For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మన ఇంటిని డస్ట్ ఫ్రీ గా చేసుకునే స్మార్ట్ టిప్స్ ఇవే

  |

  మన జీవితంలోని కొన్ని అంశాలు శాశ్వత స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తాయి. లేడీస్, ఇప్పుడు మీరు ఈ విషయంపై దీర్ఘంగా ఆలోచించనవసరం లేదు. మన ఇంట్లోకి మన పెర్మిషన్ లేకుండా చొరబడివచ్చి మన సమయాన్ని వృధా చేసే పదార్ధం గురించి మేం మాట్లాడుతున్నాము. అదేనండి, డస్ట్ గురించే మేము మాట్లాడుతున్నాము.

  మనం ఇంటిని ఒక కోవెలలా భావిస్తాము. మన వ్యక్తిత్వానికి పొడిగింపుగా మనం ఇంటిని భావించవచ్చు. ఇల్లంటే, మనకు పెర్సనల్ స్పేస్ కాబట్టి దానిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీస్ పని ఒత్తిళ్లలోంచి ఇంటికి వచ్చి సేద దీరడానికి అనువైన ప్రదేశం మన ఇల్లే. మనకు మనం సేఫ్ గా అలాగే హ్యాపీగా భావించే ప్లేస్ ఇది.

  ఈ ఆర్టికల్ ని పురుషులు చదువుతున్నట్టయితే, మహిళలకు ఇల్లంటే ఎంత అభిమానమో ఇప్పటికైనా అర్థమవుతుంది.

  ఇంటిని శుభ్రంగా ఉంచడానికి మహిళలు పడే శ్రమకు వెలకట్టలేము.

  Smart Tips To Make Your House Dust-Free

  మహిళలకు, ఇంటిని శుభ్రపరచడమనేది వెన్నతో పెట్టిన విద్య. అయితే, ఎంత కష్టపడి ఇంటిని శుభ్రపరచుకున్నా ఒక విషయంలో మాత్రం విఫలం అవుతున్నారు. టేబుల్ పై ఉన్న దుమ్మును శుభ్రం చేసిన మరునాడే మళ్ళీ దుమ్ము ప్రత్యక్షమవుతుంది. ఎదో మేజిక్ లా మళ్ళీ తనదైన శైలిలో ప్రత్యక్షమై చిరాకు పుట్టిస్తుంది ఈ దుమ్ము. మళ్ళీ, క్లీనింగ్ ప్రాసెస్ ని యథాతథంగా చేయాలి. చివరికి, ఈ ప్రాసెస్ కి అంతే లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది??!!

  దుమ్ము అనేది పోలెన్, డర్ట్, హ్యూమన్ హెయిర్, ఫాబ్రిక్స్ కి చెందిన ఫైబర్, వుడ్ యాష్, కెమికల్స్ అలాగే హ్యూమన్ డెడ్ స్కిన్ సెల్స్ తో తయారవుతుంది. ఈ చిన్న చిన్న పదార్థాలు ఎక్కువగా పేరుకుపోయి ఎక్కడ పడితే అక్కడ మనకు దర్శనమిస్తాయి. వీటిని, సరైన సమయంలో క్లీన్ చేయకపోతే దుమ్ము బాగా పేరుకుపోయి పరిసరాలు అస్తవ్యస్తంగా తయారవుతాయి. ఈ దుమ్ము వలన అప్పటికప్పుడు తీవ్రమైన హానీ కలగకపోయినా ఆ ఇంట్లో నివసించే సభ్యులకు వీటివలన చిన్నపాటి నుంచి తీవ్రమైన ఆరోగ్యసమస్యలు క్రమంగా తలెత్తవచ్చు.

  ఇళ్లల్లో దుమ్ము వలన కలిగే హానికర ప్రభావాల గురించి మహిళలకు తెలుసు. కాబట్టి, దుమ్మును తొలగించేందుకు అనేక పద్దతులను పాటిస్తారు. అయితే, మళ్ళీ, మరుసటి రోజు దుమ్ము మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. మళ్ళీ, క్లీనింగ్ ప్రాసెస్ ని మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. కాబట్టి, ఈ రోజుల్లోని స్మార్ట్ విమెన్ ఈ డస్ట్ నుంచి కనీసం కొంతకాలం వరకైనా ఉపశమనం పొందేందుకు కొన్ని స్మార్ట్ పద్దతులను కనుగొనాలి.

  కాబట్టి, ఈ స్మార్ట్ ఐడియాస్ ను తెలుసుకొని, మీ ఇంటిని ఎక్కువకాలం డస్ట్ ఫ్రీ గా ఉంచుకునే ఏర్పాట్లు చేసుకోండి మరి.

  1. కార్పెట్స్ ను తొలగించండి:

  1. కార్పెట్స్ ను తొలగించండి:

  డస్ట్ కి మూల కారణంగా కార్పెట్స్ ని చెప్పుకోవచ్చు. ఈ కార్పెట్స్ లోని డస్ట్ అనేది ఎక్కువగా దాగుని ఉంటుంది. ప్రతి రోజూ మీరు వాక్యూం చేసినా కూడా కార్పెట్స్ లోకి డస్ట్ దూరిపోతుంది. అందుకని, వాటిని పూర్తిగా క్లీన్ చేయాలంటే డిటర్జెంట్ అలాగే వాటర్ తో శుభ్రపరచుకోవడం తప్పనిసరి. ఇది చాలా కష్టతరమైన ప్రాసెస్. కాబట్టి, డస్ట్ కి మూలమైన కార్పెట్స్ ని పూర్తిగా తొలగించడం ద్వారా డస్ట్ ని తగ్గించుకోవచ్చు. కార్పెట్స్ ని తొలగించడం ద్వారా డస్ట్ ని ఎక్కువశాతం తగ్గించుకోవచ్చు. కార్పెట్స్ కి బదులుగా వినీల్ కార్పెట్స్ ని వాడుకోవచ్చు. ఇవి డస్ట్ ఫ్రీ కార్పెట్స్ గా ప్రసిద్ధి చెందాయి. ఇవి చూడడానికి అందంగా కనిపించడంతో పాటు డస్ట్ ని దూరంగా ఉంచుతాయి.

  2. కిటికీలను మూసి ఉంచండి:

  2. కిటికీలను మూసి ఉంచండి:

  మీరు రోడ్ ఫేసింగ్ ఇంట్లో ఉన్నట్లయితే, మీరు కిటికీలను మూసి ఉంచడం మంచిది. ముఖ్యంగా, ట్రాఫిక్ పీక్ హవర్స్ లో కిటికీలను మూసి ఉంచాలి. బయటనుంచి వచ్చే దుమ్ము మరింత హానీకరమైనది. అందులో హానికర పొల్యూటెంట్స్ తో పాటు హానికర గ్యాసెస్ ఉంటాయి. కాబట్టి, కిటికీలను తెల్లవారుజామున లేదా రాత్రి పూట తెరవడం ద్వారా తాజా గాలిని స్వాగతించవచ్చు.

  3. ఎయిర్ ఫిల్టర్స్ ని క్లీన్ చేయండి:

  3. ఎయిర్ ఫిల్టర్స్ ని క్లీన్ చేయండి:

  కిటికీలను మూసి ఉంచడం ఎంత ముఖ్యమైనదో ఈ చిట్కా కూడా అంతే ముఖ్యమైనది. ఎయిర్ కండిషనర్ నుంచి వచ్చే గాలి ఫిల్టర్ అవుతున్నా కూడా ఫిల్టర్స్ లో డస్ట్ ఎక్కువగా పేరుకున్నప్పుడు అవి సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. కాబట్టి, ఎయిర్ కండిషనర్ ఫిల్టర్స్ ని తరచూ క్లీన్ చేయడం ద్వారా ఇంట్లోని గాలి నాణ్యతను మీరు మెరుగుపరచుకోవచ్చు.

  4. డస్టింగ్-బ్రూమింగ్-మాపింగ్ రొటీన్ ను అనుసరించండి:

  4. డస్టింగ్-బ్రూమింగ్-మాపింగ్ రొటీన్ ను అనుసరించండి:

  మీరు కాస్త గమనిస్తే ఈ క్లీనింగ్ రొటీన్ ని మన పెద్దవాళ్ళు అనుసరించి రావడం మనకు గుర్తుకువస్తుంది. అవును, ఈ ప్రాసెస్ ని పాటించడం ద్వారా మనం డస్ట్ ని ఎక్కువశాతం దూరం పెట్టవచ్చు. పిల్లోస్, కర్టెన్స్ అలాగే కార్పెట్స్ తో పాటు మిగతా ఐటమ్స్ పై పేరుకుపోయిన దుమ్మును దులిపి ఆ తరువాత చీపురుతో ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత నీటిని ఫినాయిల్ ని కలిపి ఇల్లలకాలి. ఇలా చేయడం ద్వారా ఇంట్లోని దుమ్ము తొలగిపోయి ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది.

  5. హ్యూమిడిఫయర్ ని అమర్చాలి:

  5. హ్యూమిడిఫయర్ ని అమర్చాలి:

  పొడిప్రాంతాల్లో నివసించే వారికి ఈ చిట్కా అత్యంత ముఖ్యమైనది. డ్రై ఎన్విరాన్మెంట్స్ లో స్టాటిక్ బిల్డ్ అవుతుంది. అది మేగ్నెట్స్ వంటి డర్టు ని అట్ట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి, హ్యూమిడిఫయర్ ని అమర్చుకోవడం ద్వారా స్టాటిక్ తగ్గుతుంది. తద్వారా, ఇంట్లోని డస్ట్ శాతం తగ్గుముఖం పడుతుంది.

  6. జంక్ ని తొలగించండి:

  6. జంక్ ని తొలగించండి:

  మీ ఇంట్లోని అటకలు ఉన్నట్లయితే, వాటిలోని అనవసరమైన స్టఫ్ ని తొలగించుకోవడం ముఖ్యం. ఎందుకంటే, అటకలలో పేరుకుపోయిన దుమ్ముని తొలగించడం కష్టం. వీటిలోని పేరుకున్న అనవసర సామాన్లను తొలగించడం ద్వారా దుమ్ము నుండి ఉపశమనం పొందవచ్చు. తద్వారా, ఇల్లు కూడా అందంగా కనిపిస్తుంది.

  7. ప్లషీ ఫర్నీచర్ ను తొలగించండి:

  7. ప్లషీ ఫర్నీచర్ ను తొలగించండి:

  లైసెన్, శాటిన్ మరియు వెల్వెట్ వంటి టెక్స్టైల్స్ అనేవి డస్ట్ ను అట్ట్రాక్ట్ చేయడంలో ముందుంటాయి. వీటి బదులు వుడ్ మరియు లెదర్ తో చేయబడిన ఐటమ్స్ ని ఇంట్లోకి స్వాగతించండి. తద్వారా, ఇంట్లో పేరుకుపోయిన డస్ట్ ను తగ్గించుకోవడం సాధ్యమవుతుంది.

  8. ఫుట్ వేర్ ను ఇంటి వెలుపలే విడువండి:

  8. ఫుట్ వేర్ ను ఇంటి వెలుపలే విడువండి:

  ఫుట్ వేర్ ద్వారా దుమ్ము ధూళి ఎక్కువగా ఇంట్లోకి అడుగుపెడతాయి. వాటిని, ఇంటికి వెలుపలే ఉంచడం ద్వారా ఇంట్లోకి దుమ్మును రాకుండా అడ్డుకోవచ్చు. కాబట్టి, ఫుట్ వేర్ కి సెపరేట్ షెల్ఫ్ ని ఏర్పాటు చేయడం మంచిది. అలాగే, అతిథులు కూడా ఫుట్ వేర్ ని ఇంటి బయటే విడిచేలా జాగ్రత్తలు తీసుకోండి.

  English summary

  Smart Tips To Make Your House Dust-Free

  For women, cleaning their homes is not a big issue. But keeping it that way is something which keeps women on their toes. No matter how much you clean your house, the dust particles are always there. But here are some tricks where you can clean your house and wipe off all that dust.
  Story first published: Monday, February 12, 2018, 17:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more