Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అపార్టుమెంటుకు అనువైన పెంపుడు కుక్క!

అపార్టుమెంటు నివాసితులకు పనికివచ్చే పెంపుడు కుక్కలు:
1. బుల్ డాగ్ - ఇంగ్లీష్ బుల్ డాగ్ లు కుక్కజాతులన్నింటిలోకి చాలా బద్ధకస్తులు. ఇరవైనాల్గు గంటలు నిద్రపోతాయి. ఏ శిక్షణకు ఇష్టపడవు. ఎపుడూ యజమాని, కుటుంబంకు అంటిపెట్టుకుని వుంటాయి. తిండి బాగా తింటాయి. కష్ట పడటమంటే ఇష్టముండదు. అరవను కూడా అరవవు. నిద్ర మాత్రం గురకపెట్టి పడుకుంటాయి. ఇంత సోమరి కుక్కలతో మీ పొరుగువారికి ఏ సమస్య వుండదు.
2. గోల్డెన్ రిట్రీవర్ - నేస్తానికి గోల్డెన్ రిట్రీవర్ పెట్టింది పేరు. చురుకైనవి. శిక్షణ నివ్వటం తేలిక. యజమాని అంటే విశ్వాసం. అందరితో సఖ్యంగా వుంటాయి.ఆటలంటే ప్రాణం. అందరూ తమను ప్రేమించాలనుకుంటాయి. లేదంటే నిరాశ పడతాయి.
3. పగ్ - ఈ జాతి కుక్కను హచ్ కంపెనీ ప్రకటనలకు వాడేది. చిన్ని బొమ్మల్లా వుంటాయి. వీటి పుటక చైనా దేశం. తన యజమాని ఎక్కడకెడితే ఇది అక్కడకెడుతుంది. చాలా పిరికివి. వీటికి ప్రేమ, శ్రధ్ధ కావాలి. పక్కవారు కూడా దీనిని తేలికగా మచ్చిక చేసేసుకుంటారు.
4. కాకర్ స్పానియల్ - ఫ్యాన్సీగా వుండే కుక్క. మహిళలు బాగా ఇష్టపడతారు. తమ ఆటపాటలకు అందరూ మెచ్చుకోవాలని కోరుకుంటాయి. చిన్నవవిగా వుండి బొచ్చు కలిగి వుంటాయి.
5. డచ్ షండ్ - ఇది హౌండ్ జాతికి చెందినది. కాళ్ళు పొట్టి, శరీరం పొడవు. జర్మన్ జాతి కుక్క. బయటకు వెళ్ళాలంటే ఇష్టపడదు. యజమానిని బాగా ఇష్టపడుతుంది.



Click it and Unblock the Notifications