Latest Updates
-
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.!
గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కలకు ఆహారం ఏం ఇవ్వాలి?
మీ ఇంటి పెంపుడు కుక్క గోల్డెన్ రిట్రీవరా? ఈ జాతి కుక్కలు ఇష్టపడే ఆహారాలు కొన్ని మీరు తెలుసుకొని వుండాలి. ఇవి ఆరోగ్యంగాను చురుకుగాను వుండాలంటే అటువంటి ఆహారాలు తినాల్సిందే. అవేమిటో పరిశీలిద్దాం!చాలామం

చాలామంది కుక్కల యజమానులు తమ కుక్కలకు పచి్చ ఆహారాన్నిస్తారు. కాని మేం చెప్పేది సగం ఉడికించిన ఆహారాన్ని వాటికి పెట్టాలి. రిట్రీవర్ కుక్కలకు పాలు, చపాతి, గుడ్డు మంచి ఆహారం. మార్కెట్ లో దొరికే పెడిగ్రీ ఆహారం కూడా వీటికి మంచిదే. కుక్కలకు ఆహారం ఏది ఇచ్చినప్పటికి, అది పరిశుభ్రంగా వుండాలి. ఈ జాతి కుక్కలు చాలా సెన్సిటివ్ గా వుంటాయి. బిస్కట్లు, వండిన బ్రౌన్ రైస్, ఉడికించిన గుడ్డు, ఉడికించిన బంగాళాదుంపలు, వేపిన గోధుమ బ్రెడ్ మొదలైనవి గోల్డెన్ రిట్రీవర్ కు మంచి ఆహార పదార్ధాలు.
గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కలు తోడేలు సంతతికి చెందింది. కనుక తోడేలుకు ఏ ఆహారాలు ఇష్టమే సాధారణంగా అవి వీటికి కూడా ఇష్టంగానే వుంటాయి. ప్రతిరోజూ కావలసినంత మాంసం, గింజ ధాన్యాల ఆహారం వీటికి పెడితే చాలు. చికెన్, మాంసం ముక్కలు వండిన అన్నంతోను, కొద్దిగా ఉడికించిన కూరలు - కేరట్లు, బంగాళదుంపలు వీటికి విందు భోజనమే. ఇక వీటికి స్నాక్స్ గా వేయించి బ్రెడ్ ముక్కలు వివిధ ధాన్యాల బిస్కట్లు, పాలలో ముంచిన బ్రెడ్ ముక్కలు వీటికి బాగా ఇష్టంగా వుంటాయి. గోల్డెన్ రిట్రీవర్ కుక్కలకు మాంసం ఉప ఉత్పాదనలైన నరాలు, ముక్కులు, మెడ, కాళ్ళు, మొదలైనవి పెట్టరాదు. సహజంగా లభించే మాంసం పెట్టాలి.
ఈ ఆహారపు జాగ్రత్తలు తీసుకుంటే మీ గోల్డెన్ రిట్రీవర్ ఆరోగ్యంగా వుండటమే కాక చురుకుగా, ఉత్సాహంగా ఉండి మీకు, కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications
