For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాత్ టబ్స్ లోని రకాలు, వాటిని ఎంచుకునే విధానం.

|

స్నానపుగదిని అత్యంత అందంగా ఆకర్షణీయంగా మార్చడంలో బాత్ టబ్ ల అవసరం ఎంతో ఉంటుంది. అదేవిధంగా ఎంచుకునే బాత్ టబ్ రకాల దృష్ట్యా స్నానపు గది ఎంత విలాసవంతంగా మరియు ఎంత సౌకర్యంగా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఈ బాత్ టబ్ లు స్నానపు అనుభవాన్ని పెంచడంతో పాటు ఒక లగ్జరీ ఫీల్ ను అందిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

కొందరైతే స్నానపు గదిలో బాత్ టబ్ ఉండడం కూడా స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న అనేకరకాల బాత్ టబ్ లలో ఎంచుకునే రకాన్ని బట్టి మీ సౌకర్యం ఆధారపడి ఉంటుంది. కొందరు దీన్ని పెద్దగా ఆలోచించరు, కాని కొన్న తర్వాత కొంతకాలం వాడిన పిదప అసౌకర్యానికి చింతిస్తుంటారు. కావున ఎంచుకునే సందర్భంలోనే బాత్ టబ్ లలోని రకాలను అర్ధం చేసుకుని మీ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.

క్లౌఫూట్ టబ్ :

క్లౌఫూట్ టబ్ :

మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న టబ్ గా దీనికి పేరుంది. ఇది మిగిలిన వాటితో పోల్చినప్పుడు కాస్త తక్కువ సైజులో కనిపిస్తుంది. స్నానాలగదిలో తక్కువ స్థలాన్ని మాత్రమే తీసుకుంటుంది, పైగా విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. మీరు శుభ్రతకు ఎక్కువ ప్రాదాన్యమిచ్చే వారైతే ఇది మీకు అనుగుణంగా ఉంటుంది. దీనిని శుభ్రం చెయ్యడం చాలా సులువుగా కూడా ఉంటుంది. దీని అంచులు క్రమబద్దీకరించబడి ఉండడం మూలంగా శుభ్రత విషయంలో పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు.

ఆల్కోవ్ టబ్ :

ఆల్కోవ్ టబ్ :

ఏదైనా అపార్ట్మెంట్ లో నివసిస్తూ, లేక మీ స్నానపు గది కొలత తక్కువగా ఉన్న యెడల, ఇది మీకు సరైన ఎంపిక అవుతుంది. ఈ బాత్ టబ్ లు మూడువైపులా గోడలతో ఉండి ఒక వైపు మాత్రమే ద్వారం ఉండేలా ఉంటుంది. అనగా మనిషి ఒకవైపు నుండి మాత్రమే టబ్ లోనికి చేరుకునేలా.

డ్రాప్ ఇన్ టబ్:

డ్రాప్ ఇన్ టబ్:

ఈ టబ్ లు పైన చెప్పిన ఆల్కో టబ్ లకు సరిసమానంగా ఉంటాయి. కాని నలువైపులా టైల్స్ తో కప్పబడి ఉంటుంది. దీనిని అమర్చుటకు ఖర్చు, శ్రమ రెండూ ఎక్కువగానే ఉంటాయి. కాని విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. దీని నిర్వహణా శ్రమ మరియు నిర్వహణా వ్యయం తక్కువ కాబట్టి ఎక్కువమంది దీనిని ఎంపిక చేసుకుంటారు. చూచుటకు ఎంతో విలాసవంతముగా లగ్జరీ అనుభూతిని ఇస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు.

యాంగిల్డ్ ఫ్రీస్టాండింగ్ టబ్ :

యాంగిల్డ్ ఫ్రీస్టాండింగ్ టబ్ :

ఎక్కువసేపు స్నానం చెయ్యుటకు ఇష్టపడే వారికి, మరియు బాత్ టబ్ లలో ఎక్కువ సేపు గోరువెచ్చని నీళ్ళలో ఉంటూ పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ టబ్ లో ఒకవైపు ఎత్తుగా ఉండి తల, మెడ భాగానికి సపోర్ట్ గా ఉంటుంది. దీని కారణాన ఎక్కువ సేపు స్నానం చెయ్యుటకు వీలుగా ఉంటుంది.

జపనీస్ స్టైల్ సోకింగ్ టబ్ :

జపనీస్ స్టైల్ సోకింగ్ టబ్ :

దీని నిర్మాణం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తుంది. జపాన్ వారి ఆరోగ్య అలవాట్ల ప్రకారం , వారు తమను తాము గడ్డం వరకు పూర్తిగా మునుగునట్లు ఎంచుకుంటారు. పూర్తిగా మునగాలి అనుకుని తక్కువ స్థలం కలిగిన స్నానపుగదులు ఉన్నవారికి ఇది సరిపోతుంది. కానీ ఇది మన దేశంలో అంత ప్రాచుర్యాన్ని పొందలేదు.

కార్నర్ టబ్ :

కార్నర్ టబ్ :

తక్కువ స్థలం కలిగిన స్నానపు గదులలో ఒక మూలగా బాత్ టబ్ ఉండాలి అని ఆలోచించేవారికి ఇది సరైన ఎంపిక అవుతుంది. ఇది తక్కువ స్థలాన్ని తీసుకోవడమే కాకుండా, ఈ టబ్ కి ఒక పక్క స్నానపు సంబంధిత వస్తువులని అందుబాటులో ఉంచుకునే వీలు కూడా ఉంటుంది. మరియు స్నానపు గది చిన్నది అయినా ఆకర్షణీయం గా కనిపిస్తుంది.

English summary

Types of bathtubs and how to choose the right one

htubs are meant to enhance your bathing experience and cushion you with a sense of luxury and opulence. There are several types of bathtubs available in the market and choosing the right one is important else it might kill your fantasies of a soothing bath. If you are planning to install a bathtub in your bathroom, you need to understand the types of tubs available and decide which one suits your needs.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more