కొత్తగా పెళ్ళైన జంట వాస్తు శాస్త్రం ప్రకారం తమ బెడ్ రూమ్ సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు.

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

భారతీయ సాంప్రదాయాలలో, వివాహం అనేది రెండు విషయాలపై ఆధారపడి జరుగుతుంది ఒకటి ప్రేమ వివాహం అయితే , రెండవది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వివాహం యొక్క రూపాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, వాస్తవిక కోణంలో వివాహం తర్వాత ఒక అత్యంత వ్యవస్థీకృత జీవనశైలి కోసం స్థిరపడవలసి ఉంటుంది .

బాద్యతాయుతమైన జంటగా ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవితాన్ని నడపవలసి ఉంటుంది. ఇది మరింత ధృడమైన జీవనమార్గానికి దారితీస్తుంది. కావున ఈ జీవిత గమనాన్ని ప్రారంభించుటకు ముందు వీరిలో కనీసం ఒకరు తమ చుట్టూ ఉన్న వస్తువుల సర్ధుబాటుపై దృష్టిని కేంద్రీకరించాలి. ముఖ్యంగా వాస్తు రూపేణ చేసే సర్ధుబాటు వలన జీవితగమనం మరింత సాఫీగా సాగుతుంది అని పెద్దలు సలహా ఇస్తుంటారు.

vastu

భారతీయ గృహాల గురించి మాట్లాడితే, ఇంటి మొదటి మెట్టునుండి మొదలు పెట్టి అన్నిటా వాస్తు ప్రకారం అనుకూల శక్తి వరించునట్లు చేయడం ఆనవాయితీ. తద్వారా గృహంనందు శాంతిని నెలకొల్పి, ప్రతికూల ప్రభావాలకు దూరంగా ఉండవచ్చని, తద్వారా ఆర్ధిక స్వావలంబనతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విలసిల్లుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఈ వాస్తుని అనుసరించి తమ బెడ్ రూమ్ ని రూపుదిద్దుకున్న మరియు సర్ధుకున్న జంట పది కాలలపాటు సుఖసంతోషాలతో ఉండగలరని వాస్తుశాస్త్రం చెబుతుంది.

కాబట్టి, విలాసవంతమైన జీవితాన్ని ప్రారంభించడానికి కొత్త జంటలు వారి ఇంటిలో అమలు చేయగల వాస్తు శాస్త్ర చిట్కాల గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.

1. బెడ్ రూమ్ పరిమాణం

1. బెడ్ రూమ్ పరిమాణం

చేతి యొక్క ఐదు వేళ్లు అన్ని పరిమాణాల్లో ఒకే విధంగా ఉండకూడదు, ఇదే విధంగా ఇల్లు యొక్క అన్ని గదుల సైజు సమానంగా ఉంటుందని కూడా చెప్పలేము. అటువంటి పరిస్థితిలో, ఏ గదిని ఎవరు ఆక్రమించాలనే దాని గురించి ప్రశ్నలు కూడా పెద్దగా ఉండవు. ఆదర్శవంతంగా, ఇంటిలో అతిపెద్ద గదిని కుటుంబ పెద్దకి కేటాయించాలి. వాస్తు నిర్మాణాత్మకంగా కట్టబడిన ఇంటిలో, ఇంటి పెద్దకు సంబందించిన గది ఇంటి యొక్క నైరుతి మూలలో ఉండాలి. ఇంటి మధ్యలో ఉండే మాస్టర్ బెడ్ రూమ్ కోసం ఎట్టి పరిస్తితుల్లో వెళ్లరాదు.

2. బెడ్ ప్లేస్

2. బెడ్ ప్లేస్

ఇంటి యొక్క నైరుతి మూలలో అతిపెద్ద గదిని కలిగి ఉండడం ఎల్లప్పుడూ సాధ్యపడదు. అలాంటి పరిస్థితిలో, ఇంటిలోనే అతి పెద్ద గదిని ఎంపిక చేసుకుని ఆ గదిలో దక్షిణానికి లేదా పశ్చిమ గోడకు బెడ్ ఉండేలా ఎంపిక చేసుకోవాలి. గదిలో నిద్రిస్తున్న జంట తలభాగం దక్షిణంగా లేదా పశ్చిమoగా ఉండేలా మరియు కాళ్ళ భాగం ఉత్తరo లేదా తూర్పువైపు వచ్చేలా బెడ్ ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. మరియు గదిలో ఏమూలకి బెడ్ ని ఆపాదించవద్దు. అది సరైనది కాదు.

3. బాత్రూమ్ ప్లేస్

3. బాత్రూమ్ ప్లేస్

బాత్రూమ్ ఉత్తరం లేదా పశ్చిమం వైపున ఉండాలి. ఒక వేళ గది మార్చినా లేక స్నానపు తొట్టి దిక్కుని మారుస్తున్నా మీరు కేటాయింపులు చేయవలసి వస్తే, అది అదే దిశలో జరుగుతుందని నిర్ధారించుకోండి. బాత్రూమ్ నేరుగా మంచానికి ఎదురుగా ఉండరాదు, అది అనేక ప్రతికూల ప్రభావాలను తెస్తుంది. మరియు బాత్రూం తలుపు ఎల్లప్పుడూ మూసివేయబడి ఉండాలి.

4. బెడ్రూం ఎంపిక చేసుకొనడం

4. బెడ్రూం ఎంపిక చేసుకొనడం

దక్షిణం దిక్కున కాకుండా , మాస్టర్ బెడ్ రూమ్ కి ఏ ఇతరదిక్కుకైనా తలుపు ఉండేలా ఎంచుకోవాలి. తూర్పు లేదా ఉత్తరం గోడలు ప్రత్యేకంగా కిటికీలకు సరిపోతాయి. వాస్తుప్రకారం బాత్రూమ్ కి ఒకే తలుపు ఉండేలా చూసుకోవాలి. రెండు తలుపులు ఉండేలా తీసుకోరాదు. దీనికారణంగా ఒకే తలుపు తెరుచుకోవడం, మూయడం జరుగుతుంది తద్వారా శబ్ధాలకు తావుండదు. వివాహిత జంటలు మాత్రమే మాస్టర్ బెడ్ రూమ్ లో ఉండటం మంచిది. మాస్టర్ బెడ్రూంకి భారీ కర్టెన్లు ఉంచరాదు.

5. గాడ్జెట్లకు తావివ్వకండి

5. గాడ్జెట్లకు తావివ్వకండి

బెడ్రూం ఎల్లప్పుడు టి‌వి, కంప్యూటర్, లాప్టాప్ లకు దూరంగా ఉండేలా చూసుకోవాలి . ఒకవేళ టి‌వి ప్లేస్ ఉన్నది అనుకుంటే అది ఖచ్చితంగా ఆగ్నేయ భాగం వైపు ఉండేలా చూసుకోవాలి. హీటర్లు, కూలర్లు లేదా ఏదైనా ఇతర విద్యుత్ ఉపకరణాలు కూడా అదే వైపున ఉంచాలి.

6. అద్దం

6. అద్దం

బెడ్ రూమ్ లో కనీసం ఒక అద్దం ఉండడం అనివార్యం. ఇంటికి సంబంధించిన మహిళ అద్దం ఉండు గదిలో ఉండరాదు, అలంకరణ అక్కడ చేయరాదు. ఒక వేళ బెడ్రూంలో అద్దం ఉంచాల్సిన పరిస్తితి వస్తే, మీ శరీరంలో ఏ భాగo అద్దంలో కనపడుటలేదని నిర్ధారించుకోండి. మీరు మంచంపై నిద్రిస్తున్నప్పుడు ముఖ్యంగా మీరు అద్దంలో కనపడరాదు. కావున మీ డ్రెస్సింగ్ టేబుల్లో ఒక అద్దం ఉందో లేదో నిర్ధారించుకోండి, మరియు ఉత్తరం లేదా తూర్పు దిక్కున అద్దం ఉండునట్లు నిర్ధారించుకోండి.

7. తగని బెడ్ రూమ్ లో ఉండరాదు

7. తగని బెడ్ రూమ్ లో ఉండరాదు

ఇల్లు యొక్క ఆగ్నేయ విభాగంలో ఒక బెడ్ రూమ్ ఉండటం వలన భర్త మరియు భార్యల మధ్య అనేక కలహాలు వస్తాయి. మరియు వాటి కోసం కష్ట సమయాల్లో ప్రతికూల ప్రభావాలు ఎక్కువకలుగుతాయని కూడా వాస్తు శాస్త్ర సారాంశం. అసమర్థ ఖర్చు కూడా పెరుగుతుంది. అందువలన, ఇటువంటి బెడ్ రూమ్ కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ నిరాకరించండి. మీ గృహనిర్మాణ ప్రణాళిక అలాంటి గదిని కలిగి ఉన్నట్లయితే, మీరు దానిని ఒక అధ్యయనగదిగా లేదా అవివాహిత (ప్రాధాన్యంగా మగ) సభ్యునికి ఒక బెడ్రూమ్ గా ఉపయోగించారని నిర్ధారించుకోండి.

8. ఈశాన్యo కూడా సరైనది కాదు

8. ఈశాన్యo కూడా సరైనది కాదు

ఇల్లు యొక్క ఈశాన్యం వైపు దేవతలకు కేటాయించబడి దైవ స్థానానికి అనువుగా ఉంటుంది. కావున ఈ స్థానంలో బెడ్రూం ఆలోచన ఉంటే విరమించుకోవడం మంచిది. ఇంటి యొక్క ఈశాన్యం వైపున మాస్టర్ బెడ్రూం కలిగి ఉన్న జంటలకు అనేక ప్రతికూల పభావాలు ఎదురయి తద్వారా ఆరోగ్య, ఆర్ధిక సంబందిత సమస్యలతో భాదపడటం జరుగుతూ ఉంటుంది. కావున ఆ దిక్కున ఎంచుకోవడం సరికాదు ఎన్నటికీ.

9. గోడలను ఎంచుకోవడం

9. గోడలను ఎంచుకోవడం

నేటి కాలంలో , గోడలపై రంగులు ఏ ఇంటి అలంకరణ ప్రణాళికలో అయినా చాలా క్లిష్టమైన భాగం. వాస్తు ప్రకారం మాట్లాడితే, గులాబీ, బూడిద రంగు, నీలం, చాక్లెట్ లేదా ఆకుపచ్చ రంగును ఎంపిక చేసుకోవాలి. పసుపు లేదా నారింజ రంగుల జోలికే వెళ్లవద్దు. దక్షిణాన లేదా పశ్చిమ గోడలకు మెజ్జనైన్ నేలను కలిగి ఉండడం మంచి ఆలోచన. గోడల మీద అందమైన, ఆహ్లాదకరమైన పెయింటింగ్ వేయాలని కూడా మీరు భావిస్తారు. ఇది అనుకూలతను ప్రసరింపచేస్తుంది మరియు గదిలోకి ప్రవేశించే వ్యక్తి మంచి అనుభూతికి లోనవుతారు. అయితే, మీరు ప్రతికూల లేదా హింసాత్మక చిత్రాల నుండి దూరంగా ఉండాలని నిర్ధారించుకోండి.

English summary

Vastu Shastra tips for bedroom for married couple

Vastu shastra is given the prime importance in Hinduism. Every house before being built will have a thorough check about vastu shastra. Similarly, by following Vastu Shastra for bedroom, especially for married couple, it can bring in a lot of prosperity, wealth, etc. There should be a perfect vastu for the size of the room, placement of bathroom, mirror, etc.
Story first published: Tuesday, March 20, 2018, 18:00 [IST]