For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వంటింట్లో దాగున్న భయంకరమైన 8 డర్టీ స్పాట్స్ ఇవే

మీ ఇంట్లో మురికి అనేది రహస్యంగా దాగి ఉంది. మీరు డోర్ నాబ్స్ ని శుభ్రపరచడం అలాగే టూత్ బ్రష్ లను తరచూ మార్చుతూ ఉండటం వంటి కొన్ని పద్దతులను పాటించడం ద్వారా క్రిముల వ్యాప్తిని అరికట్టినట్టు భావిస్తూ ఉండవచ

|

మీ ఇంట్లో మురికి అనేది రహస్యంగా దాగి ఉంది. మీరు డోర్ నాబ్స్ ని శుభ్రపరచడం అలాగే టూత్ బ్రష్ లను తరచూ మార్చుతూ ఉండటం వంటి కొన్ని పద్దతులను పాటించడం ద్వారా క్రిముల వ్యాప్తిని అరికట్టినట్టు భావిస్తూ ఉండవచ్చు. అయితే, బాక్టీరియాకి అత్యంత ఇష్టమైన ప్రదేశాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. అదే మీ వంటిల్లు. ఒక అధ్యయనం ప్రకారం వంటింట్లోనే అత్యధిక మొత్తంలో బాక్టీరియా అనేది వ్యాప్తిచెందుతోందని తెలుస్తోంది. అన్నిటికంటే, స్పాంజిలు అధికంగా కలుషితమవుతున్నాయని వెల్లడవుతోంది.

అన్నిరకాల బాక్టీరియాలు హానీకరమైనది కావు. ఉదాహరణకు, ప్రోబయాటిక్స్ అనేవి గట్ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఉపయోగపడతాయి. అయితే, సాల్మొనెల్లా, ఈ కోలీ, లిస్టేరియా, ఈస్ట్ మరియు మోల్డ్ వంటి కొన్ని రకాల బాక్టీరియాల వలన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువ. నేషనల్ స్యానిటేషన్ ఫౌండేషన్ ప్రకారం, ఈస్ట్ మరియు మోల్డ్ అనేవి 14 కిచెన్ ఐటమ్స్ లో కనిపించాయి. రిఫ్రిజిరేటర్ ఐస్ డిస్పెన్సర్స్, రబ్బర్ స్పాటులాస్ వాటిలో కూడా ఈ బాక్టీరియా కనిపించింది. దాదాపు 36 శాతం కిచెన్ ఐటమ్స్ లో ఈ కోలీ తో పాటు సాల్మొనెల్లా అనే బాక్టీరియా దర్శనమిచ్చింది.

The 8 Most Horrifyingly Dirty Spots In Your Kitchen

అయితే, ఈ బాక్టీరియా దాడి నుంచి కిచెన్ ను సంరక్షించుకునే మార్గం మనకి సులభతరమే. వేడినీటితో అలాగే సబ్బుతో కిచెన్ ని తరచూ శుభ్రం చేయడం ద్వారా ఈ బాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చు. మీ వంటింట్లో బాక్టీరియా నివాసముండే షాకింగ్ ప్రదేశాలు ఇవే. వీటిని తరచూ శుభ్రపరుస్తూ మీ వంటింటిని శుభ్రంగా ఉంచుకుని తద్వారా మీ కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండండి.

1. స్పాంజ్

1. స్పాంజ్

ఇటీవలి అధ్యయనము ప్రకారం దాదాపు 362 రకాల సూక్ష్మ జీవులు వంటింటి స్పాంజ్ లలో అత్యధికంగా నివాసముంటాయని తెలుస్తోంది. వీటిని నిర్మూలించడం సులభమే. తడి స్పాంజ్ లను ఒక నిమిషం పాటు హై లో మైక్రో వేవ్ చేయాలి లేదా డిష్ వాషెర్ లోని డ్రై సైకిల్ లో వీటిని ఉంచాలి. ఈ రెండు పద్దతుల వలన 99 శాతం బాక్టీరియా అనేది నశింపబడుతుంది.

2. రిఫ్రిజిరేటర్

2. రిఫ్రిజిరేటర్

మీరు రిఫ్రిజిరేటర్ లో భద్రపరిచే ఆహారపదార్థాల ద్వారానే మీరు బాక్టీరియాను వ్యాప్తి చెందిస్తూ ఉంటారు. వ్రాప్ చేయకుండా ఆర్గానిక్ బ్రొకోలిని అలాగే డెలి మీట్స్ ని ఫ్రిడ్జ్ లో పొందుబరిచే ప్రతిసారి బాక్టీరియా వ్యాప్తికి మీరు సహకారం అందిస్తూనే ఉన్నారు. చీకటిగా, తడిగా ఉండే వాతావరణంలో సాల్మొనెల్లా, లిస్టేరియా, ఈస్ట్, మోల్డ్ మరియు ఈ కోలీ వంటి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇవి మనల్ని అనారోగ్యానికి గురి చేసే బాక్టీరియా. ఈ రకమైన బాక్టీరియా వ్యాప్తిని అరికట్టేందుకు రిఫ్రిజిరేటర్ ని నెలలో ఒకసారి శుభ్రపరచుకోవాలి. వేడి నీటితో స్క్రబ్ చేసి సబ్బు నీటితో కడిగి ఆ తరువాత ఒక టీస్పూన్ బ్లీచింగ్ పౌడర్ ని ఒక క్వార్టర్ నీటితో కలిపిన మిశ్రమంతో రిఫ్రిజిరేటర్ ని శుభ్రంచేసుకోవాలి.

3. కిచెన్ సింక్:

3. కిచెన్ సింక్:

మీరు సింక్ ని వినియోగించిన తరువాత నీటితో శుభ్రపరచి మీ సింక్ ఎంతో శుభ్రంగా ఉందని మురిసిపోతున్నారా? అయితే, కాస్త ఆగండి. సింక్ డ్రైన్స్ లో అలాగే గార్బేజ్ డిస్పోజల్స్ లో ఆహారపదార్థాల నుంచి బాక్టీరియా అనేది పేరుకుంటుంది. టాయిలెట్ లో కంటే ఎక్కువ ఈ కొలీ బాక్టీరియా సింక్ లో నివాసముండటమనేది భయంకర నిజం. కాబట్టి, రోజుకొక్కసారైనా బ్లీచింగ్ సొల్యూషన్ తో సింక్ ని శుభ్రపరచుకోవాలి. అదే సమయంలో, డ్రైన్ ని శుభ్రపరచుకోవడం కూడా విస్మరించకూడదు. ఆ విధంగా సాల్మొనెల్లా మరియు ఈ కోలీ బాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చు.

4. క్యాన్ ఓపెనర్

4. క్యాన్ ఓపెనర్

వంటింట్లోని బాక్టీరియా వ్యాప్తికి క్రాస్ కంటామినేషన్ అనేది ముఖ్యపాత్ర వహిస్తుంది. వీటిలో క్యాన్ ఓపెనర్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. క్యాన్ ఓపెనర్ లోని కటింగ్ వీల్ లో ఇరుకున్న టమాటో సాస్ అనేది మోల్డ్ అనే బాక్టీరియా వృద్ధికి నిలయంగా మారుతుంది. ఈ క్యాన్ ఓపెనర్ ని పిల్లలకు అందించే క్యాన్డ్ పీచెస్ కు ఉపయోగిస్తే మీ పిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. డిష్ వాషర్ లో క్యాన్ ఓపెనర్ ని శుభ్రపరచలేకపోయినా వేడి నీటితో మరియు సబ్బు నీళ్లతో క్యాన్ ఓపెనర్ ని వాడిన ప్రతీసారి శుభ్రపరచుకోవడం మంచిది. ఆ తరువాతబ్లీచ్ సొల్యూషన్ ని వాడి క్యాన్ ఓపెనర్ ని శుభ్రపరచి ఆ తరువాత క్యాన్ ఓపెనర్ లోని తడి ఎండే వరకు ఆరబెట్టండి.

5. డిష్ క్లాత్స్

5. డిష్ క్లాత్స్

స్పాంజిల లాగానే డిష్ క్లాత్స్ లలో అలాగే హ్యాండ్ టవల్స్ లో కూడా అసంఖ్యాకమైన బాక్టీరియా కొలువై ఉంటుంది. ఇవి ఎల్లప్పుడూ తడిగా ఉంటూ బాక్టీరియా వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడం వలన బాక్టీరియా అనేది త్వరగా వ్యాప్తిస్తుంది. దాదాపు 75 శాతం డిష్ క్లాత్స్ లలో ఈ కోలి వంటి బాక్టీరియా నివాసముందని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. అందువలన, ఇవి కిచెన్ లోని అత్యంత మురికిగా ఉండే ఐటమ్స్ లో ప్రధాన స్థానాన్ని పొందాయి. డిష్ క్లాత్స్ ని వాడే ప్రతి సారి అవి ఆరడానికి తగిన సమయాన్ని ఇవ్వండి. చిన్నపాటి మురికిని శుభ్రపరచినా డిష్ క్లాత్స్ ని శుభ్రంగా ఉతికి ఆరేయండి.

6. కాఫీ మేకర్

6. కాఫీ మేకర్

ఈ మధ్యకాలంలో సౌకర్యాలకే పెద్దపీట వేస్తున్నారు. అందువలన, ఎన్నో ప్రాడక్ట్స్ అనేవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కాఫీ మేకర్ కూడా సౌకర్యాన్ని కలిగించేదే. ఉదయాన్నే లేవగానే కప్పుడు వేడి వేడి కాఫీని తాగడం ద్వారా రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు. అయితే, కాఫీ మేకర్స్ ని రెగ్యులర్ గా శుభ్రపరచుకోవడం తప్పనిసరి. ఒక అధ్యయనం ప్రకారం, ఒక కాఫీ మేకర్ పాడ్ లో దాదాపు 4.6 మిలియన్ల మోల్డ్ బాక్టీరియా తిష్ట వేసుకుంటుందని తెలుస్తోంది. వినియోగించిన ప్రతి సారి నీటిని మార్చడంతో పాటు వినేగార్ ని వాడి కాఫీ మేకర్ ని శుభ్రపరచడం వలన హానీకరమైన బాక్టీరియా వ్యాప్తిని నశింపచేయవచ్చు.

7. కటింగ్ బోర్డు

7. కటింగ్ బోర్డు

టాయిలెట్ సీట్ పై ఉండే బాక్టీరియా కంటే అధిక శాతంలో కటింగ్ బోర్డు పై బాక్టీరియా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇందులో ఫెకల్ బాక్టీరియా అధికశాతంలో ఉంటుంది. వినడానికే జుగుప్సాకరంగా ఉంది కదా. మనకు తెలియకుండానే ఇటువంటి బాక్టీరియాని అనేకసార్లు మనం ఆహారంతో తీసుకున్నాము. పచ్చిమాంసానికి ఒక కటింగ్ బోర్డ్ ని అలాగే పచ్చి కూరగాయలకు ఒక కటింగ్ బోర్డు ని వాడటం ద్వారా ఈ బాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ కటింగ్ బోర్డ్స్ ని బ్లీచ్ సొల్యూషన్ లో కడగడం ద్వారా అలాగే వీటిని సరిగ్గా ఎండబెట్టడం ద్వారా బాక్టీరియా మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తపడవచ్చు. ప్రతి సారి వినియోగించే ముందు నీళ్లతో కటింగ్ బోర్డ్స్ ని శుభ్రపరచుకోవడం మంచిది.

8. బ్లెండర్

8. బ్లెండర్

బ్లెండర్ లో అధికంగా బాక్టీరియా అనేది దాగి ఉంటుంది. సాల్మొనెల్లా, ఈ కోలీ, ఈస్ట్, మోల్డ్ వంటి బాక్టీరియా ఇందులో నివాసం ఏర్పరచుకుంటాయి. ఆహారాన్ని మెత్తబరిచే బ్లెండర్ అనేది బాక్టీరియాను అధికంగా వ్యాప్తి చెందేందుకు ఒక పరికరంగా మారుతోంది. అందువలన, మెత్తగా నూరిన పదార్థాలను మరింత జాగ్రత్తగా ఉడికించడం ద్వారా బాక్టీరియాను అరికట్టవచ్చు. బ్లెండర్ ని సరిగ్గా క్లీన్ చేయాలంటే, సగం వరకూ వేడి నీటిలో నింపి ఒక చుక్క డిష్ సోప్ ను వేసుకుని బ్లెండ్ బటన్ ను ప్రెస్ చేయండి.

English summary

The 8 Most Horrifyingly Dirty Spots In Your Kitchen

Your house is hiding a dirty little secret. While you know to disinfect doorknobs and change toothbrushes regularly to avoid spreading germs, the kitchen is a hotbed for bacteria you might not expect. A study of 30 “high touch” locations in 17 homes revealed that the kitchen contained the highest number of bacteria in a house, and sponges were the most contaminated item of all.
Story first published:Tuesday, January 9, 2018, 16:41 [IST]
Desktop Bottom Promotion