For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాస్తుప్రకారం మీ ధనాన్ని ఉంచవలసిన ప్రదేశాలు ఇవే.

|

వాస్తు అనేది హిందూమతానికి చెందిన విజ్ఞాన శాస్త్రం. ఇది వాతావరణంలోని అనేక శక్తుల మేళవింపుతో ఉంటుంది. ఈ వాస్తు ద్వారా గృహ శాంతి, సంపద మరియు సానుకూల ఫలితాలు పొందవచ్చు అని అనేకమంది విశ్వాసం.

గృహ నిర్మాణం దగ్గర నుండి వస్తువుల స్థలం ఎంపికలో కూడా వాస్తు అనేది ప్రధానంగా వినపడుతుంది. ఒకప్పటి కాలంలో వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే, వాస్తు ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధమవుతూనే ఉంది. అలాగే వాస్తు ప్రకారం ఏ దిక్కున ఏ వస్తువుని ఉంచాలి అని కూడా ప్రత్యేకంగా చెప్పబడినది.

మీరు వాస్తుని నమ్ముతారా ? ఈ వాస్తుని పాటించడం ద్వారా మీకు సానుకూల ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నారా? అయితే మీ సంపదకు సంబంధించిన కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు మీకోసం.

Where To Keep Money According To Vastu

మనందరి ఇళ్ళలోనూ డబ్బు మరియు విలువైన సంపద ఉంటుంది. కాని మనలో కొందరు డబ్బుని ఎక్కడ నిల్వ చేస్తారు అనే విషయంపై ప్రత్యేకంగా ఆలోచించక పోయినా, కొందరు మాత్రం విలువైన వస్తువులని ఎక్కడ ఉంచాలి అనే విషయంలో వాస్తుని ప్రత్యేకంగా అనుసరిస్తూ ఉంటారు.

దీనికి సంపద, శ్రేయస్సు, అదృష్టం, విజయం, లేదా ఆస్తి రెట్టింపు అవడం మొదలైనవి కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ మీ నగలు, డబ్బు భద్రపరచుకునేందుకు వాస్తుప్రకారం కొన్ని చిట్కాలను పొందుపరచడం జరిగినది. అవేమిటో చూద్దాం.

వీటిని ఉత్తర దిశలోనే ఉంచండి

వీటిని ఉత్తర దిశలోనే ఉంచండి

ఉత్తర దిక్కుని కుబేర స్థానంగా హిందూ శాస్త్రాల ప్రకారం పరిగణించబడుతుంది. కుబేరుడిని సంపదలకు దేవునిగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం, విలువైన వస్తువులను ఉంచే నగదు పెట్టెను ఎల్లప్పుడూ ఉత్తర దిశలోనే ఉంచాలి. తద్వారా కుబేరుని కృపా కటాక్షాల కారణంగా అదృష్టం వరిస్తుందని సంపద రెట్టింపు అవుతుందని అత్యధికుల విశ్వాసం.

దక్షిణ దిక్కు విషయంలో జాగ్రత్త

దక్షిణ దిక్కు విషయంలో జాగ్రత్త

ఉత్తర దిక్కున నగదు పెట్టెను ఉంచినా, దాని అభిముఖం మాత్రం దక్షిణ దిక్కున ఉండకూడదు అని వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పబడినది. ఇలా చెయ్యడం వలన దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కుకి ప్రయాణించి లక్ష్మి దేవి కొలువుతీరుతుంది అని నమ్ముతారు. దీని కారణాన అదృష్టం తమ వశమవుతుందని భావిస్తారు.

తూర్పు దిశలో మీ నగదు పెట్టెని ఉంచడం

తూర్పు దిశలో మీ నగదు పెట్టెని ఉంచడం

ఏవేని కొన్ని కారణాల చేత నగదు పెట్టెని ఉత్తరదిక్కులో ఉంచలేని పక్షములో , తూర్పు దిక్కు దీనికి ప్రత్యామ్నాయం గా చెప్పబడినది. ముఖ్యంగా దుకాణ యజమానులకు ప్రత్యేకించిన స్థలంగా కూడా చెప్పబడుతున్నది. ఒకవేళ కాషియర్ నైరుతి దిశకి అభిముఖంగా ఉన్న ప్రదేశం ఎంచుకొనినట్లయితే ఈ నగదు పెట్టెని అతని ఎడమచేతి వైపున ఉంచడం శ్రేయస్కరం, అలాకుండా తూర్పుకి అభిముఖంగా ఉంటే నగదు పెట్టెని కుడివైపున ఉంచడం మంచిది అని వాస్తు శాస్త్రంలో చెప్పబడినది.

గదిలోని నాలుగు మూలల యందు నగదు పెట్టెని ఉంచరాదు .

గదిలోని నాలుగు మూలల యందు నగదు పెట్టెని ఉంచరాదు .

గదిలో నాలుగు మూలల్లో మీ నగదు పెట్టెని, ముఖ్యంగా ఈశాన్య, ఆగ్నేయ లేదా నైరుతి మూలలో ఉంచరాదు. మీ నగదు పెట్టె ఉత్తరం వైపు ఉంచడం మంచిది. సాధ్యమైతే, పూర్తిగా దక్షిణ ప్రాంతాలను నివారించండి. ఇది దురదృష్టాన్ని తెచ్చే కార్యంగా మిగలడంతో పాటు సంపద పూర్తిగా నాశనం అగునట్లు చేయును.

మీ నగదు పెట్టెని పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు

మీ నగదు పెట్టెని పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు

దీనికి కారణాలు తెలియకపోయినా, వాస్తు ప్రకారం మీ డబ్బును ఉంచడానికి పూజగది సరైన స్థలం కాదు అని చెప్పబడినది. మీ పూజ గది మీ పడకగదికి లేదా డ్రెస్సింగ్ గదికి జోడించబడి ఉంటే, మీరు మీ నగదు పెట్టెని బెడ్ రూమ్ లో లేదా మీ వార్డ్రోబ్ లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

మీ నగదు పెట్టె ప్రధాన ద్వారం నుండి కనిపించకూడదు

మీ నగదు పెట్టె ప్రధాన ద్వారం నుండి కనిపించకూడదు

నగదు పెట్టె, మీ ప్రధాన తలుపు లేదా ప్రధాన ద్వారం నుండి కనిపించినట్లయితే, మీ డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది అని నమ్ముతారు. ఇది లక్ష్మీదేవి ఇల్లువదిలి వెళ్ళుటకు సూచనగా కనిపిస్తుంది. ఇది మంచి సంకేతం కాదు. అదేవిధంగా వాస్తు ప్రకారం బాత్రూమ్, టాయిలెట్, కిచెన్, స్టోర్ రూమ్, నేలమాళిగ లేదా మెట్ల మార్గాన్ని ఎదుర్కొనే ఏ స్థలంలోను నగదు పెట్టెని ఉంచరాదు.

మీ సేఫ్ మరియు క్యాష్ బాక్స్ నిర్వహణలో ఇతర చిట్కాలు

మీ సేఫ్ మరియు క్యాష్ బాక్స్ నిర్వహణలో ఇతర చిట్కాలు

• నగదును ఉంచే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండునట్లు చూసుకోవాలి. మరియు ఎల్లప్పుడూ ఆ ప్రదేశం మీ కనుసన్నల్లో జాగ్రత్తగా ఉండేలా మసలుకోవాలి.

• మీ నగదు పెట్టెని ఫైళ్ళు మరియు పత్రాలతో నింపవద్దు. ఇది అసౌకర్యంగా కూడా ఉంటుంది.

• మీ నగదు పెట్టె ఖాళీగా వదలకండి. కనీసం ఒక్క రూపాయినైనా ఉంచడం విధి.

• మీ ఇంటి మొదటి గదిలో లేదా చివరిగదిలో నగదు పెట్టెను ఉంచకండి. ఇది శ్రేయస్కరం కూడా కాదు.

• కిటికీ లేదా వెంటిలేటర్ వద్ద మీ నగదు పెట్టెని ఉంచవద్దు. ఇది మీ ఇంటిని వదిలిపెట్టే సంపదను సూచిస్తుంది.

ఈ విధంగా వాస్తుప్రకారం మీ నగదు పెట్టెని ఉంచినట్లయితే, సానుకూల ఫలితాలతో పాటు అదృష్టం వరిస్తుంది అని ఏంతో మంది విశ్వసిస్తారు.


English summary

Where To Keep Money According To Vastu

Where To Keep Money According To Vastu,If you want to increase wealth in your house, there are certain places to keep money in your house. So read to know which are the right places to keep money according to vastu.
Story first published:Thursday, March 8, 2018, 13:30 [IST]
Desktop Bottom Promotion