For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీకు తాబేలు ఇంటిలో ఎలా పెంచాలి?

By B N Sharma
|

Greek Tortoise – Tips To Care For Your Pet
పెంపుడు జంతువులపై ఆసక్తి కలవారికి తాబేలు పెంపకం బాగుంటుంది. ఇది కొంచెం కష్టమైనప్పటికి, తాబేలు ఎంతో స్నేహపూరితంగా వుంటుంది. సాధారణంగా గ్రీకు తాబేలు పర్వత ప్రాంతాలలో నివసిస్తుంది. కాని ఏ ప్రాంతంలో అయినా సరే తేలికగా అక్కడి వాతావరణానికి ఇమిడిపోతుంది. కనుక ఇంటి పెంపుడు జంతువుగా బాగానే వుంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే తాబేలు ఒకే చోట 50 సంవత్సరాలవరకు వుండగలదు. దీని ఆహారం, వసతి వంటివి ఎలా వుండాలో చూద్దాం!

తినటమంటే తాబేళ్ళకు చాలా ఇష్టం. పచ్చని కూరలు, పండ్లు, చిన్న పురుగులు లాంటివి తింటాయి. మినరల్స్, విటమిన్లు జల్లిన కొన్ని పచ్చి కూరలు, సలాడ్లు వంటివి ఆహారంగా పెట్టవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో కాల్షియం కల పదార్ధాలు కూడా ఇవ్వండి. ఎండుగడ్డి, హానిలేని మొక్కలు కూడా పెట్టవచ్చు. వీలైనంత వరకు పండ్లు పెట్టకండి. ఉష్ణోగ్రత అధికంగా వుంటే వారానికో పండు పెట్టవచ్చు. తాగునీటి అవసరంకుగాను వెడల్పాటి పళ్ళెంలో నీరు పెడితే అది ఎపుడు అవసరపడితే అపుడు అందులో మునక వేస్తూంటుంది.

దీనికి వసతి ఎలా వుండాలి?
పొడిగాను, కొద్దిపాటి వెచ్చగాను వుండాలి. 4 X 2అంగుళాల చిన్న రంధ్రం వుంటే చాలు. అది వుండే ప్రదేశంలో కొద్ది ఎండుగడ్డి వుంచితే దానిపై రిలాక్స్ అవుతుంది. విటమిన్ డి 3 , కాల్షియం మొదలైనవాటి కొరకు అల్ట్రా వయొలెట్ కిరణాలు కల బల్బులను పెట్టండి. అది తవ్వుకోటానికి గాను కొంత జాగా కేటాయించండి. ఇంటిలోపల పెంచేట్లయితే, చెక్క లేదా ప్లాస్టిక్ టబ్ వసతిగా దానికి పెట్టండి. కాని తాబేళ్ళు బయట వసతినే ఇష్టపడతాయి. అయితే, వాటిని ఇతర జంతువులనుండి కాపాడుతూండాలి.

ఈ చిన్నపాటి చిట్కాలు ఆచరించి గ్రీక్ తాబేలు మీ ఇంటి పెంపుడు జంతువుగా పెంచుకోవచ్చు.

English summary

Greek Tortoise – Tips To Care For Your Pet | గ్రీకు తాబేలు ఇంటిలో ఎలా పెంచాలి?

Also known as the spur-thighed tortoise, this tortoise is one among the favorites when it comes to choosing a tortoise as a pet. This is a hardy, yet friendly tortoise. The Greek tortoise is adapted to living in semi-arid and rocky areas. However, it adapts easily to new environments too, thus making it a suitable choice for a pet.
Story first published:Friday, October 14, 2011, 11:15 [IST]
Desktop Bottom Promotion