For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డెన్ రిట్రీవర్ ఆహారం ఎలా వుండాలి?

మీ పెంపుడు కుక్క గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిందా? బొచ్చు అధికంగా వుండే ఈ కుక్క ఆరోగ్యంగాను, చురుకుగాను వుండాలంటే సరి అయిన ఆహారం ఇవ్వాలి. ఈ రకం కుక్కలకు ఏ రకమైన ఆహారం బాగుంటుందో చూద్దాం -కుక్కలకు

By B N Sharma
|

Dog
మీ పెంపుడు కుక్క గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిందా? బొచ్చు అధికంగా వుండే ఈ కుక్క ఆరోగ్యంగాను, చురుకుగాను వుండాలంటే సరి అయిన ఆహారం ఇవ్వాలి. ఈ రకం కుక్కలకు ఏ రకమైన ఆహారం బాగుంటుందో చూద్దాం -

కుక్కలకు చాలామంది పచ్చి ఆహారాన్నే ఇస్తారు. కాని వాటికి సగం ఉడికినది మిగిలిన సగం పచ్చిదిగా ఇవ్వటం మంచిది. పాలు, చపాతి, గుడ్డు మొదలైనవి గోల్డెన్ రిట్రీవర్లకు మంచి ఆహారం. గొల్డెన్ రిట్రీవర్ చాలా సెన్సిటివ్. దీనికి ఎంతో పరిశుభ్రమైన ఆహారాన్నివ్వాలి. బిస్కట్లు, ఉడికించిన బ్రౌన్ రైస్, ఉడికించిన గుడ్డు, బంగాళదుంపలు, కాల్చిన గోధుమ బ్రెడ్ మొదలైనవి బాగా ఇష్టపడతాయి.

ఇవి తోడేలు జాతికి చెందినవని, కనుక తోడేళ్లు ఏది ఇష్టపడితే ఇవి కూడా అవే ఇష్టపడి తింటాయని చెపుతారు. వీటికి ప్రతి రోజూ కొంత మాంసం, అన్నం పెట్టవచ్చు. చికెన్, గొర్రె మాంసం కూడా వండిన అన్నంతో పెట్టవచ్చు. కేరట్స్, బంగాళదుంప లాంటి కూరలతో అన్నం పెట్టవచ్చు. టోస్ట్ చేసిన లేదా పాలతో కలిపిన బ్రెడ్, బిస్కట్లు వీటికి స్నాక్స్ గా ఇవ్వండి. మాంస సంబంధిత ఉత్పత్తులైన పేగులు, ముక్కులు, మెడ, కాళ్ళు వంటివి గోల్డెన్ రిట్రీవర్ కు ఎపుడూ ఇవ్వవద్దు. సహజమైన ఆహారాన్నే ఇవ్వటం సూచించదగినది.

English summary

What Foods to give Golden Retrievers? | గోల్డెన్ రిట్రీవర్ ఆహారం ఎలా వుండాలి?

You can give him any food but all that you need care is hygiene as the dog breed is a little sensitive. Biscuits, boiled brown rice, boiled egg, mashed potatoes, toasted wheat bread are all good golden retriever diet foods.
Desktop Bottom Promotion