For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రికి పూజగదిని శుభ్రపరచుకోండిలా !

|

ప్రస్తుతం నవరాత్రి కాలం నడుస్తూ ఉంది. క్రమంగా మన ఇళ్ళలో శక్తివంతమైన దుర్గాదేవిని స్వాగతించడానికి మనమంతా ఏంతో ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. ఈ ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేకించి అలంకరించబడిన పూజగదిని ఏర్పాటు చేసి, దుర్గా దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి 9 రోజులపాటు దీక్షను నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుంది.

నవరాత్రి, దుర్గా పూజ వంటి హిందూ పండుగలు దాదాపు దగ్గరలో ఉన్నందున, మీ ఇంటిని అలంకరించుకోవడానికి మరియు శుభ్రపరచడానికి ఇది సమయంగా ఉంటుంది. సరికొత్త దైవిక సంబంధ వస్తువులను ఇంటికి తీసుకురావడమే కాకుండా, దుర్గాదేవిని స్వాగతించడానికి మొదటగా మీ ఇంటిని, పూజగదిని మరియు పూజగది సామాగ్రిని దుమ్ము ధూళి లేని విధంగా సిద్దపరచవలసి ఉంటుంది.

హిందూ పురాణాల ప్రకారం దేవుడు, శుభ్రంగా, చక్కగా మరియు సానుకూలతతో కూడుకుని ఉన్న ఇంటిని మాత్రమే సందర్శిస్తాడని చెప్పబడుతుంది. కావున, నవరాత్రి మరియు దుర్గా పూజను మీ గృహమునందు జరపాలని సంకల్పించిన ఎడల, రాబోయే పండుగలకు మీ ఇంటిని సిద్ధం చేసుకునే క్రమంలో భాగంగా కొన్ని శుభ్రపరిచే చిట్కాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది.

ఇంటిని శుభ్రపరచడంలో భాగంగా, పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా ముఖ్యం. కాకపోతే కొన్ని జాగ్రత్తలను తీసుకోవలసి ఉంటుంది. నవరాత్రి దగ్గరలో ఉన్న కారణాన, మీ పూజ గదిని శుభ్రం చేసుకుని దైవిక కార్యకలాపాలకు సిద్ధం చేసుకునే క్రమంలో భాగంగా ఇక్కడ కొన్ని చిట్కాలను పొందుపరచడం జరిగింది.

నవరాత్రి కోసం పూజ గదిని శుభ్రపరచే విధానాలు:

నవరాత్రి కోసం పూజ గదిని శుభ్రపరచడం:

శుభ్రపరిచే అంతస్తు:

పూజ గది ఉన్న అంతస్తును శుభ్రం చేయడం అత్యంత కీలకమైన అంశం. పూజ గది లోపల ఒక చిన్న ఆలయాన్ని నిర్మించినట్లయితే, దానిని సబ్బు నీటి ద్రావణంతోకానీ, ప్రత్యేకించబడిన క్లీనింగ్ ఏజెంట్లతో కానీ శుభ్రం చేయండి.

విగ్రహాన్ని శుభ్రపరచడం:

మీఇంటిలో లోహం లేదా వెండితో చేసిన దుర్గా దేవి విగ్రహం ఉన్న పక్షంలో, ఉప్పు లేదా టూత్పేస్ట్ వంటి సాధారణ పదార్ధాలతో శుభ్రం చేయండి. ఇది విగ్రహాన్ని శుభ్రపరచడమే కాకుండా ప్రకాశించేలా చేస్తుంది.

పూజగది పాత్రలు మరియు వస్తువులు:

పూజ గదులలో, పూజ సామాగ్రిలో భాగంగా రాగి పాత్రలు ఉండడం సర్వసాధారణం. క్రమంగా, మీ పూజగదిలో రాగి పాత్రలు ఉన్నట్లయితే, చింతపండు గుజ్జు లేదా టూత్పేస్ట్తో శుభ్రం చేయండి. టూత్పేస్ట్, వెండి పాత్రలను శుభ్రం చేయడంలో అత్యుత్తమ ఫలితాలని అందిస్తుంది.

దీపపు సామాగ్రి:

మంట మరియు నెయ్యి కారణంగా మట్టితో చేసిన దీపపు ప్రమిదలు జిడ్డుగా మారి నల్లగా తయారవుతాయి. వీటిని, వేడి సబ్బు నీటిలో 20 నుండి 25 నిమిషాలపాటు నానబెట్టండి. ఆపై, వాటి నుండి నూనె మరియు ముదురు మరకలను తొలగించడానికి స్క్రబ్ చేయండి. ఇక దీపపు స్తంభాలు మరియు దీపపు కుందెలు ఎక్కువగా ఇత్తడి సామాగ్రిగా ఉంటాయి. వీటిని చింతపండు, ఉప్పు మరియు పేస్టుతో శుభ్రం చేయవచ్చు.

విగ్రహానికి అలంకరించే బట్టలు:

నవరాత్రి కోసం పూజ గదిని శుభ్రపరచడం పూర్తయిన తర్వాత, విగ్రహానికి అలంకరించే బట్టలు, దండలు, చునారి, తలపాగా వంటి ఉపకరణాలను శుభ్రం చేయడం తప్పనిసరి. వాస్తవానికి, నవరాత్రి కోసం దుర్గాదేవిని అలంకరించడానికి కొత్త బట్టలను కొనవలసి ఉంటుంది. అయినప్పటికీ, చాలామంది ఇళ్లలో ఇటువంటి ఉపకరణాలు పునరావృతం చేయడం జరుగుతుంటుంది. ఒకవేళ మీరు ఆ విధానాన్ని అనుసరిస్తున్న పక్షంలో, ఉపకరణాలను సబ్బు నీటిలో నానబెట్టి, శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవలసి ఉంటుంది.

పూజ గంట:

నవరాత్రి కోసం పూజ గదిని శుభ్రపరచడం అంత గమ్మత్తైన విషయమేమీ కాదు. పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. లోహంతో తయారుచేసిన పూజ గంటను చింతపండు గుజ్జుతో శుభ్రం చేయడం ఉత్తమం.

టైల్స్:

మీకు గోడపై లేదా నేలపై టైల్స్ ఉన్నట్లయితే, వాటిని సబ్బు నీటి ద్రావణంతో శుభ్రం చేయండి. ఒకవేళ ఆ టైల్స్(ఫలకాలు) మీద గ్రీజు మరకలు ఉంటే, వాటిని శుభ్రం చేయడానికి వెనిగర్ మరియు నీటిని వాడండి.

మీ పూజ గదిని శుభ్రపరచుకుని, నవరాత్రి పండుగకు సిద్ధం చేయడానికి ఈ చిట్కాలు మీకు సహాయపడగలవు. అంతేకాకుండా, నవరాత్రి విధివిధానాలతో సంబంధం ఉన్న ఆచారాలను కూడా చదవండి. మరిన్ని వివరాలకు మీ ఆలయ పూజారిని సంప్రదించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, ఆరోగ్య, ఆహార, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, తదితర సంబంధిత అంశాలకై బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Cleaning Puja Room For Navratri

if you are celebrating Navratri or Durga Puja, here are few cleaning tips to prepare your home for the upcoming festival. Apart from cleaning the overall house, it is very important to clean the Puja room. As Navratri has come closer, here are few tips to clean your Puja room and prepare for Navratri.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more