పాత ఫర్నీచర్ కి కొత్త లుక్ ని అందించే మార్గాలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీ ఇంటిని కొత్త స్టైల్ లో అలంకరించాలనుకుంటే, ఫర్నీచర్ పై దృష్టిపెట్టాలి. అయితే, కొత్త లుక్ ను కోరుకున్నప్పుడల్లా కొత్త ఫర్నీచర్ ని కొనడమంత సులభం కాదు.

ముఖ్యంగా, యాంటిక్ ఫర్నీచర్ మరింత ఖరీదైనది. మీ కలల్ని సాకారం చేసే యాంటిక్ ఫర్నీచర్ ను సొంతం చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న అంశం. ఇక్కడ, మీరొక చిన్న ట్రిక్ ను అర్థం చేసుకోవాలి. అప్పుడు, మీ ఫర్నీచర్ ను మీరు యాంటిక్ స్టైల్ లో మరల్చుకోవచ్చు.

Ways To Make Furniture Look Antique | How To Make Old Furniture Look Good | How To Make Old Chairs Look Good | How To Make Antique Furniture Look Good

ఫంగస్ నుంచి ఫర్నీచర్ ను రక్షించండి:

కాలంతో పాటు ఫర్నీచర్ పాడయ్యే ప్రమాదం ఉంది. కాలం గడిచే కొద్దీ రంగూ అలాగే పాలిష్ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, పదేళ్ల క్రితం కొన్న ఫర్నీచర్ కూడా కొత్తదానిలా ఉండాలంటే మీరు కొంత ప్రత్యేక శ్రద్ధ కనబరచి తీరాలి.

ఆ ఫర్నిచర్ ను వదిలించుకునేకంటే దానిని వార్నిష్ చేసి దాంట్లోని మ్యాజిక్ ను మళ్ళీ రీక్రియేట్ చేయండి. పాత ఫర్నీచర్ కొత్తగా కనిపించేందుకు ఇదొక మంచి మార్గం.

పిల్లలున్న ఇంట్లో ఫర్నీచర్ ను అందంగా మెయింటెయిన్ చేయడం కష్టమైన విషయమే. అప్పుడు, మీరు ఫర్నీచర్ ను యాంటిక్ గా అలాగే అందంగా ఉంచుకునే మార్గాల గురించి తప్పక తెలుసుకోవాలి.

ఇప్పుడు, పాత ఫర్నీచర్ ను కొత్తగా ఎలా మార్చాలో ఎందుకు మార్చాలో తెలుసుకుందామని మీకు ఆసక్తిగా ఉందా? ఎందుకంటే, కొత్త ఫర్నీచర్ ని కొన్నప్పుడు దానిని అలాగే మీరు ఉపయోగించవలసి వస్తుంది. పాత ఫర్నీచర్ విషయంలో మీరు కొన్ని ప్రయోగాలను చేయవచ్చు.

ఒక బోరింగ్ వుడెన్ కాఫీ టేబుల్ పై గ్లాస్ టాప్ ని జోడించి ఆకర్షణీయమైన సెంటర్ టేబుల్ గా తయారుచేసుకోవచ్చు.

కాబట్టి, మీ రూమ్ లో యాంటిక్ అలాగే ఎత్నిక్ లుక్ ను జోడించాలంటే మీరు ఫర్నీచర్ లో యాంటిక్ లుక్ ను మేళవించాలి. అందుకు, ఈ మార్గాలను అనుసరించాలి.

1. స్క్రాచెస్ ను కవర్ చేయండి:

1. స్క్రాచెస్ ను కవర్ చేయండి:

పాత వుడెన్ ఫర్నీచర్ పై స్క్రాచెస్ ఏర్పడటం సహజం. ఇప్పుడు ఈ ఫర్నిచర్ ను కొత్తగా మార్చడమెలా? డార్క్ వుడెన్ ఫర్నీచర్ లోని స్క్రాచెస్ ను కాఫీ గ్రౌండ్ తో కవర్ చేయండి.

పది నిమిషాలపాటు వేచి ఉండి ఆ తరువాత పొడిగా ఉన్న మృదువైన వస్త్రంతో తుడవండి. చిన్నపాటి స్క్రాచెస్ పై వాల్నట్ గ్రౌండ్ ను అప్లై చేయండి.

 2. పెయింట్ చేయండి:

2. పెయింట్ చేయండి:

ఫర్నీచర్ యాంటిక్ గా కనిపించాలంటే ఈ చిట్కాను పాటించాలి. కుర్చీలకు అలాగే టేబుల్స్ కు ట్రెడిషనల్ లుక్ ను అందించాలంటే కాస్తంత బ్రౌన్ షేడ్స్ ను అప్లై చేయండి. ఇలా కలర్స్ ని అప్లై చేయడం వలన వాతావరణ మార్పుల ప్రభావం ఫర్నీచర్ పై పడదు.

3. మరకలను తొలగించండి:

3. మరకలను తొలగించండి:

కాఫీ మరకలు, చాకొలేట్ లేదా ఏ ఇతర మరకలనైనా వుడెన్ ఫర్నీచర్ నుంచి తొలగించడం కష్టం. కేనోలా ఆయిల్ మరియు వినేగార్ ని కలిపి మరకలను తొలగించవచ్చు. పావు టీస్పూన్ ఆయిల్ లో ముప్పావు కప్పుడు వినేగార్ ను కలిపి ఈ సొల్యూషన్ ను కాటన్ క్లాత్ తో తీసుకుని మరకలపై రుద్దాలి. కొన్ని నిమిషాల తరువాత మీరు మార్పును గమనిస్తారు.

4. వైట్ పెయింట్:

4. వైట్ పెయింట్:

మీ కర్టెన్స్ డార్క్ కలర్ లో ఉంటే, పాత ఫర్నీచర్ ను వైట్ కలర్ తో పెయింట్ చేయడం ద్వారా రూమ్ కి యాంటిక్ లుక్ ని అందించవచ్చు. క్లాసీ లుక్ తో పాటు కలర్స్ ని బాలన్స్ చేయడం ద్వారా ఎలిగెంట్ లుక్ సొంతమవుతుంది.

5. క్రాక్స్ ను తొలగించండి:

5. క్రాక్స్ ను తొలగించండి:

మీ ఫర్నీచర్ పై క్రాక్స్ ఉండి వార్నిష్ వలన ఎటువంటి ప్రయోజనం కలగకపోతే ఈ పరిష్కారాన్ని ప్రయత్నించండి. వార్నిష్ లో కొంత నెయిల్ పాలిష్ ను కలపండి. దీనిని స్క్రాచెస్ ఉన్న ఏరియాపై అప్లై చేయండి. పదినిమిషాలు ఆగండి. ఎండిపోయిన తరువాత ఆ ఏరియాపై సాండ్ పేపర్ తో రబ్ చేస్తే స్మూత్ ఫినిష్ వస్తుంది.

6. వాల్ పేపర్స్ ని వాడండి:

6. వాల్ పేపర్స్ ని వాడండి:

ఇంటిని హౌస్ పార్టీకోసం అలంకరిస్తున్నప్పుడు ఆఖరి నిమిషంలో పాత ఫర్నీచర్ గురించి గుర్తుకువచ్చినప్పుడు వాల్ పేపర్స్ ని వాడండి. మీ హోమ్ డెకార్ అవసరాలకు అనుగుణంగా మంచి మంచి వాల్ పేపర్స్ ను ఎంచుకుని వాటితో ఫర్నీచర్ ను కవర్ చేయండి.

7. బ్లీచ్ ను ఉపయోగించండి:

7. బ్లీచ్ ను ఉపయోగించండి:

మీ దగ్గర అందమైన ప్లాస్టిక్ గార్డెన్ చైర్స్ ఉన్నాయి. అయితే, వాటికి డేమేజ్ అవకుండా ఎలా సంరక్షించాలో మీకు తెలియడం లేదు. వీటిని వదిలించుకునేముందు ఈ ట్రిక్ ను పాటించండి. ఒక బకెట్ నిండా హాట్ వాటర్ ని తీసుకుని అందులో పావు కప్పుడు బ్లీచింగ్ ను వేయండి. స్క్రబ్ చేసి పొడివస్త్రంతో తుడవండి. నిమిషాల్లోనే మీరు ఆశించిన మార్పును గుర్తిస్తారు.

8. చింతపండు:

8. చింతపండు:

ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా ట్రాఫీలు అలాగే బ్రాస్ మెడల్స్, సిల్వర్ లేదా బ్రాన్జ్ మెడల్స్ ఉంటాయి. కాలం గడిచే కొద్దీ వీటిపై దుమ్మూ ధూళి పేరుకుని ఉంటుంది. అలాగే, వాతావరణ మార్పుల వలన ప్యాచెస్ కూడా ఏర్పడతాయి. వాటిని చింతపండుతో తోమి ఆ తరువాత నీటితో శుభ్రపరచాలి. పొడివస్త్రంతో తడిని తుడిచేయాలి. ఇలా చేస్తే, అవి మళ్ళీ గత వైభవాన్ని చాటేందుకు సిద్ధంగా ఉంటాయి.

9. స్టీల్ గొప్పతనాన్ని గుర్తించండి:

9. స్టీల్ గొప్పతనాన్ని గుర్తించండి:

వుడ్స్ పైనే మీరు కాన్సెన్ట్రేట్ చేసి మిగతా ఫర్నీచర్ పై ఫోకస్ పెట్టకపోతే లుక్ అంతా పోతుంది. వాష్ బేసిన్ వంటివి స్టీల్ తో తయారవుతాయి. వాటిపైన వాటర్ మార్క్స్, సబ్బు మరకల వంటివి ఏర్పడతాయి. వీటిని హెయిర్ కండిషనర్ తో రబ్ చేసి సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అప్పుడవి ఎప్పట్లాగే షైనీగా ఉంటాయి.

10. పిల్లోస్ పై దృష్టి పెట్టండి:

10. పిల్లోస్ పై దృష్టి పెట్టండి:

పాత ఫర్నీచర్ ను కొత్తగా మార్చాలని భావిస్తున్నప్పుడు కేవలం వుడెన్ ఫర్నీచర్ పైనే దృష్టి పెడతాము. సోఫాస్ అలాగే పరుపులపై ఉండే పిల్లోస్ ను ఇగ్నోర్ చేస్తాము. ఎక్కువకాలం వాడటం వలన వాటి అందం కోల్పోతుంది. కాబట్టి, పిల్లో కవర్స్ ని కొత్తవి తీసుకోవడం అలాగే పిల్లోస్ లో స్టఫింగ్ అవసరమేమో తెలుసుకోవడం ద్వారా మళ్ళీ వాటి లుక్ ను మెరుగ్గా చేయవచ్చు.

1. రాగికి లెమన్ రెమెడీ

1. రాగికి లెమన్ రెమెడీ

కాపర్ లైనింగ్స్ తో పాత మిర్రర్ మీ ఇంట్లో ఉందా? లేదా కాపర్ ఫ్రేమ్ కలిగిన పెయింటింగ్స్ ఉన్నాయా? అయితే, వాటిలోని మెరుపును అందించేందుకు మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అర టీస్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని అందులో రెండు స్పూన్ల బేకింగ్ సోడాను కలపాలి. ఈ మిశ్రమంతో కాపర్ ని రబ్ చేసి ఆ తరువాత పొడి వస్త్రంతో వైప్ చేస్తే మ్యాజిక్ ను మీరే గమనించగలుగుతారు.

English summary

Ways To Make Furniture Look Antique | How To Make Old Furniture Look Good | How To Make Old Chairs Look Good | How To Make Antique Furniture Look Good

If you think to decorate your home in a new style, you must think of the furniture of your home. But is it easy to buy new furniture every time you want a new look?Specifically, the antique furniture is so expensive that those cost a lot to fulfill your dream. Here you need some trick and appropriate ways to make furniture look antique.