్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ కి బదులుగా పర్యావరణానికి అనుకూలమైన క్లీనింగ్ పద్ధతులని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

సూచనలు

సాధ్యమైనంత వరకూ కెమికల్ స్ప్రేస్ ని వాడటం మానండి. వీటిలోనున్న హానికర అలాగే సింథెటిక్ టాక్సిన్స్ అనేవి పర్యావరణాన్ని పాడుచేస్తాయి.

వైట్ వినేగార్, నిమ్మ లేదా బేకింగ్ సోడాతో ఇంటిని శుభ్రపరుచుకోండి.

సిట్రస్ పీల్స్ అలాగే సహజమైన స్పైసెస్ ను కెమికల్ ఎయిర్ ఫ్రెషెనర్స్ కి బదులుగా వాడండి.

2. ఇంట్లోని చెత్తను తొలగించండి

2. ఇంట్లోని చెత్తను తొలగించండి

ఇంట్లోని అవసరమైనవాటినే ఉంచండి. వాడని వస్తువులను తొలగించుకోండి. ఆలాగే, పాడైపోయినవి వెంటనే తొలగించండి. ఎక్కువగా సామానులు పోగైతే వాటితో పాటే అంతే మొత్తంలో దుమ్మూ ధూళి పేరుకుపోతాయి. అందువలన, వస్తువులను ఎక్కువగా పేర్చుకోకండి.

మీకు ఇంటిని డెకరేట్ చేయటం ఇష్టమైనా కూడా సింపుల్ గా డెకరేట్ చేసుకోవడం మంచిది.

సూచనలు

రగ్స్, స్టఫ్డ్ యానిమల్స్, తోలు వస్తువులను శుభ్రపరుచుకోండి.

వాటిని ఇంట్లో ఉంచాలనుకుంటే తరచూ వాటిని శుభ్రపరచుకుంటూ ఉండండి.

మీకు పెంపుడు జంతువులూ ఉన్నట్టయితే వాటి హైజీన్ కి కూడా ప్రాముఖ్యతనివ్వండి. వాటి బొమ్మలను, బెడ్ ను శుభ్రపరచండి.

3. వెంటిలేషన్ కు ప్రాధాన్యం ఇవ్వండి

3. వెంటిలేషన్ కు ప్రాధాన్యం ఇవ్వండి

ప్రతి గదిలోని గాలి నాణ్యత మెరుగవటానికి వెంటిలేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ప్రతి గదిలోని కిటికీలను అలాగే తలుపులను కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు తెరచి ఉంచాలి.

ముఖ్యంగా, మీ ఇంట్లో ఎక్కువ వస్తువులు పేరుకుపోయి ఉన్నప్పుడు వెంటిలేషన్ కి మీరు అధిక ప్రాధాన్యతనివ్వాలి.

సూచనలు:

ట్రాఫిక్ అలాగే పోలెన్ తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోని కిటికీలను, తలుపులను తెరచి ఉంచడం మంచిది.

అన్ని తలుపులు అలాగే కిటికీలు తెరవాలి. బాత్రూం అలాగే వంటగదికి కూడా ఈ సూచన వర్తిస్తుంది.

ప్రతి రోజూ ఈ పద్దతిని పాటించండి. తద్వారా, ఇంట్లోని గాలి నాణ్యత మెరుగవుతుంది.

4. తేమని అదుపులో ఉంచండి

4. తేమని అదుపులో ఉంచండి

గోడలలో అలాగే రూఫ్ లో పేరుకున్న తేమ కేవలం దుర్వాసనలు కలిగించడానికే పరిమితం అవలేదు. ఇవి మీకు శ్వాసకోశ సమస్యలను అలాగే చర్మసమస్యలను కలిగిస్తాయి.

ఒకవేళ మీ ఇంట్లో వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే వెంటనే తగిన పరిష్కారం వెతికి గాలి నాణ్యత దెబ్బతినకుండా చూసుకోవాలి.

సూచనలు

ఇంట్లోని తేమ ఎక్కువగా ఏ గదిలో పేరుకుపోతుందో కనుగొని ఆ గదిలోని కిటికీలను, తలుపులను తెరవాలి.

ఆకుపచ్చని బూజును తొలగించేందుకు వినేగార్ మరియు నిమ్మని వాడండి.

తేమ ఇంకా అలాగే నిలిచి ఉంటే, ప్రొఫెషనల్స్ సహకారాన్ని పొంది రిపైర్స్ ను చేయించండి.

5. సిగరెట్ స్మోకింగ్ ను అవాయిడ్ చేయండి

5. సిగరెట్ స్మోకింగ్ ను అవాయిడ్ చేయండి

సిగరెట్స్ ను తాగకండి. ఇంట్లోని స్మోకింగ్ చేస్తే గాలి నాణ్యతను దెబ్బతీసిన వారవుతారు. మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందికి గురవుతారు.

సిగరెట్ పొగ గాలిలో కలిసిపోతుంది. అందులోని టాక్సిన్స్ ఎక్కువగా ఉండటం వలన ఇంట్లోని సభ్యులందరికి శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు.

అందులోని కెమికల్ కాంపౌండ్స్ గదిలో నిలిచిపోతాయి. నిజానికి, గదిలో నుంచి వస్తున్న దుర్వాసనతో మీరీ విషయాన్ని పసిగట్టవచ్చు.

సూచనలు

స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం. సాధ్యమైనంత వరకూ స్మోకింగ్ ను అవాయిడ్ చేయండి.

స్మోకింగ్ ను మానేసేందుకు అవసరమైన మద్దతుపై అలాగే రెమెడీస్ పై దృష్టి సారించండి.

ఒకవేళ స్మోకింగ్ మానలేకపోతే, బయటకు వెళ్లి స్మోక్ చేయండి.

6. ఇండోర్ ప్లాంట్స్ ను పెంచండి

6. ఇండోర్ ప్లాంట్స్ ను పెంచండి

ఇండోర్ ప్లాంట్స్ ఇంటి అందాన్ని మరింత పెంచడంతో పాటు ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఇవి, సహజసిద్ధంగా గాలి నాణ్యతను పెంపొందిస్తాయి.

గాలిలోని కాలుష్యాన్ని తొలగించే సామర్థ్యం వీటికి కలదు. అలాగే, ఇంటికి చక్కటి లుక్ కూడా వస్తుంది.

సూచనలు

బ్యాంబూ

ఫెర్న్స్

ఐవీ

ఆర్కిడ్స్

పీస్ లిల్లి 3

లోటస్

వైపర్స్ బోస్ట్రింగ్ హెంప్

లేస్ లీఫ్

జెర్బేరా జెంసోనీ

చైనీస్ ఎవర్గ్రీన్స్

అజాలీ

ఈ సూచనలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఇంట్లోని గాలి నాణ్యతను మెరుగుపరుచుకోండి. తద్వారా, ఇల్లు మరింత ప్రశాంతమైన అలాగే ఆరోగ్యకరమైన ప్రదేశంగా మారుతుంది.

English summary

Six Things You Can Do To Improve the Air Quality in Your House

Does the air in your house feel heavy? Do you smell bad odors? It’s likely that you need to take steps to improve the air quality in your home.
Story first published: Wednesday, January 24, 2018, 19:00 [IST]